Crime Thriller Web Series: విజ‌య్ సేతుప‌తి త‌మిళ్ క్రైమ్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్ టైటిల్ ఇదే - స్ట్రీమింగ్ ఎందులో అంటే?-vijay sethupathi tamil web series title fixed this crime thriller series streaming soon on disney plus hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Crime Thriller Web Series: విజ‌య్ సేతుప‌తి త‌మిళ్ క్రైమ్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్ టైటిల్ ఇదే - స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Crime Thriller Web Series: విజ‌య్ సేతుప‌తి త‌మిళ్ క్రైమ్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్ టైటిల్ ఇదే - స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Nelki Naresh Kumar HT Telugu
Jun 20, 2024 06:08 AM IST

Crime Thriller Web Series: నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్ ఎం.మ‌ణికంద‌న్‌తో విజ‌య్ సేతుప‌తి ఓ త‌మిళ వెబ్‌సిరీస్ చేస్తున్నాడు. క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ సిరీస్‌కు విండ్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన‌ట్లు విజ‌య్ సేతుప‌తి రివీల్ చేశాడు.

విజ‌య్ సేతుప‌తి
విజ‌య్ సేతుప‌తి

Crime Thriller Web Series: మ‌హారాజ మూవీతో లాంగ్ గ్యాప్ త‌ర్వాత బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ అందుకున్నాడు కోలీవుడ్ వెర్స‌టైల్ హీరో విజ‌య్ సేతుప‌తి. రివేంజ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ ఐదు రోజుల్లో 32 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్‌ రాబ‌ట్టింది.

తెలుగు వెర్ష‌న్ 7.50 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్‌...3.75 కోట్ల వ‌ర‌కు షేర్ క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది. తెలుగులోనూ బ్రేక్ ఈవెన్‌ను దాటేసింది. విజ‌య్ సేతుప‌తి తెలుగు డ‌బ్బింగ్ మూవీస్‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ సాధించిన సినిమాగా మ‌హారాజ నిలిచింది. విజ‌య్ సేతుప‌తి కెరీర్‌లో యాభైయ్య‌వ మూవీగా మ‌హారాజ రిలీజైంది.

క్రైమ్ థ్రిల్ల‌ర్ సిరీస్‌...

మ‌హారాజ త‌ర్వాత త‌మిళంలో మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న విజ‌య్ సేతుప‌తి ఓ వెబ్‌సిరీస్‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడు. యాక్ష‌న్ క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ వెబ్‌ సిరీస్‌కు ఎం మ‌ణికంద‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నారు. ఈ సిరీస్‌కు విండ్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన‌ట్లు మ‌హారాజ ప్ర‌మోష‌న్స్‌లో విజ‌య్ సేతుప‌తి పేర్కొన్నాడు.

ఈ సిరీస్ షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకున్న‌ట్లు విజ‌య్ సేతుప‌తి చెప్పాడు. డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లో విండ్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. తొంద‌ర‌లోనే టైటిల్‌తో పాటు వెబ్‌సిరీస్ రిలీజ్ డేట్‌ను ఆఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తోన్నారు. ఆగ‌స్ట్‌లో ఈ వెబ్‌ సిరీస్ స్ట్రీమింగ్ అయ్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు చెబుతోన్నారు.

నేష‌న‌ల్ అవార్డ్స్‌...

విండ్ సిరీస్‌లో జాకీ ష్రాఫ్ కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. గ‌తంలో విజ‌య్ సేతుప‌తి, డైరెక్ట‌ర్ ఎం. మ‌ణికంద‌న్ కాంబినేష‌న్‌లో అండ‌వ‌న్ క‌ట్ట‌లై, క‌డైసి వివ‌సాయి సినిమాలు రూపొందాయి.

క‌డైసి వివ‌సాయి మూవీ బెస్ట్ త‌మిళ్ మూవీగా నేష‌న‌ల్ అవార్డును సొంతం చేసుకున్న‌ది. ధ‌నుష్ ప్రొడ‌క్ష‌న్‌లో వ‌చ్చిన కాకా ముట్టై మూవీతో ఎం. మ‌ణికంద‌న్ డైరెక్ట‌ర్‌గా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కాకా ముట్టై కూడా బెస్ట్ చిల్డ్ర‌న్ మూవీగా నేష‌న‌ల్ అవార్డును ద‌క్కించుకొంది.

ఫ‌ర్జీ త‌ర్వాత‌....

విండ్‌...త‌మిళంలో విజ‌య్ సేతుప‌తి న‌టిస్తోన్న ఫ‌స్ట్ వెబ్‌సిరీస్‌. ఓవ‌రాల్‌గా విజ‌య్ సేతుప‌తి కెరీర్‌లో ఇది సెకండ్ వెబ్‌సిరీస్‌. ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ రాజ్‌, డీకే ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన హిందీ వెబ్‌సిరీస్ ఫ‌ర్జీతో ఓటీటీలోకి విజ‌య్ సేతుప‌తి ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో టాస్క్ ఫోర్స్ ఆఫీస‌ర్‌గా త‌న యాక్టింగ్‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు.

జ‌వాన్‌లో విల‌న్‌...

త‌మిళంలో టాప్ స్టార్ల‌లో ఒక‌రిగా కొన‌సాగుతోన్న విజ‌య్ సేతుప‌తి హిందీ, తెలుగులో సినిమాలు చేస్తోన్నాడు. బాలీవుడ్‌లో గ‌త ఏడాది రిలీజైన‌ షారుఖ్‌ఖాన్ జ‌వాన్‌లో విల‌న్‌గా క‌నిపించాడు. షారుఖ్‌కు ధీటుగా త‌న విల‌నిజంతో అద‌ర‌గొట్టాడు. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీ ప‌ద‌కొండు వంద‌ల కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. అలాగే క‌త్రినాకైఫ్‌తో మెర్రీ క్రిస్మ‌స్ అనే సినిమా చేశాడు.

అంధాదూన్ ఫేమ్ శ్రీరామ్ రాఘ‌వ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్‌గా నిలిచింది. విజ‌య్ సేతుప‌తి గాంధీ టాక్స్ మూవీ త్వ‌ర‌లో థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతోంది. డైలాగ్స్ లేకుండా మూకీ మూవీగా ప్ర‌యోగాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో అర‌వింద్ స్వామి, అదితి రావ్ హైద‌రీ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

WhatsApp channel