Merry Christmas First Poster: విజ‌య్ సేతుప‌తి బాలీవుడ్ మూవీ ఫ‌స్ట్ లుక్- హీరోహీరోయిన్లు లేకుండానే పోస్ట‌ర్ రిలీజ్‌-vijay sethupathi katrina kaif merry christmas first look unveiled ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Merry Christmas First Poster: విజ‌య్ సేతుప‌తి బాలీవుడ్ మూవీ ఫ‌స్ట్ లుక్- హీరోహీరోయిన్లు లేకుండానే పోస్ట‌ర్ రిలీజ్‌

Merry Christmas First Poster: విజ‌య్ సేతుప‌తి బాలీవుడ్ మూవీ ఫ‌స్ట్ లుక్- హీరోహీరోయిన్లు లేకుండానే పోస్ట‌ర్ రిలీజ్‌

Nelki Naresh Kumar HT Telugu
Dec 24, 2022 06:18 PM IST

Merry Christmas First Look: విజ‌య్ సేతుప‌తి, క‌త్రినాకైఫ్ జంట‌గా న‌టిస్తోన్న మేరీ క్రిస్మ‌స్ ఫ‌స్ట్ లుక్‌ను శ‌నివారం రిలీజ్ చేశారు. హీరోహీరోయిన్ల ఫొటోలు లేకుండా డిఫ‌రెంట్‌గా డిజైన్ చేసిన ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

మేరీ క్రిస్మ‌స్‌ ఫ‌స్ట్ లుక్
మేరీ క్రిస్మ‌స్‌ ఫ‌స్ట్ లుక్

Merry Christmas First Look: త‌మిళ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి (Vijay Sethupathi) మేరీ క్రిస్మ‌స్ సినిమాతో హీరోగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. క‌త్రినాకైఫ్ (Katrina Kaif )హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాకు అంధాదూన్ ఫేమ్ శ్రీరామ్ రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. మేరీ క్రిస్మ‌స్‌ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను శ‌నివారం రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో రెండు గాజు గ్లాస్‌లు ప‌గిలిపోయిన‌ట్లుగా చూపించారు. వాటిలో నుంచి ర‌క్తం కింద ప‌డుతున్న‌ట్లుగా క‌నిపించ‌డం ఆస‌క్తిని పంచుతోంది.

yearly horoscope entry point

హీరోహీరోయిన్లు విజ‌య్ సేతుప‌తి, క‌త్రినాకైఫ్ లేకుండానే ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేయ‌డం ఆస‌క్తిని పంచుతోంది. డిఫ‌రెంట్‌గా డిజైన్ చేసిన ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ సినిమాను తొలుత క్రిస్మ‌స్‌కు రిలీజ్ చేయాల‌ని భావించారు. కానీ అనివార్య కార‌ణ‌ల వ‌ల్ల వ‌చ్చే ఏడాదికి వాయిదాప‌డింది.

అదే విష‌యాన్ని గుర్తుచేస్తూ క‌త్రినాకైఫ్ చేసిన ట్వీట్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఈ సినిమాను క్రిస్మ‌స్‌కు ప్రేక్ష‌క‌లు ముందుకు తీసుకురావాల‌నుకున్నాం. కానీ పెద్ద ట్విస్ట్ జ‌ర‌గ‌డంతో వాయిదాప‌డింది. త్వ‌ర‌లోనే సినిమాను రిలీజ్ చేయ‌బోతున్నాం అంటూ ట్విట్ట‌ర్ ద్వారా క‌త్రినాకైఫ్ వెల్ల‌డించింది.

హిందీ, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంలో ఈ సినిమాను తెర‌కెక్కించారు. అంధాదూన్ త‌ర్వాత శ్రీరామ్ రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా ఇది.

Whats_app_banner