Vijay Deverakonda: విజయ్ దేవరకొండ బిగ్గెస్ట్ హిట్ మూవీకి నేటితో ఆరేళ్లు.. ఇప్పుడు ఏ ఓటీటీలో చూడొచ్చంటే..
Vijay Deverakonda - Geetha Govindam: గీతగోవిందం సినిమా ఆరేళ్లు పూర్తి చేసుకుంది. విజయ్ దేవరకొండకు ఈ మూవీనే ఇప్పటికే హైయ్యెస్ట్ కలెక్షన్ల చిత్రంగా ఉంది. ఈ చిత్రం తర్వాత విజయ్‍కు ఆ స్థాయి హిట్ దక్కలేదు. గీతగోవిందం సినిమా చాలా మందికి ఫేవరెట్ మూవీగానూ నిలిచిపోయింది.
కెరీర్ తొలినాళ్లతోనే అర్జున్ రెడ్డితో బంపర్ హిట్ కొట్టిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు. ఆ తర్వాత 2018లో వచ్చిన గీతగోవిందం చిత్రం సెన్సేషనల్ హిట్ అయింది. పరశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఆ రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేక్షకులను విపరీతంగా మెప్పించింది. విజయ్‍కు ఏకంగా స్టార్ హీరో రేంజ్ తెచ్చిపెట్టింది. గీతగోవిందం చిత్రం బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి కలెక్షన్లు సాధించింది. ఇప్పటికీ విజయ్ దేవరకొండకు ఈ మూవీనే హయ్యెస్ట్ కలెక్షన్ల చిత్రంగా ఉంది. అంతటి సూపర్ హిట్ కొట్టిన గీతగోవిందం చిత్రానికి నేటి (ఆగస్టు 15)తో ఆరేళ్లు పూర్తయ్యాయి.
అన్ని విషయాల్లో మెప్పించిన గీతగోవిందం
గీతగోవిందం సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‍గా నటించారు. అర్జున్ రెడ్డిలో యాంగీ యంగ్‍మన్‍గా చేసిన విజయ్.. ఈ చిత్రంలో ఓ పద్ధతైన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యువకుడిగా కనిపించారు. గీతగోవిందంలో విజయ్ దేవరకొండ యాక్టింగ్ అందరినీ మెప్పించింది. అతడి డైలాగ్ డెలివరీ.. లుక్స్.. ‘మేడం మేడం’ అంటూ హీరోయిన్ వెనుక తిరగడం ఇలా విజయ్ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. అమ్మాయిల్లో అతడికి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. రష్మిక కూడా అందంతో పాటు యాక్టింగ్‍తో వారెవా అనిపించారు. రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిశోర్ కామెడీ కూడా బాగా నవ్వించింది.
గీతగోవిందం సినిమాలో లవ్ ట్రాక్, కామెడీ, ఫ్యామిలీ ఎలిమింట్స్ ఇలా అన్ని బాగా కుదిరాయి. చాలా మంది మనసులను ఈ చిత్రం దోచేసింది. డైరెక్టర్ పరశురామ్ పేట్ల ఈ కథను చక్కగా రాసుకొని.. అంతే పద్ధతిగా పర్‌ఫెక్ట్‌గా స్క్రీన్‍పై చూపించారు. ఫ్యామిలీ లవ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తీసుకొచ్చారు. 2018లో ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15న ఈ మూవీ రిలీజ్ అయింది. ఆరంభం నుంచి పాజిటివ్ టాక్‍తో భారీ కలెక్షన్లను దక్కించుకుంది.
గీతగోవిందం సినిమాకు గోపీసుందర్ అందించిన సంగీతం మరో హైలైట్‍గా నిలిచింది. ఈ మూవీలోనే ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే’ పాట క్లాసిక్‍గా నిలిచింది. ‘వచ్చిందమ్మా’ సహా మిగిలిన సాంగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఇలా ఈ మూవీకి అన్ని కుదిరాయి.
రూ.5కోట్ బడ్జెట్.. రూ.132 కోట్ల కలెక్షన్లు
గీతగోవిందం సినిమా మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.132 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకుంది. కేవలం దాదాపు రూ.5కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ చిత్రం ఆస్థాయిలో వసూళ్లను సాధించింది అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఈ చిత్రం ఆకట్టుకోవడంతో లాంగ్ సాధించింది. ఈ మూవీని గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాస్ నిర్మించగా.. అల్లు అరవింద్ సమర్పించారు.
ఆరేళ్లుగా హిట్ కోసం..
గీతగోవిందం తర్వాత విజయ్ దేవరకొండకు ఆ స్థాయి హిట్ రాలేదు. నోటా నిరాశపరిచింది. ట్యాక్సీవాలా మోస్తరుగా ఆడింది. డియర్ కామ్రెడ్ మంచి చిత్రంగా ప్రశంసలు దక్కించుకున్నా కమర్షియల్‍గా సక్సెస్ కాలేదు. వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఖుషి ఇలా వరుసగా ప్లాఫ్‍లు ఎదురయ్యాయి. పరశురామ్ దర్శకత్వంలోనే విజయ్ చేసిన ఫ్యామిలీ స్టార్ ఈ ఏడాది డిజాస్టర్ అయింది. గీతగోవిందం మ్యాజిక్‍ను ఈ కాంబో రిపీట్ చేయలేకపోయింది. దీంతో ఇప్పటికీ గీతగోవిందం చిత్రమే విజయ్ కెరీర్లో ఇప్పటికీ బిగ్గెస్ట్ హిట్‍గా ఉంది.
గీతగోవిందం ఓ ఓటీటీలో?
గీతగోవిందం సినిమా జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉంది. ఈ మూవీ హిందీ డబ్బింగ్ యూట్యూబ్‍లో భారీ సక్సెస్ అయింది. తమిళ డబ్బింగ్‍తో డిస్నీ+ హాట్‍స్టార్‌లో ఈ మూవీ ఉంది.
విజయ్ లైనప్
విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో ఓ యాక్షన్ డ్రామా సినిమా చేస్తున్నారు. అలాగే, ట్యాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్‍తో ఓ పీరియడ్ యాక్షన్ మూవీకి కూడా విజయ్ ఓకే చెప్పారు. ఈ సినిమాలతో విజయ్ దేవరకొండ మళ్లీ హిట్ ట్రాక్ పడతారనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది.