VenkyAnil3: వెంకటేశ్‍ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు.. ఒకరు భార్య.. మరొకరు మాజీ ప్రేయసి.. సినిమా లాంచ్‍కు ముహూర్తం ఫిక్స్-venkyanil3 aishwarya rajesh meenakshi chaudhary on board for venkatesh anil ravipudi movie launch time annoncued ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Venkyanil3: వెంకటేశ్‍ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు.. ఒకరు భార్య.. మరొకరు మాజీ ప్రేయసి.. సినిమా లాంచ్‍కు ముహూర్తం ఫిక్స్

VenkyAnil3: వెంకటేశ్‍ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు.. ఒకరు భార్య.. మరొకరు మాజీ ప్రేయసి.. సినిమా లాంచ్‍కు ముహూర్తం ఫిక్స్

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 02, 2024 08:12 PM IST

VenkyAnil3: వెంకటేశ్ - దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‍లో రూపొందనున్న సినిమా ప్రారంభానికి డేట్, టైమ్ ఖరారయ్యాయి. అలాగే, ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లుగా నటించనున్నారు.

VenkyAnil3: వెంకటేశ్‍ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు.. ఒకరు భార్య.. మరొకరు మాజీ ప్రేయసి.. సినిమా లాంచ్‍కు ముహూర్తం ఫిక్స్
VenkyAnil3: వెంకటేశ్‍ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు.. ఒకరు భార్య.. మరొకరు మాజీ ప్రేయసి.. సినిమా లాంచ్‍కు ముహూర్తం ఫిక్స్

విక్టరీ వెంకటేశ్‍కు ఈ ఏడాది సైంధవ్ చిత్రంతో నిరాశ ఎదురైంది. శైలేశ్ కొలను దర్శకత్వం వహించిన ఆ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ఇక తదుపరి తనకు అచ్చొచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నారు వెంకటేశ్. ఎఫ్2, ఎఫ్3 తర్వాత వారిద్దరి కాంబోలో ఇది మూడో సినిమా. దీంతో వెంకీఅనిల్ 3 అనే ప్రాజెక్ట్ పేరుతో పిలుస్తున్నారు. ఈ చిత్రంపై తాజాగా అప్‍డేట్ వచ్చింది. ఈ మూవీ పూజా కార్యక్రమానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ చిత్రంలో నటించనున్న ఇద్దరు హీరోయిన్లును మూవీ టీమ్ నేడు (జూలై 2) ప్రకటించింది.

భార్య.. మాజీ గర్ల్ ఫ్రెండ్ వీరే

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకేటశ్ నటించనున్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించనున్నారు. ఈ విషయాన్ని మూవీ నేడు వెల్లడించింది. ఈ మూవీలో వెంకటేశ్ భార్యగా ఐశ్వర్య రాజేశ్, మాజీ గర్ల్ ఫ్రెండ్‍గా మీనాక్షి చౌదరి నటించనున్నారు.

ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి లుక్‍ను కూడా మూవీ టీమ్ రివీల్ చేసింది. చీర కట్టులో ఐశ్వర్య రాజేశ్ గృహిణిలా కనిపించారు. గన్ పక్కన తాళి బొట్టు ఉన్నట్టు మేకర్స్ చూపించారు. మీనాక్షి చౌదరి చేతిలో గన్ ఉండగా ఆమె పోలీసాఫీసర్‌ పాత్ర పోషించనున్నట్టు అర్థమవుతోంది. ఈ పోస్టర్‌లో గన్ పక్కన గులాబీ ఉంది. ఈ మూవీలో మాజీ పోలీసాఫీసర్‌గా వెంకటేశ్ పాత్ర ఉంటుందని మూవీ టీమ్ ఇటీవలే వెల్లడించింది.

ప్రారంభానికి ముహూర్తం ఇదే

వెంకటేశ్ - అనిల్ రావిపూడి సినిమా పూజా కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. రేపు (జూలై 3) ఉదయం 11.16 నిమిషాలకు ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ అధికారికంగా వెల్లడించింది. ఎంటర్‌టైనింగ్ జర్నీ మొదలుకానుందంటూ వెల్లడించింది. ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర సినీ క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మిస్తుండగా.. దిల్ రాజు సమర్పిస్తున్నారు.

సంక్రాంతికి ప్లాన్

వెంకటేశ్ - అనిల్ సినిమాను 2025 సంక్రాంతికే తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. టైటిల్ కూడా సంక్రాంతి పేరు మీదే ఉండేలా చూస్తున్నార. ఈ ఏడాది పండుగకు సైంధవ్‍తో యాక్షన్ మోడ్‍లో వచ్చిన వెంకటేశ్.. వచ్చే సంక్రాంతికి తన మార్క్ ఎంటర్‌టైనింగ్ మూవీతో రావాలని భావిస్తున్నారు. వెంకటేశ్, అనిల్ కాంబినేషన్‍లో 2019లో వచ్చిన ఎఫ్2 చిత్రం సూపర్ హిట్ అయింది. 2022లో వచ్చిన ఎఫ్3 కూడా మంచి విజయం సాధించింది. ఇలా వీరి కాంబో మంచి సక్సెస్ దక్కించుకుంది. ఇద్దరూ కలిసి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు.

వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈసారి చాలా సినిమాలు పోటీలో ఉండేలా ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర ఇప్పటికే సంక్రాంతి రిలీజ్‍ను లాక్ చేసుకుంది. కింగ్ నాగార్జున మూవీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. మరిన్ని సినిమాలు కూడా పోటీలో ఉండొచ్చు.

WhatsApp channel