Upcoming Most Expensive Tollywood movies: ఆరు తెలుగు సినిమాలు.. రూ.3100 కోట్లు.. దుమ్ము రేపనున్న టాలీవుడ్ స్టార్లు-upcoming most expensive tollywood movies ssmb29 kalki 2898 ad devara pushpa 2 kannappa to cost 3100 crores together ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Upcoming Most Expensive Tollywood Movies: ఆరు తెలుగు సినిమాలు.. రూ.3100 కోట్లు.. దుమ్ము రేపనున్న టాలీవుడ్ స్టార్లు

Upcoming Most Expensive Tollywood movies: ఆరు తెలుగు సినిమాలు.. రూ.3100 కోట్లు.. దుమ్ము రేపనున్న టాలీవుడ్ స్టార్లు

Hari Prasad S HT Telugu
Apr 22, 2024 12:03 PM IST

Upcoming Most Expensive Tollywood movies: టాలీవుడ్ నుంచి రాబోయే రోజుల్లో ఆరు అత్యంత భారీ బడ్జెట్ సినిమాలు రాబోతున్నాయి. ఈ ఆరు సినిమాల బడ్జెటే ఏకంగా రూ.3100 కోట్లు కావడం విశేషం.

ఆరు తెలుగు సినిమాలు.. రూ.3100 కోట్లు.. దుమ్ము రేపనున్న టాలీవుడ్ స్టార్లు
ఆరు తెలుగు సినిమాలు.. రూ.3100 కోట్లు.. దుమ్ము రేపనున్న టాలీవుడ్ స్టార్లు

Upcoming Most Expensive Tollywood movies: తెలుగు హీరోలు క్రమంగా పాన్ ఇండియా, గ్లోబల్ స్టార్లు ఎదుగుతున్న ఈ కాలంలో రానున్న రోజుల్లో ఐదు సినిమాలు ఎంతో ఆసక్తి రేపుతున్నాయి. ఇందులో నటించే స్టార్లే కాదు.. వీటి బడ్జెట్లు కూడా కళ్లు చెదిరేలా ఉన్నాయి. మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, మంచు విష్ణులాంటి స్టార్ హీరోలు ఈ ఐదు సినిమాలతో మరో రేంజ్ కు వెళ్లనున్నారు.

టాలీవుడ్‌లో రానున్న భారీ బడ్జెట్ సినిమాలు

టాలీవుడ్ నుంచి రానున్న రెండేళ్లలో పలు భారీ బడ్జెట్ సినిమాలు రాబోతున్నాయి. ఇందులో ఆరు మాత్రం ఎంతో ఆసక్తి రేపుతున్నాయి. వాటిలో ఎస్ఎస్ఎంబీ29తోపాటు కల్కి 2898 ఏడీ, గేమ్ ఛేంజర్, దేవర, పుష్ప 2, కన్నప్ప సినిమాలు ఉన్నాయి.

ఎస్ఎస్ఎంబీ29 - రూ.1000 కోట్లు

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న మూవీ ఎస్ఎస్ఎంబీ29. ఇండియన్ సినిమాలోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా దీనిని భావిస్తున్నారు. సుమారు రూ.1000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తీయనున్నట్లు అంచనా.

ఈ మూవీపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. పాన్ ఇండియా కాదు గ్లోబల్ లెవల్లో ఈ మూవీని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రీప్రొడక్షన్ పనులు నడుస్తుండగా.. సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

కల్కి 2898 ఏడీ - రూ.600 కోట్లు

ప్రస్తుతానికి ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీ కల్కి 2898 ఏడీ. ప్రభాస్, దీపికా, అమితాబ్, కమల్ హాసన్ లాంటి వాళ్లు నటిస్తున్న ఈ మూవీని రూ.600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కుచెందిన వైజయంతీ మూవీస్ నిర్మిస్తోంది. మే 9న రిలీజ్ అవుతుందని గతంలో మేకర్స్ అనౌన్స్ చేసినా.. ఇప్పుడా తేదీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. మే 30న రావచ్చని అంచనా వేస్తున్నారు.

పుష్ప 2 - రూ.500 కోట్లు

పుష్ప మూవీ సూపర్ హిట్ అయిన తర్వాత ఈ సీక్వెల్ పై ఉన్న అంచనాల నేపథ్యంలో భారీ బడ్జెట్ తో ఈ మూవీ రూపొందిస్తున్నారు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సీక్వెల్ ఆగస్ట్ 15న రిలీజ్ కానుంది. ఈ మధ్యే టీజర్ కూడా రిలీజ్ చేశారు. తెలుగులో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమాల్లో ఇదీ ఒకటి.

గేమ్ ఛేంజర్ - రూ.400 కోట్లు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మూవీ గేమ్ ఛేంజర్. చాలా కాలంగా ఊరిస్తున్న ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. అతని గత సినిమాలలాగే ఇది కూడా భారీ బడ్జెట్ మూవీయే. ఏకంగా రూ.400 కోట్లతో తీస్తున్నారు.

దేవర - రూ.300 కోట్లు

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ ఈ సినిమాతో మరోసారి రిపీట్ అవుతోంది. దేవర కూడా పాన్ ఇండియా మూవీయే. అక్టోబర్ 10న రిలీజ్ కానున్న ఈ మూవీని రూ.300 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ లాంటి బాలీవుడ్ స్టార్లు నటిస్తున్నారు.

కన్నప్ప - రూ.300 కోట్లు

మంచు ఫ్యామిలీ ఎంతో ప్రతిష్టాత్మక నిర్మిస్తున్న సినిమా కన్నప్ప. మంచు విష్ణు ఈ పాత్ర పోషిస్తుండగా.. ఇప్పటికే అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, నయనతార, శివ రాజ్ కుమార్ లాంటి పెద్ద పెద్ద స్టార్లు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీని రూ.300 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నట్లు సమాచారం.

IPL_Entry_Point