OTT Thriller: ఓటీటీలోకి సరికొత్త మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. 7 భాషల్లో స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?-trisha krishnan brinda web series ott streaming on sony liv ott mystery thriller trisha brinda digital premiere ott news ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Thriller: ఓటీటీలోకి సరికొత్త మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. 7 భాషల్లో స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?

OTT Thriller: ఓటీటీలోకి సరికొత్త మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. 7 భాషల్లో స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?

Sanjiv Kumar HT Telugu
Jul 10, 2024 10:16 AM IST

Trisha Brinda Web Series OTT Streaming: ఓటీటీలోకి సరికొత్త మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రానుంది. త్రిష ప్రధాన పాత్రలో తెరకెక్కిన బృంద వెబ్ సిరీస్‌ను 7 భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారు. బృంద ఓటీటీ రిలీజ్ డేట్, డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ను వెల్లడించారు.

ఓటీటీలోకి సరికొత్త మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. 7 భాషల్లో స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలోకి సరికొత్త మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. 7 భాషల్లో స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?

Brinda Web Series OTT Release: ఓటీటీలో ఎప్పటికప్పుడు డిఫరెంట్ కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీసులు వస్తాయని తెలిసిందే. అయితే వీటిలో హారర్, క్రైమ్ థ్రిల్లర్స్ జోనర్ సినిమాలు, వెబ్ సిరీసులు ఎక్కువగా అందరినీ ఆకర్షిస్తుంటాయి. ఇక ఇలాంటి సినిమాల్లో స్టార్ హీరో హీరోయిన్స్ నటిస్తే వాటికి మరింత క్రేజ్ వస్తుంది.

అలా ఇప్పుడు స్టార్ హీరోయిన్ మెయిన్ లీడ్ రోల్‌లో ఓ సరికొత్త మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ త్వరలో ఓటీటీలోకి రానుంది. ఆ వెబ్ సిరీస్ పేరే బృంద. బ్యూటిఫుల్ అండ్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ మెయిన్ లీడ్ రోల్‌లో నటించిన బృంద వెబ్ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్, డిజిటల్ ప్రీమియర్ ప్లాట్‌ఫామ్‌ను ఇటీవల మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు.

"అంతా ముగిసిపోయిందనుకున్న సమయంలో వెలుగు రేఖలా కనిపించింది ఆమె ఉనికి. అదెలా సాధ్యమైందో తెలుసుకోవాలంటే.. చెడు మీద మంచి సాధించిన విజయాన్ని ఆస్వాదించాలంటే మీరు సిద్ధం కావాల్సిందే" అంటూ వెబ్ సిరీస్‌‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. ఇలా బృంద ఓటీటీ రిలీజ్‌ డేట్‌ను తెలిపారు.

బృంద వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ సోనీ లివ్‌లో ఆగస్టు 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అంతేకాకుండా బృంద తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, హిందీ కలుపుకుని ఏకంగా 7 భాషల్లో ఓటీటీ రిలీజ్ కానుంది. అయితే, ఇటీవల బృంద వెబ్ సిరీస్‌కు సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా వెబ్ సీరీస్‌ రచయిత, దర్శకుడు సూర్య మనోజ్‌ వంగాల తమ భావాలను పంచుకున్నారు.

"సోనీ లివ్‌ ద్వారా పాన్ ఇండియా ఆడియన్స్‌ని బృంద వెబ్ సీరీస్‌తో పలకరించడానికి నాకు థ్రిల్‌గా ఉంది. బృంద ఆద్యంతం సస్పెన్స్‌తో సాగుతుంది. అనూహ్యమైన మలుపులు ఉత్కంఠతను రేకెత్తిస్తాయి. బృంద సీరీస్‌ చూస్తున్నంత సేపు ఆసక్తిగా, ఉత్కంఠ రేకెత్తించేలా ఉండటమే కాదు, తాము అప్పటిదాకా నమ్ముతున్న నమ్మకాల మీద కూడా ఫోకస్‌ పెరుగుతుంది" అని డైరెక్టర్ సూర్య మనోజ్ వంగాల తెలిపారు.

"అత్యద్భుతమైన, శక్తిమంతమైన, ఫీమేల్‌ లీడ్‌ నెరేటివ్‌ స్టోరీతో తెరకెక్కింది బృంద. ఈ సీరీస్‌ని డైరక్ట్ చేయడం ఆనందదాయకం. కథానుగుణంగా బృంద పాత్రలో అత్యద్భుతమైన లేయర్స్‌ని జనాలు విట్‌నెస్‌ చేస్తారు. త్రిష గారితో పనిచేయడం చాలా ఆనందంగా అనిపించింది. ఇప్పటిదాకా ఈ జోనర్‌లో వచ్చిన సినిమాలకు సరికొత్త నిర్వచనం చెప్పేలా ఉంటుంది" అని సూర్య మనోజ్ వంగాల అన్నారు.

కాగా సూర్య మనోజ్‌ వంగాలా గ్రిప్పింగ్‌గా రాసి, అద్భుతంగా డైరక్ట్ చేసిన సీరీస్‌ బృందతో టాలెంటెడ్‌ సౌత్‌ క్వీన్‌ త్రిష కృష్ణన్‌ ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నారు. సూర్య మనోజ్‌ వంగాలా, పద్మావతి మల్లాది కలిసి రూపొందించిన స్క్రీన్‌ప్లే ఈ సీరీస్‌కి హైలైట్‌ కానుంది. శక్తికాంత్‌ కార్తిక్‌ సంగీతం అందించారు. అవినాష్‌ కొల్ల ప్రొడక్షన్‌ డిజైన్‌ చేశారు.

దినేష్‌ కె బాబు సినిమాటోగ్రఫీ ఈ సీరీస్‌కి ఆకర్షణగా నిలవనుంది. అన్వర్‌ అలీ ఎడిటింగ్‌ గురించి తప్పకుండా సీరీస్‌ చూసిన అందరూ ప్రస్తావిస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది టీమ్‌.

WhatsApp channel