Trisha: త్రిషతో రేప్ సీన్, నాకు కొత్తగా ఉంటుంది.. నటుడి వ్యాఖ్యలపై హీరోయిన్ ఘాటు రిప్లై
Mansoor Ali Khan About Trisha: ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో త్రిష, మన్సూర్ అలీ ఖాన్ కామెంట్స్, ప్రతి రియాక్షన్స్ వైరల్ అవుతన్నాయి. తనపై మన్సూర్ చేసిన వ్యాఖ్యలకు త్రిష ఘాటుగా స్పందించగా.. సీనియర్ నటుడు కూడా రియాక్ట్ అయ్యాడు.
Mansoor Ali Khan Reply To Trisha Reaction: తెలుగు సినీ ఇండస్ట్రీలో త్రిష చెరగని ముద్ర వేసుకుంది. తమిళంలో కూడా స్టార్ హీరోయిన్ రేంజ్ సొంతం చేసుకుంది. ఇటీవల పొన్నియన్ సెల్వన్, లియో సినిమాలతో ప్రేక్షకులు, అభిమానులను త్రిష అలరించింది. అయితే, త్రిషపై లియో మూవీలోని మరో నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి.
త్రిషతో రేప్ సీన్
"లియో మూవీలో నేను నటిస్తున్నట్లు తెలిసినప్పుడు త్రిషతో రేప్ సీన్ ఉంటుందని ఆశపడ్డాను. త్రిషను నా చేతులతో ఎత్తుకుని బెడ్ రూమ్‌లో వేసే సన్నివేశం ఉంటుందని ఊహించుకున్నా. కానీ, అతను (లోకేష్ కనగరాజ్) కనీసం త్రిషను చూపించను కూడా చూపించలేదు. ఇప్పటికే నేను చాలా రేప్ సీన్స్ చేశాను. కానీ, ఇది నాకు కొత్తగా ఉంటుంది అనుకున్నా" అంటూ అసభ్యకర కామెంట్స్ చేశాడు మన్సూర్ అలీ ఖాన్. అనంతరం ఈ కామెంట్స్ వీడియో చూసిన త్రిష స్పందించింది. అలాంటి నీచుడితో తన జీవితంలో ఇంకెప్పుడు నటించను అని త్రిష చెప్పేసింది.
మానవాళికే చెడ్డపేరు
"మన్సూర్ అలీ ఖాన్ నా గురించి నీచంగా, అసహ్యంగా మాట్లాడిన వీడియో నా దృష్టికి వచ్చింది. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది లైంగికంగా, అగౌరవంగా, స్త్రీ ద్వేషపూరితంగా, అసహ్యకరంగా అనిపిస్తోంది. అతని లాంటి నీచమైన వ్యక్తితో స్క్రీన్ స్పేస్ ఇకపై ఎప్పుడూ పంచుకోను. నా మిగిలిన సినిమా కెరీర్‌లో కూడా ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను. అతని లాంటి వారి వల్ల మానవాళికే చెడ్డపేరు వస్తుంది" అని త్రిష ట్వీట్ చేసింది.
త్రిషకు సపోర్ట్
త్రిష చేసిన కామెంట్స్ సైతం నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఆమెకు సపోర్టుగా తమిళ సినీ నటీనటులు, డైరెక్టర్స్ నిలిచారు. ఈ నేపథ్యంలో త్రిష వ్యాఖ్యలపై మన్సూర్ అలీ ఖాన్ రియాక్ట్ అయ్యాడు. అతను చేసిన కామెంట్స్ ను తన ట్విటర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు ప్రముఖ సినీ ట్రేడ్ విశ్లేషకుడు రమేష్ బాలా.
త్రిషకు అభిమాని
"నాకు ఈ సీన్లు రాలేదు కాబట్టి.. నేను చాలా సింపుల్‌గా చెప్పాను. నేను నా మహిళా కో యాక్టర్స్ ని గౌరవిస్తాను. త్రిష ఎడిటెడ్ వెర్షన్ చూసింది. ఎవరైనా అల్లరి చేస్తే నేను భయపడను. ఇలాంటి పప్పులు నా దగ్గర ఉడకవు. నా కూతురు త్రిషకు అభిమాని. ఇవి వదిలేసి ఇతర సమస్యలపై దృష్టి పెట్టండి" అని మన్సూర్ అలీ ఖాన్ తెలిపినట్లు రమేష్ బాలా ట్విటర్‌లో రాసుకొచ్చారు. తన వ్యాఖ్యలపై ఎలాంటి పశ్చాత్తాపం పడట్లేదని రమేష్ బాలా పేర్కొన్నారు.