Top Crime Thrillers 2024 OTT: ఈ ఏడాది ఓటీటీల్లోకి వచ్చిన టాప్-3 మలయాళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు ఇవే.. మిస్ అవొద్దు!
Malayalam Top Crime Thrillers 2024 OTT: మలయాళంలో ఈ ఏడాది కొన్ని క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు సూపర్ హిట్స్ అయ్యాయి. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఓటీటీల్లోనూ దుమ్మురేపాయి. తెలుగులోనూ స్ట్రీమ్ అవుతున్నాయి. ఈ ఏడాది ఓటీటీల్లోకి వచ్చిన టాప్-3 మలయాళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు ఏవో ఇక్కడ చూడండి.
మలయాళ సినీ ఇండస్ట్రీలో గతంతో పోలిస్తే ఈ ఏడాది చాలా సినిమాలు బ్లాక్‍బస్టర్లు అయ్యాయి. వివిధ జానర్ల చిత్రాలు సూపర్ హిట్‍లుగా నిలిచాయి. ఈ ఏడాది మలయాళంలో కొన్ని క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు కూడా సక్సెస్ సాధించాయి. కలెక్షన్లతో పాటు ప్రశంసలను కూడా అందుకున్నాయి. అన్వేషిప్పిన్ కండేతుమ్ సహా మరికొన్ని థ్రిల్లర్ చిత్రాలు అదరగొట్టాయి. ఓటీటీల్లోనూ దుమ్మురేపాయి. తెలుగులోనూ అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడాది ఓటీటీల్లోకి వచ్చిన టాప్-3 మలయాళం క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.
అన్వేషిప్పిన్ కండేతుమ్
క్రైమ్ థ్రిల్లర్ చిత్రం అన్వేషిప్పిన్ కండేతుమ్ చిత్రం థియేటర్లలో బంపర్ హిట్ అయింది. ఆ తర్వాత నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోనూ భారీ వ్యూస్ దక్కించుకుంది. ఈ చిత్రం మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ లీడ్ రోల్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ హిట్ అయింది. రూ.10కోట్లలోపు బడ్జెట్‍తో రూపొంది.. రూ.40కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. మార్చి 8న అన్వేషిప్పిన్ కండేతుమ్ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి రాగా.. టాప్‍లో కొన్ని రోజులు ట్రెండ్ అయింది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లోనూ ఈ చిత్రం స్ట్రీమ్ అవుతోంది.
అన్వేషిప్పిన్ కండేతుమ్ చిత్రానికి డార్విన్ కురియకోసే దర్శకత్వం వహించారు. రెండు హత్య కేసుల ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ మూవీ సాగుతుంది. ఈ చిత్రంలో ట్విస్టులు అదిరిపోతాయి. ఇప్పటి వరకు చూడకపోతే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఈ మూవీని మిస్ అవొద్దు.
అబ్రహాం ఓజ్లెర్
మలయాళ స్టార్లు జయరాం, మమ్ముట్టి ప్రధాన పాత్రలు పోషించిన అబ్రహాం ఓజ్లెర్ చిత్రం మంచి హిట్ అయింది. ఈ ఏడాది జనవరిలో రిలీజైన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమా డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ వెర్షన్‍లోనూ అందుబాటులో ఉంది. ఈ చిత్రానికి ఓటీటీ రిలీజ్ తర్వాత కూడా మంచి స్పందన వచ్చింది.
అబ్రహాం ఓజ్లెర్ చిత్రానికి మిథున్ మాన్యుయెల్ థామస్ దర్శకత్వం వహించారు. వరుస హత్యల కేసును ఏసీపీ అబ్రహాం ఓజ్లెర్ విచారించడం చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది. ఎంగేజింగ్‍గా ఈ మూవీ ఉంటుంది. మిస్ అయి ఉంటే ఇప్పుడు హాట్‍స్టార్ ఓటీటీలో ఈ మూవీని చూడొచ్చు.
తలవన్
బిజూ మీనన్, ఆసిఫ్ అలీ లీడ్ రోల్స్ చేసిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “తలవన్” హిట్ అవడంతో పాటు ప్రశంసలను దక్కించుకుంది. ట్విస్టులు, గ్రిప్పింగ్ నరేషన్‍తో ఆకట్టుకుంది. ఈ ఏడాది మేలో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం కమర్షియల్‍గా సక్సెస్ అయింది. ఈ తలవన్ చిత్రం ఇటీవలే సెప్టెంబర్ 10న సోనీలివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. మలయాళం, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, బెంగాలీ, మరాఠి భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీకి జిస్ జాయ్ దర్శకత్వం వహించారు. తలవన్ చిత్రాన్ని అసలు మిస్ అవొద్దంటూ చాలా మంది నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఈ చిత్రాన్ని సోనీలివ్‍లో చూడండి.