Rachana Banerjee: ఎంపీగా గెలిచిన బావ‌గారు బాగున్నారా హీరోయిన్ - పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మూడు నెల‌ల్లోనే విక్ట‌రీ-tollywood heroine rachana banerjee wins hooghly mp seat in lok sabha elections 2024 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rachana Banerjee: ఎంపీగా గెలిచిన బావ‌గారు బాగున్నారా హీరోయిన్ - పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మూడు నెల‌ల్లోనే విక్ట‌రీ

Rachana Banerjee: ఎంపీగా గెలిచిన బావ‌గారు బాగున్నారా హీరోయిన్ - పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మూడు నెల‌ల్లోనే విక్ట‌రీ

Nelki Naresh Kumar HT Telugu
Jun 06, 2024 10:23 AM IST

Rachana Banerjee: బావ‌గారు బాగున్నారా హీరోయిన్ ర‌చ‌న బెన‌ర్జీ 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఎంపీగా గెలిచింది. వెస్ట్ బెంగాళ్‌లోని హూగ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీచేసిన ర‌చ‌న బెన‌ర్జీ అర‌వై వేల ఓట్ల తేడాతో ప్ర‌త్య‌ర్థి, బీజేపీ సిట్టింగ్ ఎంపీ లాకెట్ ఛ‌ట‌ర్జీపై విజ‌యం సాధించింది

ర‌చ‌న బెన‌ర్జీ
ర‌చ‌న బెన‌ర్జీ

Rachana Banerjee: ర‌చ‌న బెన‌ర్జీ 1990 ద‌శ‌కంలో టాలీవుడ్‌లో చిరంజీవి, బాల‌కృష్ణ వంటి అగ్ర నాయ‌కుల‌తో సినిమాలు చేసింది. ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీస్‌తో తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో నిలిచిపోయిన‌ ర‌చ‌న బెన‌ర్జీ 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఎంపీగా గెలుపొందింది. తృణ‌మూల్ కాంగ్రెస్ త‌ర‌ఫున హూగ్లీ నియోజ‌క వ‌ర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన ర‌చ‌న బెన‌ర్జీ ప్ర‌త్య‌ర్థి, సిట్టింగ్ ఎంపీ లాకెట్ ఛ‌ట‌ర్జీపై దాదాపు 76 వేల ఓట్ల తేడాతో విజ‌యం సాధించింది.

మూడు నెల‌ల క్రిత‌మే ఎంట్రీ...

మార్చిలో తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీలో ర‌చ‌న బెన‌ర్జీ జాయిన్ అయ్యింది. టీఎమ్‌సీ అధ్య‌క్షురాలు మ‌మ‌తా బెన‌ర్జీ స‌మ‌క్షంలో పార్టీలో చేరింది. టీఎంసీ తీర్థం పుచ్చుకున్న మూడు నెల‌ల్లోనే ర‌చ‌న బెన‌ర్జీ ఎంపీగా విజ‌యాన్ని అందుకున్న‌ది. సిట్టింగ్ ఎంపీ లాకెట్ ఛ‌ట‌ర్జీపై ఉన్న వ్య‌తిరేక‌త ర‌చ‌న బెన‌ర్జీకి క‌లిసివ‌చ్చింది. పోటీ చేసిన తొలి ప్రయత్నంలోనే ఎంపీగా గెలిచింది.

తెలుగులో చిరంజీవి, బాల‌కృష్ణ‌తో సినిమాలు...

ర‌చ‌న బెన‌ర్జీ తెలుగుతో పాటు బెంగాళీ, త‌మిళం, క‌న్న‌డ హిందీ భాష‌ల్లో సినిమాలు చేసింది. తెలుగులో జేడీ చ‌క్ర‌వ‌ర్తి హీరోగా ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన నేను ప్రేమిస్తున్నాను మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ర‌చ‌న బెన‌ర్జీ. చిరంజీవి బావ‌గారు బాగున్నారా, బాల‌కృష్ణ సుల్తాన్ సినిమాల్లో హీరోయిన్‌గా క‌నిపించింది.

లాహిరి లాహిరి లాహిరిలో…

తెలుగులో ఎక్కవ‌గా ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది ర‌చ‌న బెన‌ర్జీ. మావిడాకులు, అభిషేకం, పిల్ల‌న‌చ్చింది, పెద్ద మ‌నుషులుతో ప‌లు సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. తెలుగులో ఉపెంద్రతో కన్యాదానం, నీతోనే ఉంటాను సినిమాలు చేసింది.

లాహిరి లాహ‌రి లాహిరిలో త‌ర్వాత టాలీవుడ్‌కు దూర‌మైంది రచన బెనర్జీ. బెంగాళీ, ఒడియా భాష‌ల్లో వంద‌కుపైగా సినిమాలు చేసింది. పలు అవార్డులను అందుకున్నది. హిందీలో అమితాబ్‌బ‌చ్చ‌న్‌తో సూర్య‌వంశం సినిమాలో న‌టించింది ర‌చ‌న బెన‌ర్జీ. ఆమె చేసిన ఒకే ఒక బాలీవుడ్ మూవీ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా తెలుగులో పదిహేను వరకు సినిమాలు చేసింది రచన బెనర్జీ.

టీవీ షోకు హోస్ట్‌...

గ‌త కొన్నేళ్లుగా సినిమాల‌కు దూర‌మైన ర‌చ‌న బెన‌ర్జీ టీవీ షోల‌తో బిజీగా బెంగాళ్‌లో పాపుల‌ర్ టీవీ షో దీదీ నంబ‌ర్ వ‌న్‌కు ర‌చ‌న బెన‌ర్జీ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది.

రెండుసార్లు విడాకులు...

సినిమాల్లో నంబ‌ర్ వ‌న్ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్న ర‌చ‌న బెన‌ర్జీ వ్య‌క్తిగ‌త జీవితంలో ఎ న్నో ఒదిదుడుకుల‌ను ఎదుర్కొన్న‌ది. ఒడిశా యాక్ట‌ర్ సిద్ధాంత్ మ‌హోపాత్ర‌ను ప్రేమించి పెళ్లిచేసుకున్న‌ది ర‌చ‌న బెన‌ర్జీ. ప‌దేళ్ల పాటు సాఫీగా సాగిన వీరి వైవాహిక బంధానికి 2004లో ముగింపు ప‌డింది. సిద్ధాంత్ మ‌హోపాత్ర‌కు విడాకులు ఇచ్చిన ర‌చ‌న...2007లో ప్ర‌బోల్ బ‌సుతో ఏడ‌డుగులు వేసింది. మ‌న‌స్ప‌ర్థ‌ల‌తో 2017 లో అత‌డి నుంచి విడిపోయింది.

Whats_app_banner