Kaliyugam Pattanamlo: ఓటీటీలోకి వచ్చేసిన టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏదంటే?
Kaliyugam Pattanamlo: తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ కలియుగం పట్టణంలో ఓటీటీలోకి వచ్చేసింది. విశ్వకార్తికేయ, ఆయుషిపటేల్, చిత్ర శుక్లా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో గురువారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది
Kaliyugam Pattanamlo: విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్, చిత్రా శుక్లా ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు మూవీ కలియుగం పట్టణంలో ఓటీటీలో రిలీజైంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిన్న సినిమాను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సైలెంట్ గా ఓటీటీలో రిలీజ్ చేశారు. ఈ చిన్న సినిమాకు రమాకాంత్ రెడ్డి దర్శకత్వం వహించాడు. కలియుగం పట్టణంలో మూవీలో విశ్వకార్తికేయ హీరోగా, విలన్‌గా...డ్యూయల్ రోల్‌లో నటించాడు.
మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ...
నేరాలకు బీజం ఎక్కడ...ఎలా పడుతుంది? పిల్లలను సరిగ్గా పెంచకపోతే వారు క్రిమినల్స్‌గా మారి సొసైటీకి ఎలాంటి అనర్థాలు కలిగిస్తున్నారనే సందేశానికి ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ అంశాలను జోడించి దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించాడు.ఈ సినిమాలో చిత్రాశుక్లా పోలీస్ ఆఫీసర్ పాత్రను చేసింది.
కవల పిల్లల కథ...
విజయ్ ( విశ్వ కార్తికేయ), సాగర్ ( విశ్వ కార్తికేయ) కవల పిల్లలు. తల్లిదండ్రులు మోహన్ (దేవీ ప్రసాద్), కల్పన (రూప లక్ష్మి) లతో సంతోషంగా జీవిస్తుంటారు. విజయ్, సాగర్ భిన్న మనస్తత్వాలతో పెరుగుతారు. విజయ్ రక్తం చూసి భయపడితే.. సాగర్ మాత్రం సైకోలా ఆనంద పడతాడు. సాగర్ బయట తిరిగితే ప్రమాదమని భావించిన అతడి తల్లిదండ్రులు చిన్నతంలోనే అతడిని ట్రీట్‌మెంట్ కోసం మెంటల్ హాస్పిటల్ కి పంపిస్తారు.
పెరిగి పెద్దయిన విజయ్ ఉన్నత చదువుల కోసం కాలేజీలో జాయిన్ అవుతాడు. విజయ్ మంచితనం చూసి శ్రావణి (ఆయుషి పటేల్) అతడిని ఇష్టపడుతుంది. నంద్యాలలో జరుగుతున్న నేరాలకు అడ్డుకట్టవేయడానికి కొత్తగా పోలీస్ ఆఫీసర్ (చిత్రా శుక్లా) వస్తుంది? ఈ క్రైమ్‌ల వెనుకున్నది ఎవరు? విజయ్.. సాగర్ లలో ఎవరు మంచి వారు.. ఎవరు చెడ్డ వారు.. నంద్యాలలో జరుగుతోన్న నేరాలకు ఈ ఇద్దరితో ఉన్న సంబంధం ఏమిటి? అన్నదే ఈ మూవీ కథ.
రిలీజ్ పోస్ట్‌పోన్...
మార్చి 29న కలియుగం పట్టణంలో మూవీ థియేటర్లలో రిలీజైంది. ఎక్కువ సంఖ్యలో థియేటర్లు దొరక్కపోవడంతో మార్చి 30న ఈ మూవీ రిలీజ్‌ను వాయిదావేశారు. మరోసారి థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రొడ్యూసర్లు అనౌన్స్‌చేశారు. తాజాగా ఓటీటీలో ఈ మూవీని రిలీజ్ చేశారు.
నేను శైలజతో ఎంట్రీ....
తెలుగులో రామ్ పోతినేని హీరోగా నటించిన నేను శైలజమూవీలో కేజీ క్రేజీ ఫీలింగ్ అనే సాంగ్‌లో మెరిసింది చిత్ర శుక్లా. నేను శైలజతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చిత్ర శుక్లా ఆ తర్వాత రంగులరాట్నం, తెల్లవారితే గురువారం, సిల్లీ ఫెల్లోస్, హంట్‌తో పాటు పలు సినిమాలు చేసింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విశ్వకార్తికేయ హీరోగా జై సేన, కళాపోషకులు, అల్లంత దూరానాతో పాటు మరికొన్ని తెలుగు సినిమాలు చేశాడు.
టాపిక్