Amazon Great Summer Sale 2024 date : గ్రేట్ సమ్మర్ సేల్ తేదీని ఎట్టకేలకు ప్రకటించింది దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్. ఇది భారతదేశంలో.. మే 2, 2024 న ప్రారంభమవుతుంది. ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లు సహా పలు కేటగిరీల్లోని ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై భారీ డీల్స్, డిస్కౌంట్లు ఉన్నాయి. వన్‌ప్లస్, రెడ్మీ, పోకో తదితర టాప్ బ్రాండ్ల డిస్కౌంట్ స్మార్ట్‌ఫోన్స్ జాబితాను ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2024లో భారీ డిస్కౌంట్ ధరకు లభించే స్మార్ట్ఫోన్ల జాబితాను ఇక్కడ తెలుసుకోండి.
గ్రేట్ సమ్మర్ సేల్ 2024 సందర్భంగా కొత్తగా లాంచ్ అయిన, ప్రజాదరణ పొందిన అనేక స్మార్ట్‌ఫోన్స్‌పై డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. ఇది కొనుగోలుదారులకు.. ఫీచర్లతో నిండిన గ్యాడ్జెట్స్‌ని చాలా సరసమైన ధరకు పొందే అవకాశాన్ని ఇస్తోంది. అమెజాన్ సేల్‌లో.. రెడ్మీ 13సీ, రెడ్మీ నోట్ 13 ప్రో, శాంసంగ్ గెలాక్సీ ఎం34, షియోమీ 14, శాంసంగ్ గెలాక్సీ ఎస్23, ఐక్యూ జెడ్9, గెలాక్సీ ఎస్24, టెక్నో పోవా 6 ప్రో తదితర స్మార్ట్‌ఫోన్స్‌పై డిస్కౌంట్స్ ఇస్తున్నట్టు అమెజాన్ ప్రకటించింది. లిస్టెడ్ స్మార్ట్‌ఫోన్స్‌పై డిస్కౌంట్ ధరలు, డీల్స్‌ని రానున్న రోజుల్లో వెల్లడించనుంది అమెజాన్.
ఈ అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో డిస్కౌంట్స్‌తో పాటు కస్టమర్ల కోసం బ్యాంక్ ఆఫర్లను కూడా ఇస్తోంది అమెజాన్. ఐసీఐసీఐ బ్యాంక్, బీఓబీ కార్డు, వన్ కార్డ్ క్రెడిట్/డెబిట్ కార్డులు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఈ సేల్‌లో అమెజాన్ రూ.45,000 వరకు అద్భుతమైన ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కూడా ఇస్తుండటం విశేషం.
లిస్టెడ్ స్మార్ట్ఫోన్స్తో పాటు యాపిల్, శాంసంగ్, వ్‌ప్లస్ వంటి బ్రాండ్లకు చెందిన పలు ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్స్ కూడా భారీ డిస్కౌంట్లతో లభిస్తాయని అంచనాలు ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ డీల్స్‌పై సంస్థ ఇంకా ప్రకటన చేయలేదు.
Amazon Great Summer Sale discounts on smartphones : అన్ని ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్‌ను ఏప్రిల్ 30 సాయంత్రం 6 గంటలకు టెక్ బార్ వెల్లడించనుంది. బీబోమ్ ఉత్తమ మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లను వెల్లడిస్తుంది. టెక్ వైజర్ బడ్జెట్ స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లను వెల్లడిస్తుంది.
ఐఫోన్ 15పై కూడా డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అమెజాన్‌లో ఐఫోన్ 15 రూ.70,999కు, ఫ్లిప్‌కార్ట్‌లో రూ.65,999 ధరకు లభిస్తోంది. మరి అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2024 ఎలాంటి ఆఫర్ ఇస్తుందో వేచి చూడాలి.
ఇంకో విషయం! హెచ్‌టీ తెలుగు ఇప్పుడు వాట్సప్ ఛానల్లో అందుబాటులో ఉంది! టెక్నాలజీ ప్రపంచం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం హెచ్‌టీ తెలుగు వాట్సాప్ ఛానెల్‌ని ఫాలో అవ్వండి.
సంబంధిత కథనం