Malayalam Movie OTT: 100 రోజులు పూర్తయినా ఇంకా ఓటీటీలోకి రాని సూపర్ హిట్ మలయాళం మూవీ.. ఈనెలలో అయినా!
Aadujeevitham OTT: ఆడుజీవితం సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ ఆలస్యమవుతూ వస్తోంది. థియేటర్లలో రిలీజై 100 రోజులైన ఇంకా ఓటీటీలోకి రాలేదు.
మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించిన ఆడుజీవితం (ది గోట్‍లైఫ్) సినిమాపై చాలా ప్రశంసలు వచ్చాయి. అదే రేంజ్‍లో కమర్షియల్‍గానూ చాలా సక్సెస్ అయింది. ఈ సర్వైవల్ డ్రామా చిత్రానికి బ్లెస్సీ దర్శకత్వం వహించారు. మార్చి 28న మలయాళంతో పాటు తెలుగులోనూ ఆడుజీవితం సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. మలయాళంలో భారీ స్థాయిలో వసూళ్లను దక్కించుకుంది. అయితే, ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడని వారు ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని చాలా ఎదురుచూస్తున్నారు. అయితే, ఆలస్యమవుతూ వస్తోంది.
100 రోజులు పూర్తయినా..
ఆడుజీవితం సినిమా థియేటర్లలో రిలీజై 100 రోజులు పూర్తయింది. అయినా ఇప్పటి వరకు ఓటీటీలోకి మాత్రం రాలేదు. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‍పై కొన్నిసార్లు రూమర్లు వచ్చాయి. అయినా అఫీషియల్‍గా ఏ అప్‍డేట్ రాలేదు. కనీసం స్ట్రీమింగ్ ప్లాట్‍ఫామ్‍పై కూడా మూవీ టీమ్ నుంచి అనౌన్స్‌మెంట్ రాలేదు.
ఇంకా డీల్ ఫినిష్ కాలేదా!
ఆడుజీవితం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ దక్కించుకుందని రూమర్లు వచ్చాయి. హాట్‍స్టార్ ఓటీటీతో ఈ మూవీ మేకర్స్ చాలా కాలంగా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. అయితే, మేకర్స్ కోరినంత మొత్తాన్ని హాట్‍స్టార్ ఇచ్చేందుకు సుముఖంగా లేకపోవటంతో డీల్ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది.
ఈనెలలో వస్తుందా!
హాట్‍స్టార్ ఓటీటీతో డీల్ కాకపోవటంతో అమెజాన్ ప్రైమ్ వీడియోతో ఆడుజీవితం మేకర్స్ చర్చలు చేస్తున్నట్టు సమాచారం ఉంది. ఒకవేళ ప్రైమ్ వీడియోతో డీల్ జరిగితే ఈనెలలోనే (జూలై) ఈ సినిమా స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోతో డీల్ పూర్తయిన వెంటనే మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
సూపర్ హిట్‍గా ఆడుజీవితం
ఆడుజీవితం సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‍బస్టర్ అయింది. ప్రయోగాత్మక చిత్రమే అయినా కమర్షియల్‍గానూ బంపర్ సక్సెస్ అయింది. ఈ సినిమాకు ఓవరాల్‍గా దాదాపు రూ.160కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మలయాళంలో ఈ చిత్రానికి కలెక్షన్ల వర్షం కురిసింది. తెలుగులో మాత్రం అంతగా ప్రభావం చూపలేకపోయింది. అయితే, ఓటీటీలోకి వస్తే తెలుగులోనూ మంచి వ్యూస్ దక్కించుకునే ఛాన్స్ ఉంది.
ఆడుజీవితం సినిమాలో పృథ్విరాజ్ సుకుమారన్ మెయిన్ రోల్ చేయగా.. అమలాపాల్, కేఆర్ గోకుల్, జిమ్మి జీన్ లూయిస్, శోభా మోహన్, తాలిబ్ అల్ బలుషి, రిక్ అబీ కీలకపాత్రలు పోషించారు. దర్శకుడు బ్లెస్సీ ఈ మూవీపై సుమారు పదేళ్ల పాటు పని చేశారు. సౌది అరేబియాలో ఉపాధి కోసం వెళ్లి ఎడారిలో చిక్కుకున్న నజీబ్ అనే వ్యక్తి నిజజీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. విజువల్ రొమాన్స్, జెట్ మీడియా ప్రొడక్షన్, అల్టా గ్లోబల్ మీడియా పతాకాలపై బ్లెస్సీ, జిమ్మీ జీన్ లూయిస్, స్టీవ్ ఆడమ్స్ ఈ మూవీని నిర్మించారు.
ఓటీటీలోకి వచ్చిన నెక్స్ట్ మూవీ
పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించిన గురువాయుర్ అంబలనాదయిల్ చిత్రం డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో జూన్ 27వ తేదీన స్ట్రీమింగ్‍కు వచ్చింది. అయితే, ఈ మూవీ ఆడుజీవితం తర్వాత మే 16న రిలీజ్ అయింది. అయినా, ఆడుజీవితం కంటే ముందే స్ట్రీమింగ్‍కు వచ్చేసింది.