Director Whisky: పేరెంట్స్‌ కోసమే విస్కీగా పేరు మార్చుకున్నాను, అది ఎవరి పేరంటే?: డైరెక్టర్ విస్కీ-the birthday boy movie director whisky says he did not showing his face because of his family tollywood ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Director Whisky: పేరెంట్స్‌ కోసమే విస్కీగా పేరు మార్చుకున్నాను, అది ఎవరి పేరంటే?: డైరెక్టర్ విస్కీ

Director Whisky: పేరెంట్స్‌ కోసమే విస్కీగా పేరు మార్చుకున్నాను, అది ఎవరి పేరంటే?: డైరెక్టర్ విస్కీ

Sanjiv Kumar HT Telugu
Jul 21, 2024 01:06 PM IST

The Birthday Boy Director Whisky About His Name: తన ఫ్యామిలీ, పేరెంట్స్ కోసమే విస్కీగా మార్చుకున్నట్లు ది బర్త్‌డే బాయ్ మూవీ డైరెక్టర్ విస్కీ చెప్పారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విస్కీ ఎవరి పేరో కూడా తెలిపారు.

పేరెంట్స్‌ కోసమే విస్కీగా పేరు మార్చుకున్నాను, అది ఎవరి పేరంటే?: డైరెక్టర్ విస్కీ
పేరెంట్స్‌ కోసమే విస్కీగా పేరు మార్చుకున్నాను, అది ఎవరి పేరంటే?: డైరెక్టర్ విస్కీ

The Birthday Boy Director Whisky: ర‌వికృష్ణ‌, స‌మీర్ మ‌ళ్లా, రాజీవ్‌క‌న‌కాల ముఖ్య‌పాత్ర‌ల్లో నటించిన సినిమా 'ది బర్త్‌డే బాయ్‌'. ఈ చిత్రాన్ని బొమ్మ బొరుసా ప‌తాకంపై ఐ. భరత్‌ నిర్మించారు. సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో తన పేరును మార్చుకోవడంపై డైరెక్టర్ విస్కీ ఆసక్తికర విశేషాలు తెలిపారు.

"2020లో ఈ కథతో సినిమా చేద్దామని అనుకున్నాను. అయితే ఈ కథకు ఆధారమైన రియల్‌ ఇన్‌సిడెంట్‌ మాత్రం జరిగింది 2016లో. ఈ నాలుగేళ్ల గ్యాప్‌లో యూఎస్‌లోనే ఉండి అక్కడ జాబ్‌ చేస్తూ మనీ సేవ్‌ చేసుకున్నాను. ఆ మనీతో ఇండియాకు వచ్చి నా స్నేహితుడు భరత్‌తో కలిసి ఈ సినిమా చేశాను" అని డైరెక్టర్ విస్కీ తెలిపారు.

"ఈ సినిమా కథ 80 శాతం వాస్తవ సన్నివేశాలు ఉంటాయి. అయితే సినిమాటిక్‌గా అనించడానికి, కమర్షియల్‌ వాల్యూస్‌ కోసం ఇరవై శాతం ఫిక్షన్‌ను జోడించాను. అయితే ఫిక్షన్‌ కూడా నా లైఫ్‌లో వేరే సందర్బంలో జరిగిన సన్నివేశాలు యాడ్‌ చేశాను. సినిమా ట్రైలర్ చూసి అందరూ సీరియస్‌ ఇష్యూని కామెడీగా డీల్‌ చేస్తున్నారా అని అడిగారు. అయితే రియల్‌ లైఫ్‌లో జాలీగా, హ్యపీగా ఉన్న మాకు ఆ సంఘటన జరుగుతుందని అసలు తెలియదు" అని విస్కీ అన్నారు.

"అయితే ఆ సంఘటన జరిగిన తరువాత ఎం జరిగింది? అనేది కథ. బర్త్‌డే బంప్స్‌ వల్ల ఒక స్నేహితుడు ఎలా చనిపోయాడు. ఆ తరువాత జరిగిందేమిటి అనేది ఎంతో ఉత్కఠభరితంగా ఉంటుంది. సినిమా మొదటి 15 నిమిషాలు మాత్రమే యూత్‌ఫుల్‌గా ఉంటుంది. ఆ తరువాత సినిమా అంతా సీరియస్‌గానే ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు ఆడియన్స్‌ అన్ని రకాల ఎమోషన్స్‌ ఫీలవుతారు" అని విస్కీ చెప్పుకొచ్చారు.

"సాధారణంగా ఒక ప్రాబ్లమ్‌లో ఇరక్కుంటే.. అమెరికాలో రూల్స్‌ చాలా కఠినంగా ఉంటాయి. ఆ టైమ్‌లో వాళ్లు ఏం చేశారు అనేది ఆసక్తికరంగా ఉంటుంది. నా ఫ్యామిలీలో ఎవరికి నేను సినీ పరిశ్రమలోకి వెళ్లడం ఇష్టంలేదు. నేను అమెరికా నుంచి వచ్చిన సంగతి కూడా తెలియదు. వాళ్లను బాధ పెట్టడం ఇష్టం లేక నేను నా పేరును విస్కీగా మార్చుకున్నాను. నా ఫేస్‌ కనిపించకుండా మాస్క్‌ వేసుకుని తిరుగుతున్నాను" అని తన పేరు వెనుక గల అసలు విషయం చెప్పారు విస్కీ.

"ఇక నాకు కోవిడ్‌లో ఎంతో ఇష్టమైన కుక్క పిల్ల చనిపోయింది. దాని పేరు విస్కీ. దాని జ్ఞాపకార్థం నా పేరును విస్కీగా మార్చుకున్నాను. చాలా సినిమాలు ప్రేక్షకులకు తెలియకుండా రిలీజై వెళుతున్నాయి. మా సినిమా అలా కాకూడదు అని వినూత్నంగా పబ్లిసిటిని చేశాం. మా బడ్జెట్‌లో కొన్ని ప్రమోషన్స్‌ ప్లాన్‌ చేశాం" అని విస్కీ అని పేరు పెట్టుకోవడం గురించి చెప్పారు.

"ఈ సినిమా హిట్‌ అయినా ఫ్లాప్‌ అయినా బాధ్యత నాదే. నాకు నచ్చింది ఇది చెబుతున్నాను. నా రెండు సినిమాలు వరుసగా సక్సెస్‌ కాకపోతే నేను సినిమాలు తీయడం ఆపేస్తాను. నన్ను ఆడియన్స్ రెండు సార్లు రిజెక్ట్‌ చేస్తే దర్శకత్వం మానేస్తాను. నేను ఏమీ చేసినా నా సినిమాకు హెల్ప్‌ అయితే చాలు. అది నాకు వ్యక్తిగతంగా అవసరం లేదు" అని డైరెక్టర్ విస్కీ వెల్లడించారు.

Whats_app_banner