Thangalaan Trailer: బంగారం కోసం వేట.. వావ్ అనేలా తంగలాన్ ట్రైలర్.. విక్రమ్ మళ్లీ అదుర్స్: చూసేయండి-thangalaan trailer released vikram pa ranjit historical action drama trailer out kollywood ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thangalaan Trailer: బంగారం కోసం వేట.. వావ్ అనేలా తంగలాన్ ట్రైలర్.. విక్రమ్ మళ్లీ అదుర్స్: చూసేయండి

Thangalaan Trailer: బంగారం కోసం వేట.. వావ్ అనేలా తంగలాన్ ట్రైలర్.. విక్రమ్ మళ్లీ అదుర్స్: చూసేయండి

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 10, 2024 05:43 PM IST

Thangalaan Trailer: తంగలాన్ ట్రైలర్ వచ్చేసింది. విక్రమ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమా ట్రైలర్ అదిరిపోయింది. అద్భుతమైన విజువల్స్, విక్రమ్ నట విశ్వరూపంతో ఆకట్టుకుంటోంది. పీరియడ్ యాక్షన్ చిత్రంగా వస్తోంది.

Thangalaan Trailer: బంగారం కోసం వేట.. తంగలాన్ ట్రైలర్ వచ్చేసింది.. విక్రమ్ మళ్లీ అదుర్స్: చూసేయండి
Thangalaan Trailer: బంగారం కోసం వేట.. తంగలాన్ ట్రైలర్ వచ్చేసింది.. విక్రమ్ మళ్లీ అదుర్స్: చూసేయండి

స్టార్ డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ప్రధాన పాత్ర పోషించిన తంగలాన్ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. ఫస్ట్ లుక్ నుంచే ఈ పాన్ ఇండియా మూవీపై హైప్ ఉంది. హిస్టారికల్ యాక్షన్ డ్రామా మూవీగా తంగలాన్ రూపొందింది. కొలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)లో బంగారం కోసం జరిగిన అన్వేషణ చుట్టూ తంగలాన్ మూవీ తెరకెక్కింది. ఎంతగానో ఎదురుచూస్తున్న తంగలాన్ సినిమా ట్రైలర్ నేడు (జూలై 10) రిలీజైంది.

ట్రైలర్ ఇలా..

భారత స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్ పాలన కాలం నాటి కథతో తంగలాన్ మూవీ వస్తోంది. యథార్థ ఘటన ఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందింది. ఆ ప్రాంతంలోని బంగారం నిక్షేపాలను వెలికితీయాలని ఓ బ్రిటీష్ అధికారి.. విక్రమ్ సారథ్యంలోని గ్రామస్తులను పని అప్పజెపుతారు. దీంతో బంగారాన్ని కనిపెట్టేందుకు విక్రమ్ సహా అక్కడి వారు వేట మొదలుపెడతారు. బంగారు నిక్షేపాలను కనుగొంటారు. అయితే అక్కడి బంగారాన్ని ఓ అతీత శక్తి కాపాడుతోందని గుర్తిస్తారు.

అక్కడి నుంచి బంగారం వెలికితీయకుండా ఓ మాంత్రికురాలు సంరక్షిస్తోందని విక్రమ్ కనిపెడతాడు. ఆ తర్వాత ఆ గ్రామస్తులకు చాలా సవాళ్లు ఎదురవుతాయి. ఆ మాంత్రికురాలిని తాను అరికడతానని విక్రమ్ చెబుతారు. ఈ క్రమంలో చాలా సవాళ్లు ఎదురవుతాయి. “చావును ఎదిరించే వారికి మాత్రమే ఇక్కడ జీవితం” అని విక్రమ్ డైలాగ్ ఉంది. యాక్షన్ సీన్లు, విజువల్స్ ఈ ట్రైలర్లో అద్భుతంగా ఉన్నాయి.

అదిరిపోయిన విక్రమ్ యాక్టింగ్, విజువల్స్

తంగలాన్ సినిమాలో చియాన్ విక్రమ్ మరోసారి డిఫరెంట్ గెటప్‍లో నటవిశ్వరూపం చూపించారు. విక్రమ్ గెటప్, యాక్టింగ్, యాక్షన్ అదిరిపోయాయి. చాలా ఇంటెన్స్‌గా కనిపించారు. దర్శకుడు పా రంజిత్ టేకింగ్ మరోసారి మెప్పించేలా ఉంది. ముఖ్యంగా తంగలాన్ ట్రైలర్లో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. అప్పటి ప్రపంచాన్ని కళ్లకు కట్టినట్టుగా ఉంది. గ్రాఫిక్స్ చాలా నేచురల్‍గా ఉంది. విజువల్స్ ఈ మూవీకి పెద్ద ప్లస్‍గా ఉన్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇంటెన్స్‌గా ఆకట్టుకుంది.

తంగలాన్ చిత్రంలో విక్రమ్ ప్రధాన పాత్ర పోషించగా.. మాళవిక మోహన్, పార్వతి తిరోవోతు, పశుపతి, డానియెల్ కాల్టగిరోన్, హరికృష్ణన్ అన్బుదురై, వెట్టై ముత్తుకుమార్ కీలకపాత్రలు చేశారు. పా రంజిత్ దర్శకత్వంలో రెండేళ్లుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. అయితే, గతేడాది చివర్లో రావాల్సిన ఈ సినిమా ఆలస్యమైంది.

తంగలాన్ మూవీని గ్రీన్ స్టూడియోస్, నీలం ప్రొడక్షన్స్, జియో స్టూడియోస్ పతాకాలపై కేఈ జ్ఞానవేల్ రాజా, పా రంజిత్, జ్యోతి దేశ్‍పాండే సంయుక్తంగా నిర్మించారు. సుమారు రూ.150కోట్ల భారీ బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందిందని అంచనా. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. 2డీతో పాటు 3డీ ఫార్మాట్లోనూ తీసుకురానున్నట్టు మేకర్స్ వెల్లడించారు.

రిలీజ్ అప్పుడేనా..

తంగలాన్ సినిమా రిలీజ్ డేట్‍ను ట్రైలర్లో ప్రకటించలేదు. అయితే, ఆగస్టు 15వ తేదీన ఈ మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

WhatsApp channel