Telugu Web Series OTT: రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ట్రైలర్ వచ్చేసింది.. ఎంటర్‌టైనింగ్‍గా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే-telugu romantic comedy web series sasimadhanam trailer release streaming date etv win soniya singh pavan sidhu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Web Series Ott: రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ట్రైలర్ వచ్చేసింది.. ఎంటర్‌టైనింగ్‍గా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Telugu Web Series OTT: రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ట్రైలర్ వచ్చేసింది.. ఎంటర్‌టైనింగ్‍గా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Sasimadhanam Telugu Web Series: శశిమథనం వెబ్ సిరీస్ ట్రైలర్ నేడు వచ్చేసింది. రొమాంటిక్ కామెడీ డ్రామా వస్తున్న ఈ సిరీస్ ట్రైలర్ ఎంటర్‌టైనింగ్‍గా ఉంది. ఈ సిరీస్ స్ట్రీమింగ్‍కు ఎప్పుడు రానుందంటే..

Telugu Web Series OTT: రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ సిరీస్ ట్రైలర్ వచ్చేసింది.. ఎంటర్‌టైనింగ్‍గా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

పవన్ సిద్ధు, సోనియా సింగ్ ప్రధాన పాత్రల్లో ‘శశిమథనం’ వెబ్ సిరీస్ వస్తోంది. రొమాంటిక్ కామెడీ డ్రామా సిరీస్‍గా ఇది రూపొందుతోంది. ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ సిరీస్ రానుంది. ఇటీవలే వచ్చిన టీజర్ ఆకట్టుకుంది. ఈ తరుణంలో శశిమథనం ట్రైలర్ నేడు (జూన్ 29) వచ్చేసింది.

దాగుడుమూతలతో ఫన్

కుటుంబ సభ్యులు పెళ్లికి పోయారని తన ప్రేమికుడు మదన్ (పవన్ సిద్ధు)ను ఇంట్లోకి రానిస్తుంది శశి (సోనియా సింగ్). అయితే, ఇంట్లో వాళ్లు సడెన్‍గా తిరిగి వచ్చేస్తారు. దీంతో మదన్ తన వారి కంట్లో పడకుండానే ఇంట్లోనే దాచేస్తుంటుంది శశి. ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే మదన్ ఉంటాడు. ఇలా దాగుడుమూతల మధ్య ఈ సిరీస్ ఉండనుంది. ట్రైలర్ ఎంటర్‌టైనింగ్‍గా సాగింది.

ఇంట్లో వాళ్లు కాలింగ్ బెల్ కొట్టగానే శశి, మదన్ కంగారు పడటంతో శశిమథనం ట్రైలర్ షురూ అయింది. ఆ తర్వాత మదన్‍ను దాచేందుకు శశి చేసే ప్రయత్నాలు, కుటుంబ సభ్యులు అనుమానించడం చుట్టూ సీన్లు ఉన్నాయి. మదన్ కూడా ఎవరి కంటా పడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాడు. అయితే, శశికి ఈ క్రమంలోనే వేరే అబ్బాయితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఇలా శశిమథనం ట్రైలర్ సరదాగా ఉంది. శశి, మదన్ దొరికిపోయారా.. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ సిరీస్‍లో చూడాలి.

శశిమథనం వెబ్ సిరీస్‍లో సోనియా సింగ్, పవన్ సిద్ధుతో పాటు కీర్తి, రూపలక్ష్మి, కృతిక, అశోక్ చంద్ర, కేశవ్ దీపక్, అవంతి దీపక్, శ్రీలలిత పమిడిపాటి కీలకపాత్రలు పోషించారు. ఈ వెబ్ సిరీస్‍కు వినోద్ గాలి దర్శకత్వం వహించారు. శశిమథనం సిరీస్‍ను పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించినట్టు తెలుస్తోంది.

శశిమథనం సిరీస్‍ను హరీశ్ కోహిర్కర్ ప్రొడ్యూజ్ చేశారు. సింజిత్ ఎర్రమల్లి సంగీతం అందించగా.. సినిమాటోగ్రాఫర్‌గా రేహాన్ షేక్ వ్యవహరించారు. ఈ సిరీస్‍కు అనిల్ కుమార్ పీ ఎడిటింగ్ చేశారు.

రిలీజ్ డేట్

శశిమథనం వెబ్ సిరీస్ జూలై 4వ తేదీన ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. “దాడుగు మూతల దండాకోర్.. ఎక్కడి ప్రేములు అక్కడే గప్‍చుప్” నేడు ట్రైలర్ తీసుకొచ్చింది ఈవీటీ విన్. జూలై 4న ప్రీమియర్ అవుతుందని వెల్లడించింది.

ఈటీవీ విన్ మరో వెబ్ సిరీస్‍ను కూడా తీసుకొస్తోంది. ఎయిర్ (AIR - ఆల్ ఇండియా ర్యాంకర్స్) పేరుతో ఈ సిరీస్ రానుంది. ఐఐటీలో సీటు కోసం విద్యార్థులు పడే కష్టాల చుట్టూ ఈ సిరీస్ స్టోరీ ఉండనుంది. ఇటీవలే ఫస్ట్ లుక్ రివీల్ చేయగా.. స్ట్రీమింగ్ డేట్‍ను ఈటీవీ విన్ త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. ఎయిర్ వెబ్ సిరీస్‍లో హర్ష్ రోషణ్, భాను ప్రతాప్, జయతీర్ష, వైవా హర్ష ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.