Crime Thriller OTT: థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ
Crime Thriller OTT: బిగ్‌బాస్ సీజన్ 2 బ్యూటీ సంజన అన్నే హీరోయిన్‌గా నటిస్తూ దర్శకత్వం వహించిన క్రైమ్ రీల్ మూవీ ఓటీటీలో రిలీజైంది. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో సిరి చౌదరి, భరత్ కీలక పాత్రల్లో నటించారు.
Crime Thriller OTT: తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ క్రైమ్ రీల్ థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. సంజన అన్నే హీరోయిన్‌గా నటిస్తూ ఈ సినిమాకు దర్శకత్వం వహించింది. భరత్, సిరి చౌదరితోపాటు జబర్ధస్థ్ అభి కీలక పాత్రల్లో నటించారు. ఈ ఏడాది జూలైలో ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది.
సోషల్ మీడియా మాయలో...
సోషల్ మీడియా మాయలో పడి యువత తమ జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారనే సందేశంతో క్రైమ్ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్‌గా క్రైమ్ రీల్ మూవీని సంజన అన్నే తెరకెక్కించింది. మౌనికకు (సిరి చౌదరి) సినిమాలంటే పిచ్చి. హీరోయిన్ కావాలని కలలు కంటుంది. మౌనికను ఆమె బావ అంజి (భరత్) ప్రాణంగా ప్రేమిస్తుంటాడు. సినిమాల్లో అవకాశం ఇస్తానని జాని (జబర్ధస్థ్ అభి) అనే వ్యక్తి మౌనికను తన వెంట తీసుకెళతాడు.
అనూహ్యంగా మౌనిక డెడ్‌బాడీ పోలీసులకు దొరుకుతుంది. మౌనిక మర్డర్ కేసును ఛేదించే బాధ్యత పోలీస్ ఆఫీసర్ మాయ (సంజన అన్నే) తీసుకుంటుంది. హంతకులకు సంబంధించి ఒక్కో ఆధారాన్ని సేకరించడం మొదలుపెడుతుంది. మౌనిక హత్యవెనకున్న మిస్టరీని మాయ ఎలా ఛేదించింది? ఈ హత్యతో అంజి, జానితో పాటు మరికొంత మంది వ్యక్తులకు ఎలాంటి సంబంధం ఉంది అనే పాయింట్‌తో క్రైమ్ రీల్ మూవీ సాగుతుంది.
డైరెక్టర్‌గా ఎంట్రీ...
ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా సంజన నటించగా...సినిమాలపై మోజు అన్న అమ్మాయిగా సిరి చౌదరి నటించింది. ఈ మూవీతోనే సంజన దర్శకురాలిగా మారింది.
బిగ్‌బాస్ సీజన్ 2
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నది సంజన అన్నే. . గ్లామర్‌తో హౌజ్‌లో కొన్నాళ్ల పాటు కొనసాగాలని అనుకున్నది. కానీ అనూహ్యంగా ఫస్ట్ వీక్‌లోనే షో నుంచి ఎలిమినేట్ అయ్యింది. గ్లామర్ డాల్ ఇమేజ్ ఆమెకు పెద్దగా కలిసి రాలేదు.
రానా మూవీలో...
తెలుగులో హీరోయిన్‌గా నీకు నాకు పెళ్లంట అనే సినిమా చేసింది. రానా, తేజ కాంబోలో వచ్చిన నేను రాజు నేనే మంత్రి సినిమాలో సంజన ఓ కీలక పాత్రలో నటించింది. దాదాపు ఐదారేళ్ల గ్యాప్ తర్వాత క్రైమ్ రీల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.