Tamannah in Odela 2: ఆ బోల్డ్ మూవీ సీక్వెల్ చేయబోతున్న తమన్నా.. మిస్టరీ థ్రిల్లర్ మూవీకి సై
Tamannah in Odela 2: మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా.. తన నెక్ట్స్ మూవీకి ఓకే చెప్పింది. రెండేళ్ల కిందట నేరుగా ఓటీటీ రిలీజైన బోల్డ్ మూవీ ఓదెల మూవీకి సీక్వెల్లో తమన్నా నటించబోతోంది.
Tamannah in Odela 2: తమన్నా భాటియా మరోసారి ఓ తెలుగు మూవీలో నటించబోతోంది. గతేడాది బాలీవుడ్ తోపాటు టాలీవుడ్, కోలీవుడ్ లోనూ నటించిన ఈ మిల్కీ బ్యూటీ.. ఇప్పుడు ఓ క్రైమ్ థ్రిల్లర్ సీక్వెల్ కు ఓకే చెప్పింది. 2022లో నేరుగా ఓటీటీలో రిలీజైన ఓదెల రైల్వే స్టేషన్ మూవీకి ఇప్పుడు ఓదెల 2 పేరుతో సీక్వెల్ రాబోతోంది.
ఓదెల 2లో తమన్నా
ఓదెల రైల్వే స్టేషన్ మూవీలో హెబ్బా పటేల్ నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో కొన్ని బోల్డ్ సీన్స్ లోనూ ఆమె నటించింది. ఇప్పుడీ సీక్వెల్ కు తమన్నా ఓకే చెప్పడంతో ఇందులో ఆమె ఎలాంటి సీన్స్ చేయబోతోందో అన్న ఆసక్తి నెలకొంది. అశోక్ తేజ డైరెక్షన్ లో ఈ థ్రిల్లర్ మూవీ ఓదెల 2 రానుంది. ఈ మధ్య కాలంలో స్క్రీన్ పై రెచ్చిపోయి నటిస్తోంది తమన్నా.
కాలానికి తగినట్లుగా మనమూ మారాలని చెబుతూ ఆమె గతేడాది లస్ట్ స్టోరీస్ 2, జీ కర్దాలాంటి సిరీస్ లలో తమన్నా బోల్డ్ సీన్స్ చేసింది. ఇప్పుడు ఓదెల్ 2 మూవీకి సరే అనడంతో ఇందులోనూ ఆమె అలాంటి సీన్స్ చేయబోతున్నట్లు స్పష్టమవుతోంది. 2023లో ఈ రెండు వెబ్ సిరీస్ లతోపాటు తమిళంలో జైలర్, తెలుగులో భోళా శంకర్ సినిమాల్లోనూ తమన్నా కనిపించింది.
గతంలో రచ్చ, బెంగాల్ టైగర్, సీటీమార్ లాంటి సినిమాలను డైరెక్ట్ చేసిన సంపత్ నంది ఈ ఓదెల 2 మూవీకి క్రియేటర్ గా ఉండనున్నాడు. వీటిలో రచ్చ మూవీలో తమన్నానే నటించింది.
ఓదెల రైల్వే స్టేషన్ స్టోరీ ఏంటి?
క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్ని ఇష్టపడే ప్రేక్షకుల్ని ఓదెల రైల్వేస్టేషన్ మెప్పిస్తుంది. పాటలు, ఫైట్స్, హీరోయిజం లాంటి హంగులు లేకుండా కేవలం గంటన్నర నిడివిలోనే తెరకెక్కిన రియలిస్టిక్ సినిమా ఇది.
సాధారణంగా సైకో కిల్లర్ కథలు ఎక్కువగా అర్బన్ బ్యాక్‌డ్రాప్‌తోనే ముడిపడి సాగుతుంటాయి. రూరల్ నేపథ్యాలతో ఈ జానర్ లో చాలా తక్కువ సినిమాలొచ్చాయి. ఓదెల రైల్వేస్టేషన్ ఆ బాపతు కథే. రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ ఆధారంగా దర్శకుడు సంపత్‌నంది ఈ కథను రాసుకున్నారు.
కుటుంబసభ్యులు, సమాజం చేతిలో అవమానాల పాలై ప్రతి ఏట ఇండియాలో వేలాది మంది ఇంపోటెంట్స్‌గా మారిపోతున్నారు. మానసికపరమైన సమస్యలతో సైకోకిల్లర్స్‌గా అవతారమెత్తుతూ ఎంతో మంది అమాయకులు ప్రాణాలను తీస్తున్నారనే సందేశంతో సినిమాను రూపొందించారు.
తాను రాసుకున్న కథను స్క్రీన్‌పై చెప్పడానికి సొంత గ్రామమైన ఓదెలను నేపథ్యంగా ఎంచుకున్నారు సంపత్ నంది. ఒగ్గు కథ ద్వారా ఆ ప్రాంత విశిష్టతను, అక్కడి స్వచ్ఛమైన వాతావరణం, మనుషులు, మనస్తత్వాల చూపిస్తూనే కథలోకి వెళ్లడం కొత్తగా ఉంది.అనుదీప్ అనే ఐపీఎస్ ఆఫీసర్ కోణం నుండి ఈ సినిమా కథ సాగుతుంది. అలాంటి సినిమాకు ఇప్పుడు ఓదెల 2 రూపంలో సీక్వెల్ వస్తుండటం, అందులో తమన్నా నటించనుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.