Aakhri Sach Review: ఆఖరి సచ్ రివ్యూ.. తమన్నా కొత్త సిరీస్ ఎలా ఉందంటే?-tamanna aakhri sach web series review and rating in telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aakhri Sach Review: ఆఖరి సచ్ రివ్యూ.. తమన్నా కొత్త సిరీస్ ఎలా ఉందంటే?

Aakhri Sach Review: ఆఖరి సచ్ రివ్యూ.. తమన్నా కొత్త సిరీస్ ఎలా ఉందంటే?

Sanjiv Kumar HT Telugu

Aakhri Sach Web Series Review: మిల్కీ బ్యూటి తమన్నా భాటియా ఇటీవల ఓటీటీ కంటెంట్ సినిమాలు, వెబ్ సిరీసులు ఎక్కువగా చేస్తోంది. తాజాగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో తమన్నా నటించిన వెబ్ సిరీస్ ఆఖరి సచ్ ఓటీటీలో (Aakhri Sach OTT) తెలుగు, హిందీతో సహా 7 భాషల్లో రిలీజైంది.

tamanna bhatia aakhri sach review

నటీనటులు: తమన్నా భాటియా, అభిషేక్ బెనర్జీ, శివిన్ నారంగ్, రాహుల్ బగ్గా, సంజీవ్ చోప్రా, గెహ్నా సేథ్, నిషు దీక్షిత్ తదితరులు

సినిమాటోగ్రఫీ: జై భన్సాలీ

ఎడిటింగ్: రాజేష్ పాండే

కథ: సౌరవ్ దే, రితూ శ్రీ

దర్శకత్వం: రాబీ గ్రేవాల్

సంగీతం: అనూజ్ దనైత్, శివమ్ సేన్ గుప్తా

నిర్మాతలు: వరుణ్ మాలిక్, నీతి సీమోస్, ప్రీతి సీమోస్

విడుదల తేది: ఆగస్ట్ 25, 2023

ఎపిసోడ్స్: 2 (ప్రతి శుక్రవారం ఒక ఎపిసోడ్ విడుదల చేయనున్నారు)

ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్‍స్టార్

Aakhri Sach Web Series Review Telugu: సౌత్ ఇండియన్ మిల్కీ బ్యూటి తమన్నా భాటియా (Tamanna Bhatia) ఇటీవల జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2 వంటి సిరీసులలో ఘాటు సీన్లతో అలరించింది. ఇప్పుడు సీరియస్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్‍గా ఆకట్టుకునేందుకు వచ్చిన తమన్నా కొత్త వెబ్ సిరీస్ 'ఆఖరి సచ్' (ఆఖ్రీ సచ్)(Aakhri Sach OTT Series). నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఆఖరి సచ్ సిరీసుకు రాబీ గ్రేవాల్ దర్శకత్వం వహించారు. ఆఖరి సచ్ సిరీస్ తొలి సీజన్‍లో 8 ఎపిసోడ్స్ (Aakhri Sach Total Episodes) ఉండగా.. ఒక్కో ఎపిసోడ్‍ను ప్రతి శుక్రవారం విడుదల చేయనున్నారు. ఆగస్ట్ 25 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఆఖరి సచ్ రెండు ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయో రివ్యూలో చూద్దాం.

కథ:

ఢిల్లీలోని కిషన్ నగర్‍లో ఆదేష్ కుటుంబంలోని మొత్తం 11 మంది అనుమానాస్పదంగా మరణిస్తారు. వారిలో 9 ఏళ్ల పిల్లాడి నుంచి 77 ఏళ్ల వృద్ధురాలి వరకు మూడు తరాల వారు ఉంటారు. సంచలనం సృష్టించిన ఈ కేసును ఆన్యా (తమన్నా భాటియా)కు అప్పగిస్తారు. విచారణ ప్రారంభించిన ఆన్యాకు ఎలాంచి లీడ్స్ దొరికాయి? ఆన్యా కేసు ఇన్వెస్టిగేషన్ ఎలా చేసింది? ఆదేష్ కుటుంబం గతం ఏంటీ? ఆదేష్ తండ్రి జవహర్ సింగ్ ఎలా చనిపోయాడు? ఆదేష్ కుటుంబానికి ఉన్న శత్రువులు ఎవరు? వంటి సస్పెన్స్ విషయాలు తెలియాలంటే ఆఖరి సచ్ చూడాల్సిందే.

విశ్లేషణ:

2018 సంవత్సరంలో దేశంలోనే సంచలనం సృష్టించింది బురారీ హత్యలు. న్యూ ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో చోటు చేసుకున్న ఒకే కుటుంబంలోని 11 మంది సభ్యుల హత్యలు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఆధారంగా తెరకెక్కిన సిరీస్ ఆఖరి సచ్. తొలి ఎపిసోడ్‍లో నేరుగా హత్యలు చూపించి కథలోకి తీసుకెళ్లారు. తమన్నా ఎంట్రీ, మర్డర్స్ తో ఆసక్తిగా ప్రారంభమైన సిరీస్ ఆకట్టుకునేలా ఉంది. చేతులు కట్టేసి, కళ్లకు గంతలు కట్టి ఉరి వేసుకున్నట్లుగా చూపించిన సన్నివేశాలు కథలోకి లీనమయ్యేలా చేశాయి.

మృతుల గతం

ఆదేష్ కుటుంబానికి చెందినవారిని, చుట్టుపక్కల వారిని విచారించడం, సీసీటీవీ ఫుటేజ్, మృతుల గతం, గొడవలు, నిశ్చితార్థం వేడుక వంటి సన్నివేశాలతో ఉత్కంఠంగా సాగింది. ఆదేష్ తండ్రి మరణంతో చిన్న ట్విస్ట్ ఇచ్చారు. అమన్ (శివిన్ నారంగ్) పాత్ర, చేసే పనులు ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయి. బీజీఎమ్ పర్వాలేదు. రెండు ఎపిసోడ్స్ మాత్రమే ఉన్న ఆఖరి సచ్ వెబ్ సిరీస్ గురించి ఇంతకుమించి చెప్పుకోవాల్సింది ఏం లేదు.

యాక్టింగ్ ఎలా ఉందంటే?

మొన్నటివరకు ఘాటు రొమాంటిక్ సీన్లతో రెచ్చిపోయిన తమన్నా భాటియా (Tamannaah Bhatia) ఈసారి కొత్త తరహా పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎంట్రీలో గ్లామర్‍తో అట్రాక్ట్ చేసిన ఈ బ్యూటి తర్వాత సీరియస్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంది. అభిషేక్ బెనర్జీ, శివిన్ నారంగ్ పాత్రల తీరు వర్కౌట్ అయ్యేలా ఉంది. ఫైనల్ గా చెప్పాలంటే పూర్తి ఎపిసోడ్స్ వచ్చాక 'ఆఖరి సచ్' సిరీస్‍పై (Aakhri Sach OTT Series Review) లుక్కేయడం మంచిది.