Mahesh Babu Rejected Movies: మహేష్ బాబు వదులుకున్న బ్లాక్‌బస్టర్ సినిమాలు ఇవే.. యానిమల్ నుంచి ఇడియట్ వరకు..-super star mahesh babu rejected movies animal pushpa idiot ghajini varsham ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mahesh Babu Rejected Movies: మహేష్ బాబు వదులుకున్న బ్లాక్‌బస్టర్ సినిమాలు ఇవే.. యానిమల్ నుంచి ఇడియట్ వరకు..

Mahesh Babu Rejected Movies: మహేష్ బాబు వదులుకున్న బ్లాక్‌బస్టర్ సినిమాలు ఇవే.. యానిమల్ నుంచి ఇడియట్ వరకు..

Hari Prasad S HT Telugu

Mahesh Babu Rejected Movies: మహేష్ బాబు ఇప్పటికే తెలుగులో సూపర్ స్టార్ అయినా.. అతడు వదులుకున్న కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా చేసి ఉంటే మరో రేంజ్ కు వెళ్లేవాడు.

మహేష్ బాబు వదులుకున్న బ్లాక్‌బస్టర్ సినిమాలు ఇవే.. యానిమల్ నుంచి ఇడియట్ వరకు..

Mahesh Babu Rejected Movies: మహేష్ బాబు తన కెరీర్లో కొన్ని సూపర్ హిట్ సినిమాలను వదులుకున్నాడు. ఏ హీరో అయినా కొన్నిసార్లు స్క్రిప్ట్ ను చదవడంలో పొరపాట్లు చేస్తుంటారు. అలా వదులుకున్న సినిమాలు కొన్నయితే.. మరికొన్ని డేట్లు కుదరకనో, మరో కారణంతోనో వదిలేసుకుంటారు. అవి వేరే హీరోల దగ్గరకు వెళ్లి వాళ్లను స్టార్లు మలుస్తుంటాయి. మరి సూపర్ స్టార్ వదులుకున్న అలాంటి సినిమాలేవో చూడండి.

మహేష్ బాబు వదులుకున్న సినిమాలు ఇవే

ఇడియట్

మహేష్ బాబుకు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ పోకిరిలాంటి సినిమా అందించిన డైరెక్టర్ పూరి జగన్నాథ్. అతడు అంతకుముందే తీసిన మూవీ ఇడియట్. రవితేజను రాత్రికి రాత్రే పెద్ద స్టార్ ను చేసేసింది. కానీ ఈ కథను నిజానికి ముందుగా మహేష్ కే చెప్పాడట. కెరీర్లో సీరియస్ రోల్స్ కోసం చూస్తున్న తాను.. ఈ మాస్ మూవీ చేయలేనని మహేష్ నిరాకరించాడట. దీంతో ఆ సినిమా రవితేజకు వెళ్లింది.

గజిని

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన మూవీ గజిని. ఇందులో మతి మరుపు పాత్రలో సూర్య నటనకు ఫిదా కాని వాళ్లు ఎవరూ లేరు. ఈ మూవీని హిందీలో ఆమిర్ ఖాన్ తీయగా.. అది ఇండియాలో తొలి రూ.100 కోట్ల కలెక్షన్ల సినిమాగా నిలిచింది. ఇలాంటి పాత్రను మహేష్ వదులుకున్నాడు. ఈ కథను అతడు నిరాకరించడానికి కారణమేంటో తెలియదు కానీ.. మురగదాస్ మొదట మూవీని మహేష్ తోనే తీయాలని భావించాడట.

పుష్ప

పుష్ప మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ పాన్ ఇండియా మూవీ ద్వారా అల్లు అర్జున్ రేంజ్ మరో లెవల్ కు వెళ్లింది. అయితే అప్పటికే మహేష్ తో వన్ నేనొక్కడినే సినిమా తీసిన సుకుమార్.. ఈ పుష్ప స్క్రిప్ట్ ను కూడా మొదట మహేష్ కే చెప్పాడట. కానీ ఈ పాత్ర స్వభావం, అందుకోసం కావాల్సిన మేకోవర్ నచ్చక అతడు నిరాకరించాడట.

యానిమల్

గతేడాది వచ్చి పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ అయిన మూవీ యానిమల్. ఇందులో బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ నటించాడు. ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ సినిమా స్క్రిప్ట్ ను డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మొదట మహేష్ కే వినిపించాడట. కానీ ఇందులోని హీరో పాత్ర తీరు తన వ్యక్తిగత ప్రాధాన్యతలకు పూర్తి భిన్నంగా ఉందంటూ అతడు నిరాకరించినట్లు వార్తలు వచ్చాయి.

యే మాయ చేసావే..

నాగ చైతన్య, సమంత లవ్ స్టోరీ మొదలై పెళ్లి వరకూ తీసుకెళ్లిన మూవీ యే మాయ చేసావె. గౌతమ్ వాసుదేవ్ మేనన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను కూడా మహేష్ బాబు వద్దనుకున్నాడు. దీంతో చైతన్య అనుకోని వరంలా ఈ మూవీ దొరికింది.

వర్షం

ప్రభాస్ కెరీర్లో అతి పెద్ద హిట్ లలో ఒకటి వర్షం. శోభన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మొదట మహేష్ బాబు దగ్గరికే వెళ్లిందట. కానీ అతడు మాత్రం మూవీని రిజెక్ట్ చేశాడు. అప్పట్లో టాలీవుడ్ లో ఓ సెన్సేషన్ గా ఈ సినిమా నిలిచింది.