Mr Idiot: హీరోగా రవితేజ వారుసుడు ఎంట్రీ.. మిస్టర్ ఇడియట్ టీజర్ రిలీజ్-ravi teja nephew madhav debut movie mr idiot teaser released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mr Idiot: హీరోగా రవితేజ వారుసుడు ఎంట్రీ.. మిస్టర్ ఇడియట్ టీజర్ రిలీజ్

Mr Idiot: హీరోగా రవితేజ వారుసుడు ఎంట్రీ.. మిస్టర్ ఇడియట్ టీజర్ రిలీజ్

Sanjiv Kumar HT Telugu
Published May 11, 2024 08:13 AM IST

Ravi Teja Madhav Mr Idiot Teaser: మాస్ మహారాజా రవితేజ వారసుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు మాధవ్. మిస్టర్ ఇడియట్ అనే సినిమాతో రవితేజ మేనల్లుడు మాధవ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. మే 10న మిస్టర్ ఇడియట్ టీజర్ రిలీజ్ అయింది. ఆ విశేషాల్లోకి వెళితే..

హీరోగా రవితేజ వారుసుడు ఎంట్రీ.. మిస్టర్ ఇడియట్ టీజర్ రిలీజ్
హీరోగా రవితేజ వారుసుడు ఎంట్రీ.. మిస్టర్ ఇడియట్ టీజర్ రిలీజ్

Ravi Teja Madhav Mr Idiot Teaser: మాస్ మహరాజ్ రవితేజ వారసుడిగా మాధవ్ హీరోగా న‌టిస్తోన్న‌ సినిమా "మిస్టర్ ఇడియ‌ట్‌". ఈ చిత్రంలో సిమ్రాన్ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో నిర్మాత జేజే ఆర్ రవిచంద్ "మిస్టర్ ఇడియ‌ట్‌" సినిమాను నిర్మిస్తున్నారు.

"పెళ్లి సందడి" చిత్రంతో కమర్షియల్ హిట్ అందుకున్న దర్శకురాలు గౌరీ రోణంకి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. శుక్రవారం (మే 10) "మిస్టర్ ఇడియ‌ట్‌" టీజర్‌ను రవితేజ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. దీంతో ఈ సినిమాపై బజ్ క్రియేట్ అయింది. ఒక్కసారిగా రవితేజ వారసుడు అంటూ నెట్టింట్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

ఇక మిస్టర్ ఇడియ‌ట్‌ టీజర్ చూస్తే.. ధృవ ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్‌లో చదివే సత్య (హీరోయిన్ సిమ్రాన్ శర్మ) కాలేజ్ టాపర్. ఆమె డిజైన్ గీస్తే ది బెస్ట్‌గా నిలవాల్సిందే. కాలేజ్‌లో సత్య మెరిట్‌ను బీట్ చేయడం ఎవరి వల్లా కాదు. అలాంటి టైమ్‌లో కాలేజ్‌లో అడుగుపెడతాడు హీరో (మాధ‌వ్).

సత్యను న గుణింతంతో పిలుస్తూ సరదాగా టీజ్ చేస్తుంటాడు. హీరోయిన్‌ను హీరో న గుణింతంతో ఎందుకు పిలుస్తున్నాడు? అల్లరిగా సాగే వీరి స్నేహం ప్రేమగా ఎలా మారింది ? అనేది టీజర్‌లో ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. రవితేజలా మాధవ్ ఎనర్జిటిక్‌గా కనిపించాడు. స్టైలిష్ లుక్స్‌తో పాటు పర్ ఫార్మెన్స్‌లోనూ ఆకట్టుకున్నాడు.

టీజర్‌లో కొన్ని రవితేజ ఇడియట్ సినిమా ఛాయలు కనిపించాయి. అందులో సుశీ అని రవితేజ పిలిస్తే.. ఇందులో న గుణింతం అని హీరో పిలవడం ఆసక్తికరంగా ఉంది. ఫ్యాషన్ డిజైన్ బొమ్మలను బూతు బొమ్మలుగా హీరో తండ్రి మాట్లాడే విధానం కామెడీగా ఉంది. సినిమాను లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న "మిస్టర్ ఇడియ‌ట్‌" సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. రిలీజ్ డేట్‌ను మేకర్స్ త్వరలో అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే మిస్టర్ ఇడియట్ మూవీతో హీరోగా పరిచయం అవుతున్న మాధవ్ మాస్ మహారాజా రవితేజకు మేనల్లుడని తసమాచారం.

కాగా ప్రస్తుతం రవితేజ వరుసపెట్టి సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. హిట్స్ ఫ్లాప్స్ అంటూ తేడా లేకుండా ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాతో అలరిస్తూనే ఉంటాడు రవితేజ. ఇటీవల టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ అలరించాడు. అంతకుముందు ధమాకాతో భారీ హిట్ కొట్టినప్పటికీ రావాణాసుర సినిమాతో ప్లాప్ చవిచూశాడు.

ప్రస్తుతం రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు. దీనికి డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇంతకుముందు షాక్, మిరపకాయ్ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. వీటిలో షాక్ యావరేజ్‌గా నిలవగా.. మిరపకాయ్ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

ఇప్పుడు మూడోసారి రవితేజ-హరీష్ శంకర్ కాంబినేషన్ రిపీట్ కావడంతో మిస్టర్ బచ్చన్‌పై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాలో రవితేజకు జోడీగా హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సేను మేకర్స్ సెలెక్ట్ చేశారు. అలాగే ఈ మూవీలో అభిమన్యు సింగ్ నటిస్తున్నాడు. ఇతను హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన గబ్బర్ సింగ్ సినిమాలో విలన్ రోల్ పోషించాడు.

Whats_app_banner