Suhas Movie: కొంప ముంచిన వరదలు.. చివరి నిమిషంలో కామెడీ మూవీ రిలీజ్ వాయిదా.. మళ్లీ ఎప్పుడు వస్తుందంటే?-suhas movie janaka aithe ganaka release postponed indefinitely due to ap telangana floods heavy rains ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Suhas Movie: కొంప ముంచిన వరదలు.. చివరి నిమిషంలో కామెడీ మూవీ రిలీజ్ వాయిదా.. మళ్లీ ఎప్పుడు వస్తుందంటే?

Suhas Movie: కొంప ముంచిన వరదలు.. చివరి నిమిషంలో కామెడీ మూవీ రిలీజ్ వాయిదా.. మళ్లీ ఎప్పుడు వస్తుందంటే?

Hari Prasad S HT Telugu
Sep 04, 2024 02:06 PM IST

Suhas Movie: ఏపీ, తెలంగాణల్లోని వరదలు కొంప ముంచాయి. దీంతో తెలుగులో ఈ వారం రిలీజ్ కావాల్సిన కామెడీ మూవీ వాయిదా పడింది. సుహాస్ నటించిన ఈ సినిమాను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ బుధవారం (సెప్టెంబర్ 4) అధికారికంగా అనౌన్స్ చేశారు.

కొంప ముంచిన వరదలు.. చివరి నిమిషంలో కామెడీ మూవీ రిలీజ్ వాయిదా.. మళ్లీ ఎప్పుడు వస్తుందంటే?
కొంప ముంచిన వరదలు.. చివరి నిమిషంలో కామెడీ మూవీ రిలీజ్ వాయిదా.. మళ్లీ ఎప్పుడు వస్తుందంటే?

Suhas Movie: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు సినిమాల రిలీజ్‌పైనా ప్రభావం చూపుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వర్షాలు ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో తమ సినిమాను రిలీజ్ చేసినా లాభం ఉండదని భావించిన జనక అయితే గనక మూవీ మేకర్స్.. రిలీజ్ ను నిరవధికంగా వాయిదా వేశారు.

జనక అయితే గనక రిలీజ్ వాయిదా

టాలీవుడ్ యువ నటుడు సుహాస్ నటించిన మూవీ జనక అయితే గనక. ఈ ఏడాది ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్ సాధించాడతడు. అంబాజీపేట మ్యారేజీ బ్యాండు, శ్రీరంగ నీతులు, ప్రసన్న వదనంలాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుహాస్.. సెప్టెంబర్ 7న జనక అయితే గనక అనే మరో కామెడీ మూవీతో రావాల్సి ఉంది.

అయితే ప్రస్తుతం ఏపీ, తెలంగాణల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు బుధవారం (సెప్టెంబర్ 4) మేకర్స్ వెల్లడించారు. మళ్లీ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తామన్న సంగతి కూడా మేకర్స్ చెప్పలేదు. దీంతో ప్రస్తుతానికి నిరవధికంగా వాయిదా పడినట్లే.

ప్రమోషన్లు జోరుగా చేసినా..

ఈ జనక అయితే గనక మూవీ ప్రమోషన్లను భారీగానే చేశారు. ఆహా వీడియోలో వస్తున్న ఇండియన్ ఐడల్ తెలుగు షోకి కూడా సుహాస్ తోపాటు ఇతర నటీనటులు వెళ్లారు. అంతేకాదు మూవీ సక్సెస్ అవుతుందన్న నమ్మకంతో ఈ సినిమా యూఎస్ హక్కులను కూడా భారీ ధరకు సుహాసే తీసుకోవడం విశేషం.

కానీ దురదృష్టవశాత్తూ సినిమాను చివరి నిమిషంలో వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ వరద సహాయక చర్యల కోసం జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబులాంటి సినీ ప్రముఖులు కూడా విరాళాలు ఇచ్చిన విషయం తెలిసిందే.

జనక అయితే గనక కథేంటంటే?

జనక అయితే గనక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో వస్తున్న కామెడీ మూవీ. ఓ సాదాసీదా సేల్స్ మ్యాన్ ఉద్యోగం చేసే హీరో.. ఖర్చులకు భయపడి పెళ్లి చేసుకున్నా అప్పుడే పిల్లలు వద్దనుకుంటాడు. కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అతని భార్య గర్భం దాలుస్తుంది. దీంతో సుహాస్ కండోమ్ తయారు చేసే సంస్థపైనే కేసు వేస్తాడు.

బేసిగ్గా ఇదే జనక అయితే గనక మూవీ స్టోరీ. దీనిని చాలా ఫన్నీగా చెప్పే ప్రయత్నం మేకర్స్ చేశారు. గోపరాజు రమణ, వెన్నెల కిశోర్ లాంటి వాళ్లు కూడా ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ మూవీని సందీప్ రెడ్డి బండ్ల డైరెక్ట్ చేశాడు.