Bigg boss 8 Telugu: ఇంత చీప్ గొడ‌వ‌లేంటి బిగ్‌బాస్ - సోది ఎక్కువైందంటూ ట్రోల్స్ - ఫ‌స్ట్ వీక్ ఎలిమినేష‌న్ ఎవ‌రంటే?-sonia silly fight with prerna netizens trolls on bigg boss 8 telugu nominations ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 8 Telugu: ఇంత చీప్ గొడ‌వ‌లేంటి బిగ్‌బాస్ - సోది ఎక్కువైందంటూ ట్రోల్స్ - ఫ‌స్ట్ వీక్ ఎలిమినేష‌న్ ఎవ‌రంటే?

Bigg boss 8 Telugu: ఇంత చీప్ గొడ‌వ‌లేంటి బిగ్‌బాస్ - సోది ఎక్కువైందంటూ ట్రోల్స్ - ఫ‌స్ట్ వీక్ ఎలిమినేష‌న్ ఎవ‌రంటే?

Nelki Naresh Kumar HT Telugu
Sep 04, 2024 09:42 AM IST

Bigg boss 8 Telugu Elimination: బిగ్‌బాస్ 8 తెలుగు ఫస్ట్ వీక్ నామినేష‌న్ల ప్ర‌క్రియ మొత్తం గొడ‌వ‌ల‌తోనే సాగింది. అయితే సోనియా, ప్రేర‌ణ‌తో పాటు మిగిలిన కంటెస్టెంట్ల గొడ‌వ‌లు, వాద‌న‌లు తెచ్చిపెట్టుకున్న‌ట్లుగా ఆర్టిఫీషియ‌ల్‌గా ఉన్నాయంటూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

బిగ్‌బాస్ 8 తెలుగు ఎలిమినేషన్
బిగ్‌బాస్ 8 తెలుగు ఎలిమినేషన్

Bigg boss 8 Telugu Elimination: బిగ్‌బాస్ ఫ‌స్ట్ వీక్ నామినేష‌న్ల ప్ర‌క్రియ మొత్తం గొడ‌వ‌ల‌తోనే సాగింది. హౌజ్‌లో అడుగుపెట్టిన రెండో రోజే సోనియా ఆకుల‌, ప్రేర‌ణ ఒక‌రిపై మ‌రొక‌రు క‌త్తులు దూసుకునే వ‌ర‌కు వెళ్లారు. కుక్క‌ర్ విష‌యంలో మొద‌లైన గొడ‌వను కొన‌సాగిస్తూ ఒక‌రితో మ‌రొక‌రూ ఆర్గ్యూమెంట్స్ చేసుకున్నారు.

కానీ ఆ గొడ‌వ తెచ్చిపెట్టికున్న‌ట్లుగా చాలా ఆర్టిఫీషియ‌ల్‌గా ఉందంటూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. బాత్‌రూమ్ విష‌యంలో వారి వాద‌న‌లు సిల్లీగా ఉన్నాయ‌ని అంటున్నారు.

సోకియా అరుపులు...

నామినేష‌న్స్‌లో కంటెస్టెంట్స్ ఆర్గ్యూమెంట్స్‌ క‌న్ఫ్యూజింగ్‌గా సాగిన‌ట్లుగా అనిపించింది. ముఖ్యంగా సోనియా ప్ర‌తి మాట‌కు ఇత‌రుల‌తో గొడ‌వ‌లు ప‌డ‌టం కామెడీగా ఉంది. గొంతు చించుకొని అర‌వ‌డం, అస‌లు ఏ విష‌యంలో, దేనికోసం గొడ‌వ‌ప‌డుతుందో కూడా అర్థం కాలేదు. ఆమెకు నిఖిల్ తో పాటు మిగిలిన వాళ్లు స‌ర్ధిచెప్ప‌డానికి ప్ర‌య‌త్నించిన విన‌లేదు.

నైనిక‌, న‌బీల్‌, బేబ‌క్క‌తో పాటు మ‌రికొంద‌రు కంటెస్టెంట్స్ వాద‌న‌లు ఓవ‌ర్‌యాక్టింగ్‌గా ఉన్నాయ‌ని నెటిజ‌న్లు చెబుతోన్నారు. గొడ‌వ‌లుపెట్టుకుంటేనే ఆట ఆడిన‌ట్లుగా అనే ఫీలింగ్‌లో అంద‌రూ పోటీప‌డ్డ‌ట్టుగా క‌నిపించించింది. సోది ఎక్కువైపోయింద‌ని చెబుతోన్నారు. రెండో రోజు గొడ‌వ‌లు ఇలా ఉంటే...పోను పోను ఇంక ఎంత ర‌చ్చ ర‌చ్చ ఉంటుందోన‌ని బిగ్‌బాస్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తోన్నారు.

అభియ్ న‌వీన్ ఇలా...

విష్ణుప్రియ‌, అభ‌య్ న‌వీన్ బిగ్‌బాస్ గేమ్‌ను ఎలా మొద‌లుపెట్టాలో తెలియ‌ని క‌న్ఫ్యూజ‌న్‌లో ఉన్న‌ట్లుగా క‌నిపిస్తున్నారు. అంత యాక్టివ్‌గా లేరు. ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన అన్ని సీజ‌న్స్‌లో కెప్టెన్స్‌కు నామినేష‌న్స్ నుంచి మిన‌హాయింపు ఉండేది. ఇప్పుడు కెప్టెన్ పోస్ట్‌ను చీఫ్స్ గా మార్చారు. ఫ‌స్ట్ వీక్ చీఫ్స్‌గా ఉన్న నిఖిల్, నైనిక‌, య‌ష్మిగౌడ‌ల‌కు నామినేష‌న్స్ నుంచి మిన‌హాయింపు ద‌క్కింది.

బేబ‌క్క ఎలిమినేష‌న్‌...

ఫ‌స్ట్ వీక్ బిగ్‌బాస్ ఎలిమినేష‌న్‌లో బేబ‌క్క‌, మ‌ణికంఠ‌, పృథ్వీరాజ్‌, సోనియా విష్ణుప్రియ‌, శేఖ‌ర్ భాషా ఉన్నారు. బేబ‌క్క బిగ్‌బాస్ 8 నుంచి ఎలిమినేట్ అయ్యే ఫ‌స్ట్ కంటెస్టెంట్‌గా నిలిచే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

గ‌త సీజ‌న్స్ ప‌రిశీలిస్తే ఫ‌స్ట్ వీక్‌లో వంట గ‌ది బాధ్య‌త‌ల్ని తీసుకున్న కంటెస్టెంట్స్ తొలుత బిగ్‌బాస్ హౌజ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. హేమ‌, క‌రాటే క‌ళ్యాణి తో పాటు మ‌రికొంద‌రు కంటెస్టెంట్స్ విష‌యంలో ఇదే జ‌రిగింది. ఆ సెంటిమెంట్ బేబ‌క్క విష‌యంలో కంటిన్యూ అయ్యే అవ‌కాశం క‌నిపిస్తుంద‌ని అంటున్నారు.

మ‌రోవైపు ఫ‌స్ట్ వీక్ ఎలిమినేష‌న్ లేదంటూ నాగార్జున స‌ర్‌ప్రైజ్ కూడా ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. అదే జ‌రిగితే బేబ‌క్క మ‌రో వారం పాటు హౌజ్‌లో కొన‌సాగిన‌ట్లే. గ‌త సీజ‌న్‌లో ఫ‌స్ట్ వీక్ ఎలిమినేష‌న్ నుంచి మిన‌హాయింపు ఇచ్చారు. ఈ సారి కూడా ఆ రూల్‌ను కొన‌సాగిస్తారా లేదా? అన్న‌ది వీకెండ్ తేల‌నుంది.