Siima 2024 Awards: ‘సైమా’లో నాని సినిమాల ఆధిపత్యం: ఉత్తమ నటుడిగా అవార్డు.. బెస్ట్ మూవీగా బాలయ్య చిత్రం: ఫుల్ లిస్ట్ ఇదే
Siima Awards 2024 Winners: సైమా 2024 అవార్డుల వేడుక గ్రాండ్‍గా జరిగింది. తెలుగుకు గాను ఉత్తమ నటుడిగా నాని అవార్డు దక్కించుకున్నారు. దసరా చిత్రం ఆధిపత్యం చూపింది. ఉత్తమ మూవీగా భగవంత్ కేసరి నిలిచింది. పూర్తి విజేతల జాబితా ఇక్కడ చూడండి.
దుబాయ్ వేదికగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2024 (సైమా 2024) ఈవెంట్ కళ్లు చెదిరేలా జరుగుతోంది. 2023లో విడుదలైన దక్షిణాది సినిమాలకు గాను విజేతలు అవార్డులు అందుకున్నారు. సెప్టెంబర్ 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ అవార్డుల వేడుక సాగనుంది. 14వ తేదీన తెలుగుకు సంబంధించిన అవార్డులను విజేతలు అందుకున్నారు. అలాగే, కొందరు సినీ తారలు డ్యాన్స్ పర్ఫార్మెన్సులతో మెప్పించారు.
నాని సినిమాల ఆధిపత్యం
2023లో నాని హీరోగా నటించిన దసరా, హాయ్ నాన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. సైమా అవార్డుల్లో ఈ రెండు సినిమాలకు వివిధ విభాగాల్లో అవార్డులు దక్కాయి. ముఖ్యంగా దసరా ఆధిపత్యం చూపింది. ఈ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా నాని సైమా అవార్డు అందుకున్నారు. ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడి అవార్డులు కూడా ఈ చిత్రానికి దక్కాయి. హాయ్ నాన్న నాలుగు పురస్కారాలను దక్కించుకుంది. 2023కు గాను ఉత్తమ చిత్రంగా బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి అవార్డు సొంతం చేసుకుంది. ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ మూవీకి కూడా నాలుగు పురస్కారాలు దక్కాయి. సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్‌గా స్పెషల్ అవార్డు అందుకున్నారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.
సైమా 2024 (తెలుగు) అవార్డుల జాబితా ఇదే
- బెస్ట్ సినిమా - భగవంత్ కేసరి
- బెస్ట్ యాక్టర్ - నాని (దసరా)
- బెస్ట్ నటి - కీర్తి సురేశ్ (దసరా)
- బెస్ట్ డైరెక్టర్ - శ్రీకాంత్ ఓదెల (దసరా)
- బెస్ట్ డెబ్యూ యాక్టర్ - సంగీత్ శోభన్ (మ్యాడ్)
- బెస్ట్ డెబ్యూ నటి - వైష్ణవి చైతన్య (బేబీ)
- బెస్ట్ సపోర్టింగ్ రోల్ - దీక్షిత్ శెట్టి (దసరా)
- బెస్ట్ సపోర్టింగ్ రోల్ (ఫీమేల్) - బేబీ ఖియారా ఖన్నా (హాయ్ నాన్న)
- బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ - హేషం అబ్దుల్ వాహబ్ (ఖుషి, హాయ్ నాన్న)
- బెస్ట్ కమెడియన్ - విష్ణు ఓయ్(మ్యాడ్)
- బెస్ట్ సినిమాటోగ్రఫీ - భువన గౌడ (సలార్)
- బెస్ట్ సింగర్ (మేల్) - రామ్ మిర్యాల (ఊరు పల్లెటూరు - బలగం)
- బెస్ట్ లిరిసిస్ట్ - అనంత్ శ్రీరామ్ (ఓ రెండు ప్రేమ మేఘాలిలా - బేబీ)
- బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ - శౌర్యువ్ (హాయ్ నాన్న)
- బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూజర్ - వైరా ఎంటర్‌టైన్‍మెంట్స్ (హాయ్ నాన్న)
- బెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్) - ఆనంద్ దేవరకొండ (బేబీ)
- బెస్ట్ నటి (క్రిటిక్స్) - మృణాల్ ఠాకూర్ (హాయ్ నాన్న)
- బెస్ట్ డైరెక్టర్ (క్రిటిక్స్) - సాయి రాజేశ్ (హాయ్ నాన్న)
- సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్ - డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా
సందడి చేసిన విజయ్ దేవరకొండ
సైమా అవార్డుల వేడుకలో చాలా మంది టాలీవుడ్ సెలెబ్రిటీలు సందడి చేశారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ స్పెషల్ అట్రాక్షన్‍గా నిలిచారు. ఉత్తమ నటుడిగా నానికి విజయ్ అవార్డు అందించారు. తన తమ్ముడు విజయ్ దేవరకొండకు కూడా పురస్కారం ఇచ్చారు.