Bhagavanth Kesari 10 days collections: కొనసాగుతున్న ‘భగవంత్ కేసరి’ జోరు.. 10 రోజుల్లో ఎన్ని కోట్లంటే!
Bhagavanth Kesari 10 days collections: భగవంత్ కేసరి సినిమా జోరు కొనసాగుతోంది. 10 రోజుల్లో ఈ సినిమా ఎన్ని కోట్ల వసూళ్లు రాబట్టిందో మేకర్స్ వెల్లడించారు.

Bhagavanth Kesari 10 days collections: నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా బ్లాక్‍బాస్టర్ దిశగా ముందుకు వెళుతోంది. అక్టోబర్ 19న రిలీజ్ అయిన ఈ చిత్రం ఆరంభం నుంచి పాజిటివ్ టాక్‍తో మంచి కలెక్షన్లను సాధిస్తోంది. దర్శకుడు అనిల్ రావిపూడి తన శైలికి భిన్నంగా ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా భగవంత్ కేసరి చిత్రాన్ని తెరకెక్కించిన విధానంపై ప్రశంసలు వస్తున్నాయి. ఈ చిత్రానికి వసూళ్ల జోరు కూడా కొనసాగుతోంది. ఈ తరుణంలో భగవంత్ కేసరి సినిమా 10 రోజుల కలెక్షన్లు గురించి మేకర్స్ ప్రకటించారు.
భగవంత్ కేసరి సినిమా 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 123.92 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించిందని షైన్ స్క్రీన్స్ బ్యానర్ ట్వీట్ చేసింది. బ్లాక్‍బాస్టర్ దావత్ అంటూ మరో పోస్టర్ రిలీజ్ చేసింది. మరో సాలిడ్ వీకెండ్ నమోదవుతుందని రాసుకొచ్చింది. కాగా, నందమూరి బాలకృష్ణకు భగవంత్ కేసరి వరుసగా మూడో రూ.100కోట్ల మూవీగా నిలిచింది. బాలయ్య కెరీర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా భగవంత్ కేసరి నిలువనుందనే అంచనాలు ఉన్నాయి.
భగవంత్ కేసరి సినిమాకు ఆదివారం కూడా బుకింగ్స్ బాగానే జరిగాయి. లియో జోరు తగ్గడం కూడా ఈ చిత్రానికి కలిసి వచ్చింది. మరోవైపు టైగర్ నాగేశ్వరరావు సినిమాకు మోస్తరుగానే వసూళ్లు వస్తున్నాయి. ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమాకే ఎక్కువ ఆదరణ కనిపిస్తోంది. ఇందుకు తగ్గట్టుగానే ఆ మూవీ యూనిట్ ప్రమోషన్లను కొనసాగిస్తోంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి, శ్రీలీల కొన్ని థియేటర్లకు వెళుతూ ప్రమోషన్లు చేస్తున్నారు. బ్లాక్‍బాస్టర్ షేర్ కా టూర్ పేరుతో ఈ ప్రమోషనల్ టూర్ చేస్తోంది భగవంత్ సింగ్ మూవీ టీమ్. సినిమాలోని మహిళా సాధికారత అంశాన్ని హైలైట్ చేస్తోంది.
కాగా, భగవంత్ కేసరి సినిమాకు ‘దంచవే మేనత్త కూతురా’ రీమిక్స్ పాటను కూడా తాజాగా యాడ్ చేశారు మేకర్స్. ఈ పాటలో బాలకృష్ణ, హీరోయిన్ కాజల్ అగర్వాల్, శ్రీలీల ఫుల్ జోష్‍గా డ్యాన్స్ చేశారు. భగవంత్ కేసరి మూవీకి థమన్ సంగీతం అందించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు.
టాపిక్