Shraddha Kapoor: స్టార్ హీరో ఇంట్లోకి అద్దెకు వెళ్తున్న హీరోయిన్.. నెలకు రెంట్ ఎంతో తెలుసా?-shraddha kapoor moving into current home of hrithik roshan stree 2 actress now the neighbour of akshay kumar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shraddha Kapoor: స్టార్ హీరో ఇంట్లోకి అద్దెకు వెళ్తున్న హీరోయిన్.. నెలకు రెంట్ ఎంతో తెలుసా?

Shraddha Kapoor: స్టార్ హీరో ఇంట్లోకి అద్దెకు వెళ్తున్న హీరోయిన్.. నెలకు రెంట్ ఎంతో తెలుసా?

Hari Prasad S HT Telugu
Aug 28, 2024 12:08 PM IST

Shraddha Kapoor: ప్రస్తుతం స్టార్ హీరో ఉంటున్న ఇంట్లోకి మరో స్టార్ హీరోయిన్ అద్దెకు వెళ్తోంది. బాలీవుడ్ లో ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారిపోయింది. అంతేకాదు ఆమె నెలకు కట్టబోయే రెంట్ కూడా షాకింగ్‌గానే ఉంది.

స్టార్ హీరో ఇంట్లోకి అద్దెకు వెళ్తున్న హీరోయిన్.. నెలకు రెంట్ ఎంతో తెలుసా?
స్టార్ హీరో ఇంట్లోకి అద్దెకు వెళ్తున్న హీరోయిన్.. నెలకు రెంట్ ఎంతో తెలుసా?

Shraddha Kapoor: బాలీవుడ్‌లో ప్రస్తుతం సంచలనాలు సృష్టిస్తున్న స్త్రీ2 మూవీలో ఫిమేల్ లీడ్ పాత్ర పోషించిన శ్రద్ధా కపూర్ కొత్త ఇంట్లోకి వెళ్తోంది. నిజానికి ఆ ఇంట్లో ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఉంటున్నాడు. ఈ హారర్ కామెడీ మూవీ బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టిన తర్వాత శ్రద్ధా కూడా కొత్త ఇల్లు వెతుక్కుంది. అంతేకాదు ఇది ఆ బిల్డింగ్‌లో ఉంటున్న మరో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌ పొరుగిల్లే కావడం మరో విశేషం.

కొత్తింట్లోకి శ్రద్ధా కపూర్

స్త్రీ2 మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నశ్రద్ధా కపూర్.. ముంబైలోని జుహులో ప్రస్తుతం హృతిక్ రోషన్ ఉంటున్న ఇంటినే అద్దెకు తీసుకోబోతోంది. దీనికోసం ఆమె నెలకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు అద్దె చెల్లించనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

నిజానికి ఈ అపార్ట్‌మెంట్లోకి మొదట వరుణ్ ధావన్ వద్దామని అనుకున్నా.. డీల్ కుదరలేదట. ఇప్పుడు శ్రద్ధా మాత్రం ఈ డీల్ ఓకే చేసుకొని అందులోకి వెళ్లడానికి సిద్ధమవుతోంది.

అక్షయ్ కుమార్ కూడా అక్కడే..

ఇప్పుడు శ్రద్ధా కపూర్ వెళ్తున్న బిల్డింగ్ లోనే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఉంటున్నాడు. అందులోని ఓ లగ్జరీ డూప్లెక్స్ అపార్ట్‌మెంట్ అతని సొంతం. ఆ లెక్కన ఇప్పుడు శ్రద్ధ.. అతని పొరిగింట్లోకే వెళ్లబోతోంది. ఆమె నటించిన స్త్రీ2 మూవీలో అక్షయ్ కుమార్ కూడా అతిథి పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

నిజానికి ఇదే ఇంట్లోకి వెళ్లాలని భావించిన మరో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ కూడా ఈ స్త్రీ2 మూవీలో గెస్ట్ రోల్ పోషించాడు. క్లైమ్యాక్స్ లో భేడియాగా సర్కటాతో ఫైట్, శ్రద్ధ కపూర్ తో రొమాన్స్ తో వరుణ్ ఆకట్టుకున్నాడు. ఆ లెక్కన వరుణ్ భేడియా మూవీ సీక్వెల్లో శ్రద్ధ రోల్ పై ఆసక్తి నెలకొంది.

వరుణ్ తన చిన్ననాటి క్రష్ అని కూడా ఈ మధ్యే శ్రద్ధ చెప్పింది. అయితే తాను ప్రపోజ్ చేసినా వరుణ్ రిజెక్ట్ చేశాడని కూడా స్త్రీ2 ప్రమోషన్లలో భాగంగా శ్రద్ధ చెప్పింది. అయితే స్క్రీన్ పై మాత్రం ఈ ఇద్దరి మధ్య కెమెస్ట్రీ ప్రేక్షకులను బాగా అలరించింది.

స్త్రీ 2 మూవీ హవా

ఇక ఆగస్ట్ 15న రిలీజైన స్త్రీ2 మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ దూసుకెళ్తోంది. 13 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇక ఇండియాలోనే రూ.414 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టడం విశేషం.

ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాగా నిలుస్తోంది. రెండో వీకెండ్ కూడా మూవీ జోరు తగ్గలేదు. ఆ లెక్కన ఈ మూవీ ఇండియాలో రూ.500 కోట్ల మార్క్ దాటడం ఖాయమని అంచనా వేస్తున్నారు.