Shraddha Kapoor: అప్పుడే అతనికి ప్రపోజ్ చేశాను.. కానీ రిజెక్ట్ చేశాడు: స్త్రీ2 నటి శ్రద్ధా కపూర్ ఫస్ట్ క్రష్ ఈ హీరోనే-shraddha kapoor reveals how she proposed varun dhawan stree 2 actress shraddha kapoor ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shraddha Kapoor: అప్పుడే అతనికి ప్రపోజ్ చేశాను.. కానీ రిజెక్ట్ చేశాడు: స్త్రీ2 నటి శ్రద్ధా కపూర్ ఫస్ట్ క్రష్ ఈ హీరోనే

Shraddha Kapoor: అప్పుడే అతనికి ప్రపోజ్ చేశాను.. కానీ రిజెక్ట్ చేశాడు: స్త్రీ2 నటి శ్రద్ధా కపూర్ ఫస్ట్ క్రష్ ఈ హీరోనే

Hari Prasad S HT Telugu
Aug 19, 2024 02:19 PM IST

Shraddha Kapoor: ఈ మధ్యే స్త్రీ2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ తన ఫస్ట్ క్రష్ గురించి మాట్లాడింది. ఓ హీరోపై మనసు పడి ప్రపోజ్ చేస్తే అతడు రిజెక్ట్ చేశాడని ఆమె చెప్పడం విశేషం. ఇంతకీ ఆ హీరో ఎవరు? శ్రద్ధా ఫస్ట్ లవ్ స్టోరీ కథేంటో చూడండి.

అప్పుడే అతనికి ప్రపోజ్ చేశాను.. కానీ రిజెక్ట్ చేశాడు: స్త్రీ2 నటి శ్రద్ధా కపూర్ ఫస్ట్ క్రష్ ఈ హీరోనే
అప్పుడే అతనికి ప్రపోజ్ చేశాను.. కానీ రిజెక్ట్ చేశాడు: స్త్రీ2 నటి శ్రద్ధా కపూర్ ఫస్ట్ క్రష్ ఈ హీరోనే

Shraddha Kapoor: స్త్రీ2.. ఇప్పుడు బాలీవుడ్ లో సంచలనం రేపుతున్న మూవీ. నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది శ్రద్ధా కపూర్. ఈ సీక్వెల్లో తన నటన ద్వారా ఆమె ఆకట్టుకుంది. అయితే మూవీ సక్సెస్ తర్వాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రద్ధా.. ఈ స్త్రీ2 మూవీలో గెస్ట్ రోల్ పోషించిన వరుణ్ ధావనే తన ఫస్ట్ క్రష్ అని చెప్పడం విశేషం.

వరుణ్‌పై మనసు పడ్డాను కానీ..

బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ ఈ స్త్రీ2 మూవీలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చాడు. ఇందులో శ్రద్ధాతో ఓ సాంగ్ కూడా ఉంది. అయితే ఈ ఇద్దరు స్టార్ కిడ్స్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. వరుణ్ ధావన్ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు డేవిడ్ ధావన్ కొడుకు కాగా.. నటుడు శక్తి కపూర్ కూతురు ఈ శ్రద్ధా కపూర్.

ఒకప్పుడు డేవిడ్, శక్తి కలిసి చేస్తున్న సినిమా షూటింగ్ కు వెళ్లినప్పుడు తాను వరుణ్ కు ప్రపోజ్ చేసినట్లు శ్రద్ధ చెప్పింది. అయితే అతడు మాత్రం రిజెక్ట్ చేశాడట. "ఇది చాలా కాలం కిందట జరిగింది. చాలా మందికి తెలుసు. వరుణ్ నా ప్రపోజల్ రిజెక్ట్ చేశాడు. అది చాలా సరదాగా అనిపించింది. మేము మా డ్యాడ్స్ షూటింగ్ చూడటానికి వెళ్లాం.

నాకు చిన్నప్పుడు వరుణ్ పై ఓ చిన్నపాటి క్రష్ ఉండేది. మేము ఓ కొండ పైకి వెళ్లాము. అక్కడ ఆడుకున్నాం. అప్పుడు నేను వరుణ్ తో.. నేను ఒకటి ఉల్టా చెబుతాను.. నువ్వు సరిగ్గా చెప్పాలని అన్నాను. తర్వాత యూ లవ్ ఐ అని చెప్పాను. దానికి అతడు స్పందిస్తూ.. నాకు ఆడపిల్లలంటే ఇష్టం ఉండదు అని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు" అని శ్రద్ధ అప్పుడు జరిగిన విషయాన్ని పంచుకుంది.

వరుణ్, శ్రద్ధ మూవీస్

అప్పటి ఆ చిన్నారులే తర్వాతి కాలంలో బాలీవుడ్ లోకి అడుగుపెట్టి పలు సినిమాల్లో కలిసి నటించారు. శ్రద్ధ, వరుణ్ కలిసి ఏబీసీడీ 2, స్ట్రీట్ డ్యాన్స్ 3డీ సినిమాల్లో నటించడం విశేషం. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు స్త్రీ 2లోనూ కలిసి కనిపించారు. ఖూబ్‌సూరత్ అనే పాటలో ఈ ఇద్దరి మధ్య కెమెస్ట్రీ చాలా బాగుందన్న ప్రశంసలు వచ్చాయి.

2018లో వచ్చిన స్త్రీ మూవీకి సీక్వెల్ గా స్త్రీ 2 వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకుపైగా వసూలు చేసింది. ఈ సినిమాలో వరుణ్ ధావన్ తోపాటు తమన్నా, అక్షయ్ కుమార్ కూడా అతిథి పాత్రల్లో కనిపించారు.

స్త్రీ2 మూవీలో శ్రద్ధా కపూర్ తోపాటు రాజ్ కుమార్ రావ్, పంకజ్ త్రిపాఠీ, అభిషేక్ బెనర్జీ, అపర్‌శక్తి ఖురానాలాంటి వాళ్లు నటించారు. ఈ మూవీ వచ్చే నెలలో ప్రైమ్ వీడియోలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.