Horror Comedy Movie Box Office: బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతున్న హారర్ కామెడీ మూవీ.. ఓటీటీలోకి వచ్చేది ఆ రోజే-horror comedy movie stree 2 box office collection shraddha kapoor raj kumar rao movie nears 200 crores stree 2 ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Horror Comedy Movie Box Office: బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతున్న హారర్ కామెడీ మూవీ.. ఓటీటీలోకి వచ్చేది ఆ రోజే

Horror Comedy Movie Box Office: బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతున్న హారర్ కామెడీ మూవీ.. ఓటీటీలోకి వచ్చేది ఆ రోజే

Hari Prasad S HT Telugu
Aug 18, 2024 03:50 PM IST

Horror Comedy Movie Box Office: ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజైన హారర్ కామెడీ మూవీ స్త్రీ 2 బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు చేరవవుతున్న ఈ సినిమా.. ఓటీటీ రిలీజ్ డేట్ కూడా దాదాపు ఖాయమైనట్లే కనిపిస్తోంది.

బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతున్న హారర్ కామెడీ మూవీ.. ఓటీటీలోకి వచ్చేది ఆ రోజే
బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతున్న హారర్ కామెడీ మూవీ.. ఓటీటీలోకి వచ్చేది ఆ రోజే

Horror Comedy Movie Box Office: ఇండిపెండెన్స్ డే రోజు తెలుగు, తమిళం, హిందీల్లో ఎన్నో సినిమాలు రిలీజైనా.. బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న మూవీ మాత్రం స్త్రీ 2. ఈ హారర్ కామెడీ మూవీ 2018లో వచ్చిన స్త్రీ మూవీకి సీక్వెల్. మొదటి సినిమాను మించిన సీక్వెల్ ఉందన్న పాజిటివ్ టాక్ తో ఈ సినిమా మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.188 కోట్లు వసూలు చేయడం విశేషం.

స్త్రీ 2.. రూ.200 కోట్ల దిశగా..

శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావ్, పంకజ్ త్రిపాఠీ, అభిషేక్ బెనర్జీలాంటి వాళ్లు నటించిన స్త్రీ 2 మూవీ నవ్విస్తూ, భయపెడుతూ బాక్సాఫీస్ ను దున్నేస్తోంది. అమర్ కౌశిక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.188 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. అందులో కేవలం ఇండియాలోనే రూ.163 కోట్లు రాగా.. ఓవర్సీస్ మార్కెట్ నుంచి మరో రూ.25 కోట్లు వచ్చాయి.

ఆదివారం (ఆగస్ట్ 18) నాలుగో రోజు రూ.200 కోట్ల క్లబ్ లోకి ఎంటరవనుంది. హిందీలో ఖేల్ ఖేల్ మే, వేదాలతోపాటు తెలుగులో మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్, తమిళంలో తంగలాన్ లాంటి సినిమాలు రిలీజైనా.. వాటన్నింటినీ వెనక్కి నెట్టి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది స్త్రీ2 మూవీ. ఈ సినిమాలో సర్కటా అనే కొత్త దెయ్యం పాత్రను పరిచయం చేశారు.

చందేరి గ్రామంలోని వాళ్లు ఈ కొత్త విలన్ ను ఎలా ఎదుర్కొన్నారన్నది సినిమాలో చూడొచ్చు. ఈ మూవీలో తమన్నా ఓ స్పెషల్ సాంగ్ కూడా చేసింది. అంతేకాదు శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావ్, పంకజ్ త్రిపాఠీ, అభిషేక్ బెనర్జీల నటనకు కూడా ప్రేక్షకులు నీరాజనం పడుతున్నారు. మూవీలోని కామెడీ బాగా ఆకట్టుకుంటోంది.

స్త్రీ2 ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న స్త్రీ 2 మూవీ ఓటీటీలోకి కూడా వచ్చే నెలలోనే అడుగు పెట్టనుంది. ఈ మూవీ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. సాధారణంగా ఇప్పుడు సినిమాలన్నీ థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల్లోనే ఓటీటీల్లోకి వస్తున్నాయి. ఆ లెక్కన స్త్రీ 2 మూవీ సెప్టెంబర్ 13 లేదా 14న ప్రైమ్ వీడియోలోకి అడుగుపెట్టనుంది.

అయితే దీనిపై ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. పైగా సినిమాకు బాక్సాఫీస్ దగ్గర వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. థియేటర్లలో కాస్త ఎక్కువ రోజులే ఆడేలా కనిపిస్తోంది. అదే జరిగితే స్త్రీ2 ఓటీటీ రిలీజ్ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి.