Stree 2 box office: వారం రోజుల్లోనే రూ.300 కోట్లు.. బాక్సాఫీస్ దుమ్ము దులుపుతున్న హారర్ కామెడీ మూవీ-stree 2 box office collections shraddha kapoor raj kumar rao horror comedy movie collections near 300 crores in india ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Stree 2 Box Office: వారం రోజుల్లోనే రూ.300 కోట్లు.. బాక్సాఫీస్ దుమ్ము దులుపుతున్న హారర్ కామెడీ మూవీ

Stree 2 box office: వారం రోజుల్లోనే రూ.300 కోట్లు.. బాక్సాఫీస్ దుమ్ము దులుపుతున్న హారర్ కామెడీ మూవీ

Hari Prasad S HT Telugu
Aug 23, 2024 09:07 AM IST

Stree 2 box office: బాక్సాఫీస్ దగ్గర మరో హారర్ కామెడీ మూవీ దుమ్ము రేపుతోంది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్ట్ 15న రిలీజైన స్త్రీ 2 మూవీ 8 రోజుల్లోనే ఇండియాలో రూ.300 కోట్ల మార్క్ కు చేరువవడం విశేషం. ఈ జానర్ కు ఉన్న క్రేజ్ ఏంటో ఈ మూవీ మరోసారి నిరూపిస్తోంది.

వారం రోజుల్లోనే రూ.300 కోట్లు.. బాక్సాఫీస్ దుమ్ము దులుపుతున్న హారర్ కామెడీ మూవీ
వారం రోజుల్లోనే రూ.300 కోట్లు.. బాక్సాఫీస్ దుమ్ము దులుపుతున్న హారర్ కామెడీ మూవీ

Stree 2 box office: హారర్ కామెడీ సినిమాలను ఈ మధ్యే ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా ఏ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మూవీ అయినా.. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధిస్తోంది. అందుకు తాజా నిదర్శనం స్త్రీ 2 మూవీ. రాజ్ కుమార్ రావ్, శ్రద్ధా కపూర్, పంకజ్ త్రిపాఠీ, అభిషేక్ బెనర్జీ, అపర్‌శక్తి ఖురానా నటించిన ఈ మూవీ 8 రోజుల్లోనే రూ.300 కోట్లకు చేరువైంది.

స్త్రీ 2 బాక్సాఫీస్ కలెక్షన్లు

హారర్ కామెడీ జానర్.. అందులోనూ సీక్వెల్.. ఈ మధ్యకాలంలో ఇండియన్ సినిమాలో ఈ రెండింటి జోరు ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు స్త్రీ 2 మూవీ అదే చేస్తోంది. Sacnilk.com ప్రకారం ఈ సినిమా 8 రోజుల్లోనే కేవలం ఇండియాలోనే రూ.290.85 కోట్లు వసూలు చేయడం విశేషం. ఇక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.400 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసింది.

స్త్రీ 2 మూవీ ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజైంది. అయితే అంతకుముందు వేసి పెయిడ్ ప్రీమియర్స్ తోనే ఈ సినిమా రూ.8.5 కోట్లు వసూలు చేసింది. ఇక తొలి రోజు అయిన గురువారం (ఆగస్ట్ 15) రూ.51.8 కోట్లు రాబట్టింది. ఇక రెండో రోజు శుక్రవారం రూ.31.4 కోట్లు, మూడో రోజు రూ.43.85 కోట్లు, ఐదో రోజు అత్యధికంగా రూ.55.9 కోట్లు వసూలు చేసింది.

దీంతో ఫస్ట్ వీకెండ్ ను స్త్రీ 2 ఘనంగా ముగించింది. ఐదో రోజైన సోమవారం కూడా ఈ హారర్ కామెడీ జోరు కొనసాగించింది. రూ.38.1 కోట్లు వసూలు చేసింది. ఆరో రోజు రూ.25.8 కోట్లు, ఏడో రోజు రూ.19 కోట్లు, ఎనిమిదో రోజు రూ.16 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టినట్లు Sacnilk.com వెల్లడించింది. మొత్తంగా ఇండియాలోనే 8 రోజుల్లో రూ.290.85 కోట్లు వసూలు చేసింది.

స్త్రీ 2కు మంచి రెస్పాన్స్

2018లో వచ్చిన మూవీ స్త్రీకి సీక్వెల్ గా ఈ స్త్రీ 2 మూవీ వచ్చింది. ఆ సినిమా కంటే కూడా మంచి టాక్ తో ఈ సినిమా దూసుకెళ్తోంది. ఆ స్త్రీలో నటించిన వాళ్లందరితోపాటు ఈ సీక్వెల్లో సర్కటా అనే ఓ కొత్త విలన్ ను పరిచయం చేశారు. ఈ పాత్రలో ఏకంగా 7 అడుగుల 6 అంగుళాల పొడవు ఉన్న సునీల్ కుమార్ అనే వ్యక్తిని మేకర్స్ తీసుకొచ్చారు.

ఈ స్త్రీ 2 మూవీలోని కామెడీతోపాటు హారర్ ను కూడా ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావ్ నటనకు ఫిదా అవుతున్నారు. మూవీ జోరు చూస్తుంటే.. 9వ రోజు ఇండియాలో రూ.300 కోట్ల మార్క్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా పోటీ లేకపోవడంతో సెకండ్ వీకెండ్ కూడా ఈ సినిమా జోరు కొనసాగనుంది. ఈ మూవీతోపాటు రిలీజైన ఖేల్ ఖేల్ మే, వేదా మూవీస్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి.