Stree 2 Villain: ఇతని ఎత్తు 7 అడుగుల 6 అంగుళాలు.. వైరల్ అవుతున్న హారర్ కామెడీ మూవీ విలన్ ఫొటోలు-stree 2 villain sarkata sunil kumar height greater than the great khali ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Stree 2 Villain: ఇతని ఎత్తు 7 అడుగుల 6 అంగుళాలు.. వైరల్ అవుతున్న హారర్ కామెడీ మూవీ విలన్ ఫొటోలు

Stree 2 Villain: ఇతని ఎత్తు 7 అడుగుల 6 అంగుళాలు.. వైరల్ అవుతున్న హారర్ కామెడీ మూవీ విలన్ ఫొటోలు

Aug 21, 2024, 03:44 PM IST Hari Prasad S
Aug 21, 2024, 03:44 PM , IST

Stree 2 Villain: శ్రద్ధ కపూర్, రాజ్ కుమార్ రావ్ నటించిన హారర్ కామెడీ మూవీ స్త్రీ2 లో సర్కటా అనే విలన్ గా నటించిన ఈ వ్యక్తి ఎత్తు ఏకంగా 7 అడుగుల 6 అంగుళాలు. మూవీ రిలీజైన తర్వాత అసలు అతడు ఎవరో తెలుసుకోవడానికి ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఆ వ్యక్తి ఎవరు?

Stree 2 Villain: శ్రద్ధ కపూర్, రాజ్ కుమార్ రావ్ నటించిన స్త్రీ 2 మూవీ ఇప్పుడు బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఈ హారర్ కామెడీ మూవీ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. అయితే ఈ సినిమాలో సర్కటా అనే విలన్ పాత్ర పోషించిన వ్యక్తి, అతని ఎత్తు గురించి ఇప్పుడు చర్చ నడుస్తోంది.

(1 / 7)

Stree 2 Villain: స్త్రీ2 మూవీలో సునీల్ కుమార్ అనే వ్యక్తి ఈ సర్కటా అనే రోల్ పోషించినట్లు బాలీవుడ్ హంగామా వెల్లడించింది. జమ్ముకి చెందిన ఈ వ్యక్తి తన హైట్ తో ఆశ్చర్యపరుస్తున్నాడు.

(2 / 7)

Stree 2 Villain: ఇండియన్ ప్రొఫెషనల్ రెజ్లర్ ది గ్రేల్ ఖలీ కంటే కూడా ఎక్కువ ఎత్తు ఉన్నాడు సునీల్ కుమార్. ఇతడు ఏకంగా 7 అడుగుల 7 అంగుళాల పొడవు ఉండటం విశేషం. ఇతన్న ద గ్రేట్ ఖలీ ఆఫ్ జమ్ము అని కూడా పిలుస్తారు.

(3 / 7)

Stree 2 Villain: జమ్ముకశ్మీర్ లో సునీల్ కుమార్ ఓ కానిస్టేబుల్. అంతేకాకుండా అక్కడి రెజ్లింగ్ పోటీల్లోనూ పాల్గొంటాడు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి స్త్రీ2 మూవీలో విలన్ పాత్ర ఇవ్వడం విశేషం.

(4 / 7)

Stree 2 Villain: ద గ్రేట్ ఖలీలాగే డబ్ల్యూడబ్ల్యూఈలోకి వెళ్లడానికి 2019 ట్రయల్స్ లో పాల్గొన్నా విఫలమయ్యాడు. అయితే వాలీబాల్, హ్యాండ్ బాల్ ఆటల్లో నిపుణుడైన సునీల్ కు స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ ఉద్యోగం లభించింది.

(5 / 7)

Stree 2 Villain: స్త్రీ2 టీమ్ మొత్తం ఈ సునీల్ కుమార్ తో ప్రత్యేకంగా ఫొటోలు దిగింది. అందులో మూవీలో ఓ ఐటెమ్ సాంగ్ లో నటించిన తమన్నా కూడా ఉంది. సినిమాలో సునీల్ కుమార్ శరీరాన్ని తాము వాడుకున్నామని, సర్కటా తలను మాత్రం గ్రాఫిక్స్ ద్వారా రూపొందించినట్లు డైరెక్టర్ అమర్ కౌశిక్ చెప్పాడు.

(6 / 7)

Stree 2 Villain: స్త్రీ2 మూవీ ఆగస్ట్ 15న రిలీజైన విషయం తెలిసిందే. ఈ మూవీ ఐదు రోజుల్లోనే ఇండియాలో ఏకంగా రూ.254.44 కోట్లు వసూలు చేసింది.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు