Save The Tigers 2:సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ వ‌న్ రీవైండ్ - సీజ‌న్ 2లో స్టోరీ ఇదేనా?-save the tigers season 2 story cast and crew and streaming details save the tigers season one rewind ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Save The Tigers Season 2 Story Cast And Crew And Streaming Details Save The Tigers Season One Rewind

Save The Tigers 2:సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ వ‌న్ రీవైండ్ - సీజ‌న్ 2లో స్టోరీ ఇదేనా?

Nelki Naresh Kumar HT Telugu
Mar 12, 2024 12:48 PM IST

Save The Tigers 2: తెలుగు కామెడీ వెబ్ సిరీస్ సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 2 మార్చి 15 నుంచి డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. సీజ‌న్ వ‌న్‌లో ఏం జ‌రిగింది? సీజ‌న్‌లో 2 స్టోరీ ఎలా ఉంద‌బోతుందంటే?

సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 2
సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 2

Save The Tigers 2: ప్రియ‌ద‌ర్శి, అభిన‌వ్ గోమ‌టం, చైత‌న్య కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన తెలుగు వెబ్‌సిరీస్ సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 2 మ‌రో మూడు రోజుల్లో ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. మార్చి 15 నుంచి డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ వెబ్‌సిరీస్‌కు టాలీవుడ్ డైరెక్ట‌ర్స్‌ మ‌హి వి రాఘ‌వ్‌, ప్ర‌దీప్ అద్వైతం క‌థ‌ను అందించారు. తేజ కాకుమాను ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సుజాత‌, దేవ‌యాని, పావ‌ని గంగిరెడ్డి కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

మ‌రో మూడు రోజుల్లో సెకండ్ సీజ‌న్ స్ట్రీమింగ్ కాబోతోంది. సెకండ్ పార్ట్ స్టోరీ, క్యారెక్ట‌ర్స్‌తో ఆడియెన్స్ క‌నెక్ట్ కావ‌డానికి మార్చి 1 నుంచి 10 వ‌ర‌కు సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ వ‌న్‌ను ఫ్రీ స్ట్రీమింగ్ ఉంచింది. అస‌లు ఫ‌స్ట్ పార్ట్‌లో ఏం జ‌రిగింది...సేవ్ ది టైగ‌ర్స్ క‌థేమిటంటే?

ముగ్గురు స్నేహితుల క‌థ‌...

గంటా ర‌వి (ప్రియ‌ద‌ర్శి) బోరబండ బ‌స్తీలో పాల వ్యాపారం చేస్తుంటాడు. ఆ బ‌స్తీలో ఉండ‌టం భార్య హైమ‌వ‌తికి (సుజాత‌)) న‌చ్చ‌దు. గేటెడ్ క‌మ్యూనిటీకి వెళ్లిపోదామ‌ని ప‌ట్టుప‌డుతుంది. రైట‌ర్ కావాల‌నే ఆలోచ‌న‌తో సాఫ్ట్‌వేర్ జాబ్‌కు రిజైన్ చేస్తాడు రాహుల్ (అభిన‌వ్ గోమ‌టం). క‌థ‌లు రాయ‌కుండా ఇంటి ప‌నిమ‌నిషి ద‌గ్గ‌ర చిల్ల‌ర ఖ‌ర్చుల‌కు డ‌బ్బులు అప్పు తీసుకుంటూ టైమ్‌పాస్ చేస్తుంటాడు. ఇంటి బాధ్య‌త మొత్తం భార్య మాధురిపై (పావ‌ని గంగిరెడ్డి) ప‌డుతుంది.

భార్య రేఖ (దేవ‌యాని) డామినేష‌న్ కార‌ణంగా విక్ర‌మ్ చాలా ఇబ్బందులు ప‌డుతుంటాడు. అత‌డు చేసే ప్ర‌తి ప‌నిని త‌ప్పుప‌డుతుంటుంది రేఖ‌. గంటా ర‌వి, రాహుల్‌, విక్ర‌మ్ ముగ్గురు మంచి స్నేహితులుగా మారుతారు. ప్రేమించి పెళ్లాడిన మాధురిని రాహుల్ ఎందుకు అనుమానించాడు?రేఖ చేసిన ప‌ని వ‌ల్ల విక్ర‌మ్ ఉద్యోగం పోయే ప‌రిస్థితి ఎందుకొచ్చింది? భార్య, పిల్ల‌లు కోరిన‌ట్లుగానే గంటా ర‌వి బ‌స్తీని వ‌దిలిపెట్టాడా? ముగ్గురు ఫ్రెండ్స్ ను పోలీసులు ఎందుకు ప‌ట్టుకున్నారు అన్న‌దే సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 1 క‌థ‌.

భార్యాభ‌ర్త‌ల బంధంతో...

ప్రేమ‌, న‌మ్మ‌కం స్థానంలో భార్య భ‌ర్త‌ల మ‌ధ్య డామినేష‌న్‌, ఈగో, అనుమానాలు చోటు చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌న్న‌ది పూర్తి వినోదాత్మ‌కంగా మూడు జంటల క‌థ‌తో సేవ్ ది టైగ‌ర్స్ వెబ్‌సిరీస్‌లో చూపించాడు ద‌ర్శ‌కుడు తేజ కాకుమాను. ప్రియ‌ద‌ర్శి, అభిన‌వ్‌, చైత‌న్య కృష్ణ తమ కామెడీ టైమింగ్‌తో ఆక‌ట్టుకున్నారు.

హంస‌లేఖ కిడ్నాప్‌

తాగిన మ‌త్తులో హంస‌లేఖ అనే హీరోయిన్‌ను ముగ్గురు స్నేహితులు కిడ్నాప్ చేస్తారు. ఆ కేసులో అరెస్టైన త‌ర్వాత ఏం జ‌రిగింది? భ‌ర్త‌ల‌కు బుద్ది చెప్పేందుకు మాధువి, హైమావ‌తి, రేఖ ఎలాంటి ప్లాన్ చేస్తారు? ఈ ముగ్గురి జీవితంలోకి మ‌రో అమ్మాయి ఎలా వ‌చ్చింది అన్న‌దే సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 2లో చూపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ప్రియ‌ద‌ర్శి, అభిన‌వ్ గోమ‌టం, చైత‌న్య కృష్ణ‌, పావ‌ని గంగిరెడ్డి, దేవ‌యానితో పాటు సీర‌త్ క‌పూర్‌, బ‌ల‌గం వేణు కీల‌క పాత్ర‌లు పోషిస్తోన్నారు.మహి . వి రాఘవ్ దర్శకత్వం వహించిన యాత్ర 2 మూవీ ఇటీవలే విడుదలైంది. ఏపీ సీఎం జగన్ జీవితంలోని ముఖ్య ఘట్టాలను ఆవిష్కరిస్తూ ఈ మూవీ తెరకెక్కింది.

IPL_Entry_Point