Saripodhaa Sanivaaram: సద్దుమణిగిన సమస్య.. ఆ థియేటర్లలో ‘సరిపోదా శనివారం’ టికెట్ల బుకింగ్స్ మళ్లీ ఓపెన్-saripodhaa sanivaaram ticket booking again opened in pvr inox theatres ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Saripodhaa Sanivaaram: సద్దుమణిగిన సమస్య.. ఆ థియేటర్లలో ‘సరిపోదా శనివారం’ టికెట్ల బుకింగ్స్ మళ్లీ ఓపెన్

Saripodhaa Sanivaaram: సద్దుమణిగిన సమస్య.. ఆ థియేటర్లలో ‘సరిపోదా శనివారం’ టికెట్ల బుకింగ్స్ మళ్లీ ఓపెన్

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 28, 2024 06:43 PM IST

Saripodhaa Sanivaaram: సరిపోదా శనివారం సినిమా విషయంలో నెలకొన్న ఓ సందిగ్ధత కొలిక్కి వచ్చింది. పీవీఆర్ - ఐనాక్స్ థియేటర్లలో ఈ మూవీ బుకింగ్స్ మళ్లీ ఓపెన్ అయ్యాయి. కొన్ని గంటల టెన్షన్ తర్వాత ఎట్టకేలకు ఆ థియేటర్లలో బుకింగ్స్ మళ్లీ మొదలయ్యాయి.

Saripodhaa Sanivaaram: సద్దుమణిగిన సమస్య.. ఆ థియేటర్లలో సరిపోదా శనివారం టికెట్ల బుకింగ్స్ మళ్లీ ఓపెన్
Saripodhaa Sanivaaram: సద్దుమణిగిన సమస్య.. ఆ థియేటర్లలో సరిపోదా శనివారం టికెట్ల బుకింగ్స్ మళ్లీ ఓపెన్

ఎన్నో అంచనాలు ఉన్న సరిపోదా శనివారం చిత్రం రేపు (ఆగస్టు 29) థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో హీరోగా నటించారు. ఈ మూవీపై హైప్ విపరీతంగా ఉంది. ప్రమోషన్లను కూడా మూవీ టీమ్ జోరుగా చేస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జోరుగా సాగుతున్నాయి.

అయితే, హైదరాబాద్ సహా కొన్ని చోట్ల పీవీఆర్ - ఐనాక్స్ మల్టీప్లెక్స్ థియేటర్లలో సరిపోదా శనివారం సినిమా టికెట్ల బుకింగ్స్ సడెన్‍గా నిలిచిపోయాయి. మూడు రోజుల క్రితం బుకింగ్స్ మొదలుకాగా.. గత రాత్రి సడెన్‍గా పీవీఆర్ - ఐనాక్స్ స్క్రీన్లలో ఈ మూవీ బుకింగ్స్.. బుక్ మై షో, పేటీఎం సహా ఆ సంస్థ ప్లాట్‍ఫామ్‍లో నిలిచిపోయాయి. దీంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. ఏం జరిగిందంటూ ఈ సినిమా మేకర్లను చాలా మంది సోషల్ మీడియాలో ప్రశ్నించారు.

మళ్లీ బుకింగ్స్ ఓపెన్

సరిపోదా శనివారం సినిమాకు సంబంధించి పీవీఆర్ ఐనాక్స్ థియేటర్లలో టికెట్ల బుకింగ్స్ నేటి (ఆగస్టు 28) సాయంత్రం మళ్లీ ఓపెన్ అయ్యాయి. దీంతో నాని ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఆ మల్టీప్లెక్స్‌లో ఈ మూవీ ఒకవేళ రిలీజ్ కాకపోతే కలెక్షన్లపై భారీ ప్రభావం పడుతుందనే ఆందోళన రేగింది. అయితే, మళ్లీ టికెట్ల బుకింగ్స్ షురూ అవటంతో అంతా సద్దుమణిగింది.

పీవీఆర్ ఐనాక్స్ థియేటర్లలో సరిపోదా శనివారం బుకింగ్స్ ఎందుకు నిలిచాయో నిర్దిష్టమైన కారణంగా మాత్రం వెల్లడికాలేదు. డిస్ట్రిబ్యూటర్లతో పర్సెంటేజ్ వ్యవహారం వల్లే ఇలా జరిగిందనే రూమర్లు వచ్చాయి. ఏదేమైనా ఎట్టకేలకు సమస్య సద్దుమణిగి పీవీఆర్ ఐనాక్స్ మల్టీప్లెక్స్‌ల్లో ఈ మూవీ బుకింగ్స్ మళ్లీ ఓపెన్ అయ్యాయి.

రన్‍టైమ్ ఇదే

సరిపోదా శనివారం సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. ఈ సినిమా 2 గంటల 54 నిమిషాల రన్‍టైమ్‍తో వస్తోంది. ఎక్కువ నిడివితోనే అడుగుపెడుతోంది.

జోరుగా ప్రమోషన్లు

సరిపోదా శనివారం సినిమా రేపు తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ రిలీజ్ కానుంది. తెలుగు సహా ఇతర భాషల కోసం కూడా నాని జోరుగా ప్రమోషన్లను చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ సిటీలకు వెళుతున్నారు. వరుసగా ఇంటర్వ్యూలను ఇస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‍లో ప్రమోషన్లతో బాగానే హైప్ పెంచింది మూవీ టీమ్. ట్రైలర్ ఆకట్టుకోవటంతో అంచనాలు అదే రేంజ్‍లో ఉన్నాయి.

సరిపోదా శనివారం సినిమాలో నానికి జోడీగా ప్రియాంక మోహన్ నటించారు. శనివారం మాత్రం కోపం ప్రదర్శించే హీరో అనే డిఫరెంట్ పాయంట్‍తో ఈ మూవీని తెరకెక్కించారు దర్శకుడు వివేక్ ఆత్రేయ. ఈ చిత్రంలో ఎస్‍జే సూర్య నెగెటివ్ రోల్ చేశారు. నాని - సూర్య మధ్య పోరు ఈ మూవీలో ఇంటెన్స్‌గా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. సాయికుమార్, అభిమామి, అదితి బాలన్, మురళీ శర్మ కీరోల్స్ చేశారు.

సరిపోదా శనివారం ఈ చిత్రానికి జేక్స్ బెజోయ్ సంగీతం ఇస్తున్నారు. టీజర్, ట్రైలర్‌లో బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్‍కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో మ్యూజిక్ విషయంలోనూ ఈ మూవీపై క్యూరియాసిటీ ఉంది. డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, దాసరి కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నాని కెరీర్‌లో హైయెస్ట్ బడ్జెట్ చిత్రంగా ఈ మూవీ రూపొందింది.