Hero Nani: నేను బ్యాక్‌ సీట్ తీసుకున్నా.. ఇక వాళ్లపైనే భారం ఉంది.. నేచురల్ స్టార్ నాని కామెంట్స్-natural star nani comments on saripodhaa sanivaaram movie and actors sj suryah priyanka arul mohan murali sharma ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hero Nani: నేను బ్యాక్‌ సీట్ తీసుకున్నా.. ఇక వాళ్లపైనే భారం ఉంది.. నేచురల్ స్టార్ నాని కామెంట్స్

Hero Nani: నేను బ్యాక్‌ సీట్ తీసుకున్నా.. ఇక వాళ్లపైనే భారం ఉంది.. నేచురల్ స్టార్ నాని కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Aug 28, 2024 11:23 AM IST

Natural Star Nani About Saripodhaa Sanivaaram Movie: నేచురల్ స్టార్ నాని నటించిన లెటెస్ట్ మూవీ సరిపోదా శనివారం. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ మూవీపై హీరో నాని ఆసక్తికర విశేషాలు పంచుకోవడమే కాకుండా తనకు సినిమాల్లో ఉండే భారంపై కామెంట్స్ చేశారు. దీంతో నాని కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

నేను బ్యాక్‌ సీట్ తీసుకున్నా.. ఇక వాళ్లపైనే భారం ఉంది.. నేచురల్ స్టార్ నాని కామెంట్స్
నేను బ్యాక్‌ సీట్ తీసుకున్నా.. ఇక వాళ్లపైనే భారం ఉంది.. నేచురల్ స్టార్ నాని కామెంట్స్

Nani Comments On Saripodhaa Sanivaaram: నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో మరోసారి తెరకెక్కిన సినిమా 'సరిపోదా శనివారం'. ఈ మూవీలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించగా.. డైరెక్టర్ అండ్ యాక్టర్ SJ సూర్య పవర్ ఫుల్ విలన్ రోల్ ప్లే చేశారు.

సరిపోదా శనివారం చిత్రాన్ని ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కళ్యాణ్ దాసరితో కలిసి నిర్మించారు. హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నేచురల్ స్టార్ నాని విలేకరుల సమావేశంలో 'సరిపోదా శనివారం' విశేషాలని పంచుకున్నారు.

మీరు సినిమాకు కష్టపడినట్లే ప్రమోషన్స్‌కి నెల రోజులు కేటాయిస్తుంటారు కదా?

-పెట్టాలని అర్ధమైయిందండి. ఇంతకుముందు నాకు కూడా ఆ థాట్ లేదు. సినిమాని కంటెంట్ చూసుకుంటుందనే ఫీలింగ్ ఉండేది. నిజంగానే కంటెంట్ సినిమాని చూసుకుంటుంది. అయితే అది రిలీజ్ అయిన తర్వాత. రిలీజ్‌కి ముందు పాజిటివిటీ, అందరికి రీచ్ చేయడం మన బాధ్యత.

-రెగ్యులర్‌గా మూవీస్ ఫాలో అయ్యేవారికి మా సినిమా గురించి ఆటోమేటిక్‌గా తెలుస్తుంది. అలా కాకుండా రెగ్యులర్‌గా ఫాలోకాని వారు, పనుల్లో బిజీగా ఉన్నవారి దగ్గరకి మన సినిమా ఇన్ఫర్మేషన్, ఐడియా తీసుకువెళ్లాలంటే అగ్రెసివ్‌గా ప్రమోషన్స్ చేయాలి. ఆసక్తిని కలిగించాలి. సినిమా చుడాలనే థాట్‌ని ట్రిగ్గర్ చేయడం చాలా పెద్ద పని.

ఇందులో మీకు ఎగ్జయిట్ చేసిన పాయింట్ ఏమిటి?

-ట్రైలర్‌లో ఏదైతే చూపించామో అది నాకు బాగా ఎగ్జయిట్ చేసింది. దాని నెరేటివ్ ఎలా ఉంటుందనే మీరు సినిమాలో చూడాలి. ఐడియాని ట్రైలర్‌లో చెప్పాం. ఆ ఐడియాని ఎలా ఎగ్జిక్యూటివ్ చేశామనేది తెలియాలంటే సినిమా చూడాలి.

ఈ చిత్రంలో మీకు ఛాలెజింగ్‌గా అనిపించిన పార్ట్ ఏమిటి?

- ఛాలెజింగ్ అంటూ ఏమీ లేదు. చాలా రిఫ్రెషింగ్‌గా అనిపించింది. జనరల్‌గా నా సినిమాలన్నిటిలో తెలియని ఒక బరువుని మోస్తుంటాను. అది ఈసారి ఎస్జే సూర్య గారి మీద, వివేక్ మీద ఉంది. నేను కొంచెం బ్యాక్ సీట్ తీసుకున్నాను. పెర్ఫార్మెన్స్ పరంగా ఎస్‌జే సూర్య, ప్రియాంక, మురళీ శర్మ.. ఇలా అందరిపై భారం ఉంది.

ఎస్‌జే సూర్య గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?

- ఎస్‌జే సూర్య గారితో కలసి పెర్ఫార్మ్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను. ఆయనకి చాలా అండర్‌స్టాడింగ్ ఉంటుంది. పెర్ఫార్మెన్స్‌లో ఆయన నుంచి ఒక కొత్త పెర్స్పెక్టివ్‌ని నేర్చుకోవచ్చు. ఆ రోల్‌కి ఆయన తప్పితే మరో చాయిస్ లేదు. డబ్బింగ్ దాదాపు ఏడు రోజులు చెప్పారు. అద్భుతంగా వచ్చింది. తన డబ్బింగ్ కోసం మరో రెండుసార్లు సినిమా చూస్తారు.

-సరిపోదా శనివారం చాలా మంచి కథ. అడ్రినలిన్‌ పంపింగ్ మూమెంట్స్ ఉంటాయి. కథ ప్రకారం ఆ అడ్రినలిన్‌ పంపింగ్ వందశాతానికి తీసుకెళ్లాం. సినిమా చాలా ఆర్గానిక్‌గా కుదిరింది. థియేటర్స్‌లో ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు.