Sandeep Reddy Vanga: కొడుకుకు యానిమల్ చూపించిన సందీప్ రెడ్డి వంగా.. అతని రియాక్షన్ ఏంటో తెలుసా?-sandeep reddy vanga reveals his son arjun reddy reaction animal movie and says animal underwear action scenes funny ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sandeep Reddy Vanga: కొడుకుకు యానిమల్ చూపించిన సందీప్ రెడ్డి వంగా.. అతని రియాక్షన్ ఏంటో తెలుసా?

Sandeep Reddy Vanga: కొడుకుకు యానిమల్ చూపించిన సందీప్ రెడ్డి వంగా.. అతని రియాక్షన్ ఏంటో తెలుసా?

Sanjiv Kumar HT Telugu
Feb 07, 2024 11:29 AM IST

Sandeep Reddy Vanga Son Arjun Reddy Reaction On Animal: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమాను తన కొడుకు అర్జున్ రెడ్డికి చూపించినట్లు తెలిపాడు. జనవరి 26 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో యానిమల్ స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.

కొడుకుకు యానిమల్ చూపించిన సందీప్ రెడ్డి వంగా.. అతని రియాక్షన్ ఏంటో తెలుసా?
కొడుకుకు యానిమల్ చూపించిన సందీప్ రెడ్డి వంగా.. అతని రియాక్షన్ ఏంటో తెలుసా?

Sandeep Reddy Vanga Son Arjun Reddy: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ గత ఏడాది విడుదలై అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ నటించిన యానిమల్ మూవీ అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. తాజాగా బాలీవుడ్ ప్రముఖ యాంకర్ సిద్ధార్థ్ కన్నన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యానిమల్ మూవీపై తన భార్య మనీషా, కుమారుడు అర్జున్ రెడ్డి ఎలా స్పందించారో సందీప్ రెడ్డి వంగా వెల్లడించాడు.

ఆ ఇంటర్వ్యూలో "యానిమల్ గురించి ప్రస్తుతం తీవ్రంగా చర్చ జరుగుతుంది కదా. మరి మీ ఏడేళ్ల కుమారుడు అర్జున్ రెడ్డి యానిమల్ సినిమాను చూశాడా?" అని సందీప్ రెడ్డి వంగాను సిద్ధార్థ్ కన్నన్‌ అడిగారు. దానికి "చూపించకూడని కొన్ని సన్నివేశాలను ఎడిట్ చేసిన యానిమల్ మూవీని ఓ హార్డ్ డిస్క్‌లో ఉంచాం. ఏ రేటింగ్ సీన్స్ ఉన్న సీన్‌లన్నీ కత్తిరించిన యానిమల్ ఎడిట్ వెర్షన్‌ను న్యూ ఇయర్ సందర్భంగా గోవాలో నా కొడుకుకు చూపించాను. అది వాడికి బాగా నచ్చింది" అని సందీప్ రెడ్డి వంగా తెలిపాడు.

"అయితే యానిమల్ సినిమాలో అండర్‌వేర్ యాక్షన్ సీన్స్ చాలా ఫన్నీగా ఉన్నాయని నా కొడుకు చెప్పాడు (నవ్వుతూ). ఇక సినిమాలో స్త్రీ పాత్రలను చూపించిన విధానంపై నా భార్య ఏం చెప్పలేదు. కానీ, రక్తపాతం విషయంలో కాస్తా అసంతృప్తి వ్యక్తం చేసింది. నిజానికి నా సినిమాలకు సంబంధించి కచ్చితమైన ఫీడ్ బ్యాక్ నా సోదరుడు ప్రణయ్ రెడ్డి నుంచే లభిస్తుంది. నేను ఒక ఫిల్మ్ మేకర్‌గా దానిని సీరియస్‌గా తీసుకుంటాను. అర్జున్ రెడ్డి అంత సక్సెస్ కావడానికి కారణం నా కుటుంబమే" అని సందీప్ రెడ్డి వంగా వెల్లడించాడు.

ఇదిలా ఉంటే తాను డైరెక్టర్‌గా నిలబండేందుకు అతని సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా చాలా కృషి చేశాడని సందీప్ రెడ్డి చెప్పాడు. "నా సినిమా చిత్రీకరణ సమయంలో ఫైనాన్షియర్స్ వెనక్కి తగ్గడంతో నా సోదరుడికి సంబంధించిన 36 ఎకరాల భూమిని అమ్మి డబ్బులు సినిమా కోసం ఖర్చు పెట్టాడు. ఆయన లేకపోతే సినిమా పూర్తి అయ్యేది కాదు" అని సందీప్ రెడ్డి వంగా పేర్కొన్నాడు. కాగా యానిమల్ మూవీపై విమర్శలు ఎన్ని వచ్చినా లాంగ్ రన్‌లో దాదాపుగా రూ. 900 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించింది.

ఇక ఓటీటీలోకి యానిమల్ మూవీ స్ట్రీమింగ్ కాగానే విమర్శలు మరింతగా ఎక్కువయ్యాయి. యానిమల్ మూవీపై అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు, బాలీవుడ్ కాంట్రవర్సీ బ్యూటి కంగనా రనౌత్ నెగెటివ్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో కంగనాకు సందీప్ రెడ్డి సినిమా కథ చెప్పే అవకాశం వస్తే చెబుతానని అన్నాడు. ఆ ఆఫర్‌ను కంగనా రనౌత్ తిరస్కరించింది. సందీప్ రెడ్డి వంగాను మెచ్చకుంటూనే ఇన్ డైరెక్ట్‌గా కౌంటర్స్ వేసింది.

కాగా యానిమల్ చిత్రంలో రణ్ బీర్ కపూర్‌తో పాటు రష్మిక మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి దిమ్రీ, సురేష్ ఒబెరాయ్, శక్తి కపూర్, ప్రేమ్ చోప్రా నటించారు. ఈ సినిమాలో తండ్రీకొడుకుల రిలేషన్ గురించి వయెలెన్స్‌తో చూపించారు.

WhatsApp channel