Sandeep Reddy Vanga: స్టార్ హీరో భార్యకు సందీప్ రెడ్డి వంగా కౌంటర్.. ముందు వెళ్లి నీ మాజీ భర్తను అడుగంటూ!
Animal Director Sandeep Reddy Vanga Slams Kiran Rao: యానిమల్ మూవీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేసిన లేటెస్ట్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగా. అసలు మ్యాటర్‌లోకి వెళితే..
Sandeep Reddy Vanga Reply To Kiran Rao: విజయ్ దేవరకొండ హీరోగా చేసిన అర్జున్ రెడ్డి సినిమాతో బోల్డ్ డైరెక్టర్‌గా సక్సెస్ కొట్టాడు సందీప్ రెడ్డి వంగా. 3 గంటల 6 నిమిషాల రన్ టైమ్‌తో అర్జున్ రెడ్డి మూవీని తెరకెక్కించడంతోపాటు సెన్సేషనల్ హిట్ కొట్టిన సందీప్ రెడ్డి వంగా పేరు అప్పట్లే మారుమోగిపోయిన విషయం తెలిసిందే. అనంతరం అదే సినిమాను హిందీలో షాహిద్ కపూర్, కియారా అద్వానీలతో కబీర్ సింగ్ టైటిల్‌తో రీమేక్ చేశాడు. అక్కడ కూడా కబీర్ సింగ్ మూవీ సూపర్ హిట్ కొట్టింది.
కొంచెం గ్యాప్‌తో గతేడాది యానిమల్‌ను ప్రేక్షకుల ముందు వదిలాడు బోల్డ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. 2023 డిసెంబర్ 1న 3 గంటల 21 నిమిషాల రన్ టైమ్‌తో థియేటర్లలో విడుదలైన యానిమల్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. సినిమా తొలి రోజు నుంచే ఫుల్ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోయింది. అంతేకాకుండా యానిమల్ మూవీలోని క్లిప్స్, డైలాగ్స్ సోషల్ మీడియాలో రచ్చ చేశాయి. అలాగే మీమ్స్ సైతం ట్రెండ్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా జమాల్ కుడు, బీజీఎమ్ స్కోర్‌కు విపరీతమైన క్రేజ్ వచ్చింది.
రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించిన యానిమల్ మూవీ లాంగ్ రన్‌లో రూ. 900 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించింది. ఇటీవలే రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో యానిమల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో యానిమల్ మూవీ చూసిన సెలబ్రిటీలు విమర్శలు చేస్తున్నారు. అదేం సినిమా అంటూ పలు కామెంట్స్‌తో తమ రివ్యూ ఇచ్చారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు సైతం యానిమల్ మూవీపై రియాక్ట్ అయింది.
బోల్డ్ కంటెంట్, స్త్రీల పట్ల ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయని కిరణ్ రావు అన్నారు. దాంతో ఆ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయింది. కిరణ్ రావు చేసిన కామెంట్స్‌పై తాజాగా ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూలో ఆమె పేరు ఎత్తకుండా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దాంతో సందీప్ రెడ్డి కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.
''ఈ రోజు ఉదయం నా ఏడీ (అసిస్టెంట్ డైరెక్టర్) నాకు ఒక ఆర్టికల్ చూపించారు. అవి సూపర్ స్టార్ రెండో మాజీ భార్య చేసిన కామెంట్స్. బాహుబలి 2, కబీర్ సింగ్ లాంటి సినిమాలు స్త్రీ వ్యతిరేకతను, వేధింపులను ప్రోత్సహిస్తున్నాయని ఆమె అంటున్నారు. వేధింపులకు, దగ్గరవడానికి మధ్య తేడా ఆమెకు తెలియదని నేను అనుకుంటున్నాను. ప్రజలు ఈ విషయాలను సందర్భోచితంగా చదివినప్పుడు వారు అంగీకరిస్తారు. ఇది పూర్తిగా తప్పు'' అని సందీప్ రెడ్డి వంగా అన్నాడు.
ఇంకా సందీప్ రెడ్డి కొనసాగిస్తూ "నేను కిరణ్ రావ్ గారికి ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. మీరు అమీర్ ఖాన్ నటించిన దిల్ సినిమా చూడండి. ఆ మూవీలో అమ్మాయిపై రేప్‌కు ప్రేరేపించే సీన్ ఉంటుంది. ఆ తర్వాత ఆమెనే తప్పు చేసినట్లుగా భావించేలా చేస్తాడు. అంతా జరిగినా చివరికీ అతడితోనే ఆమె ప్రేమలో పడుతుంది. మరి దీన్ని ఏమంటారు. ఇలాంటివి చూడకుండా ఎలా కామెంట్స్ చేస్తారో అర్థం కావడం లేదు" అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.
టాపిక్