Sandeep Reddy Vanga: విశ్వక్ సేన్ స్వయంగా మేకప్ చేసుకున్నాడు.. యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కామెంట్స్
Sandeep Reddy Vanga About Vishwak Sen Makeup: ఇటీవల యానిమల్ మూవీతో సాలిడ్ హిట్‌తోపాటు కాంట్రవర్సీలు ఎదుర్కొన్న సందీప్ రెడ్డి వంగా మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గామి మూవీ ట్రైలర్‌ను విడుదల చేశాడు. గామిలో విశ్వక్ సేన్ మేకప్‌పై సందీప్ రెడ్డి వంగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
Sandeep Reddy Vanga At Gaami Trailer Launch: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ అఘోరా వంటి డిఫరెంట్ రోల్‌లో నటించిన మూవీ గామి. విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోయిన్‌గా కలర్ ఫొటో ఫేమ్ చాందినీ చౌదరి నటించింది. కార్తిక్ కల్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై సినిమాను నిర్మించగా వీ సెల్యూలాయిడ్ సమర్పిస్తోంది. ఇదివరకు ఫస్ట్ లుక్‌తో అట్రాక్ట్ చేసిన గామి ట్రైలర్‌ను గురువారం యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రిలీజ్ చేశారు.
గామి ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో విశ్వక్ సేన్ మేకోవర్‌పై సందీప్ రెడ్డి వంగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. "గామిట్రైలర్ చాలా బాగుంది. చాలా అరుదైన సినిమా ఇది. ఆరేళ్ల పాటు ఒక సినిమాని అంకితభావంతో చేయడం మామూలు విషయం కాదు. యాక్టర్స్, డైరెక్టర్, నిర్మాతలకు చాలా పాషన్ ఉంటేనే ఇది సాధ్యం అవుతుంది. మేకప్ అందుబాటులో లేనప్పుడు విశ్వక్ స్వయంగా మేకప్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి" అని విశ్వక్ సేన్ మేకప్‌పై సందీప్ రెడ్డి వంగా చెప్పుకొచ్చాడు.
"గామి సౌండ్ డిజైన్ కలర్ గ్రేడింగ్ చాలా టెర్రిఫిక్‌గా ఉన్నాయి. థియేటర్స్‌లో చూసేటప్పుడు మంచి ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. చాలా డిఫరెంట్ మూవీ ఇది. ఈ సినిమా తప్పకుండా గొప్పగా ఆడాలని కోరుకుంటున్నాను. కథని చాలా డిఫరెంట్‌గా చెప్పారు. టీం అందరికీ గుడ్ లక్. మార్చి 8న తప్పకుండా చూడండి" అని యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గామి మూవీ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు.
"చిన్నగా మొదలై పెద్ద సినిమా అయ్యింది గామి. వంశీ గారు మమ్మల్ని బలంగా నమ్మారు. చాలా ఫ్రీడం ఇచ్చారు. సందీప్ అన్న చాలా హెల్ప్ చేశారు. గామి సినిమా చూస్తున్నంత సేపు తర్వాత ఏం జరుగుతుందనే ఎగ్జయిట్‌మెంట్ క్రియేట్ అవుతుంది. దాని కోసమే ఇన్నేళ్లు కష్టపడ్డాం. ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాం. మార్చి 8న కొత్త రకం తెలుగు సినిమాని చూస్తారని కోరుకుంటునన్నాను'' అని గామి డైరెక్టర్ విద్యాధర్ కాగిత తెలిపారు.
గామి సినిమాలో విశ్వక్, చాందినీతోపాటు ఎంజీ అభినయ, హారిక పెడదా, మహ్మద్ సమద్ కీలక పాత్రలు పోషించారు. ఇక గామి ట్రైలర్ విషయానికొస్తే అదిరిపోయింది. విశ్వక్ సేన్, సింహం సీన్‌తో ట్రైలర్ ప్రారంభంలోనే ఆసక్తి పెంచారు. 'నేనెవరినో, అసలు ఎక్కడి నుంచి వచ్చానో, నాకీ సమస్య ఎప్పటినుంచి ఉందో.. ఎంత ప్రయత్నించినా గుర్తు రావడం లేదు' అని విశ్వక్ సేన్ తనను తాను ప్రశ్నించుకునే సన్నివేశంతో ట్రైలర్‌ను స్టార్ట్ చేశారు.
కొందరు అఘోరాలు అతన్ని రక్షిస్తారు. అయితే మానవ స్పర్ష తగిలితే బతకలేని అతన్ని తమ మేలు కోసం ఆ ఆశ్రమాన్ని విడిచిపెట్టమని అడుగుతారు అఘోరాలు. తన వ్యాధికి ఎక్కడ మందు దొరుకుతుందో మాస్టర్ వివరాలు తెలియజేస్తాడు. అతను ఆ గడువులోపు హిమాలయాలలోని ఒక నిర్దిష్ట ప్రదేశానికి చాలా దూరం ప్రయాణించాలి. లేకపోతే అతను మరో 36 సంవత్సరాలు వేచి ఉండాలి. మరోవైపు, ఏకకాలంలో ఒక దేవదాసి, ఒక శాస్త్రవేత్త తన క్లినికల్ ట్రయల్స్ చేస్తున్న మరో రెండు కథలు కూడా చూపించారు.
ఇలా మూడు కథలతో గామి ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఇక గామి సినిమాను మార్చి 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ఈ సినిమాతో విశ్వక్ సేన్ ఎలాంటి హిట్ అందుకుంటాడో వేచి చూడాలి.