Vishwak Sen: యాక్టింగ్ చేయకుండా హీరో అయిన ఏకైక డైరెక్టర్ ఆయన.. విశ్వక్ సేన్ కామెంట్స్-vishwak sen comment on animal director sandeep reddy vanga in gaami trailer launch chandini chowdary speech at gaami ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vishwak Sen: యాక్టింగ్ చేయకుండా హీరో అయిన ఏకైక డైరెక్టర్ ఆయన.. విశ్వక్ సేన్ కామెంట్స్

Vishwak Sen: యాక్టింగ్ చేయకుండా హీరో అయిన ఏకైక డైరెక్టర్ ఆయన.. విశ్వక్ సేన్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Published Mar 01, 2024 08:05 AM IST

Vishwak Sen About Sandeep Reddy Vanga: వరుస సినిమాలో ఫుల్ జోష్ చూపిస్తున్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. ఇప్పుడు త్వరలో గామి అనే మూవీతో సిద్ధంగా ఉన్నాడు. తాజాగా గామి ట్రైలర్ విడుదలైంది. గామి ట్రైలర్ లాంచ్‌లో యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాపై విశ్వక్ సేన్ కామెంట్స్ చేశాడు.

యాక్టింగ్ చేయకుండా హీరో అయిన ఏకైక డైరెక్టర్ ఆయన.. విశ్వక్ సేన్ కామెంట్స్
యాక్టింగ్ చేయకుండా హీరో అయిన ఏకైక డైరెక్టర్ ఆయన.. విశ్వక్ సేన్ కామెంట్స్

Vishwak Sen At Gaami Trailer Launch: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించి లేటెస్ట్ మూవీ గామి. విశ్వక్ సేన్ కెరీర్‌లో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా గామి వస్తోంది. ఈ సినిమాకు విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించారు. కార్తిక్ కల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కార్తిక్ అండ్ క్రౌడ్ ఫండ్ చేశారు. V సెల్యులాయిడ్ ప్రజెంట్ చేస్తోంది. విద్యాధర్ కాగిత, ప్రత్యూష్ వత్యం స్క్రీన్ ప్లే రాశారు. గామిలో విశ్వక్ సేన్‌కు జోడీగా చాందినీ చౌదరి హీరోయిన్‌గా నటించింది.

మార్చి 8న ప్రేక్షకుల ముందుకు గామి సినిమా రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా గామి ట్రైలర్‌ను తాజాగా గురువారం (ఫిబ్రవరి 29) హైదరాబాద్ ప్రసాద్స్‌లోని PCX స్క్రీన్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. సినిమా గ్రాండ్ స్కేల్‌, గ్రాండియర్‌ని ప్రజెంట్ చేయడానికి ఈ బిగ్ స్క్రీన్‌ని ఎంచుకున్నారు మేకర్స్. పిసిఎక్స్ ఫార్మాట్‌లో తొలిసారిగా విడుదల చేసిన ట్రైలర్‌ను యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేశారు.

గామి సినిమాపై షోరీల్ ట్రైలర్ చాలా క్యూరియాసిటీని పెంచింది. ఇక గామి ట్రైలర్ లాంచ్‌లో యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాపై విశ్వక్ సేన్ కామెంట్స్ చేశాడు. "ఏడాది పూర్తి కాకముందే మరో సినిమాతో రావడం చాలా ఆనందంగా ఉంది. గామి మొదలుపెట్టినప్పుడు సరిగ్గా నా పేరు మీకు తెలీదు. దర్శకుడు విద్యాధర్ విజన్‌ని బలంగా నమ్మాము. అన్ని సినిమాలు వేరు ఈ సినిమా ఇచ్చిన కిక్ వేరు. చిన్న టీంతో మొదలుపెట్టి ఈ రోజు ఇంత బిగ్ స్క్రీన్‌లో ట్రైలర్ చూడటం చాలా ఆనందంగా ఉంది" అని విశ్వక్ సేన్ అన్నాడు.

"ఇందులో మాస్ డైలాగులు, విజల్ కొట్టే ఫైట్స్, ఐటెం సాంగ్స్ ఉండవు. కానీ, ఇవన్నీ ఇచ్చే ఫీలింగ్ సెకండ్ హాఫ్‌లో ఉంటుంది. ప్రతి తెలుగు ఫిల్మ్ మేకర్ గర్వంగా చెప్పుకునే సినిమా ఇది. ఈ సినిమా వర్క్ అవుట్ అయితే చాలా మంది కొత్త ఫిల్మ్ మేకర్స్ వస్తారు. దర్శకుడు చాలా కష్టపడ్డాడు. వంశీ గారికి ధన్యవాదాలు. ఇండియన్ ఆడియన్స్‌కి యాక్టింగ్ చేయకుండా హీరో అయిన ఏకైక డైరెక్టర్ సందీప్ అన్న ( నవ్వుతూ). తెలుగోళ్లు కాలర్ ఎత్తుకునేలా చేసి డైరెక్టర్ తను. సందీప్ అన్న ట్రైలర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది" అని విశ్వక్ తెలిపాడు.

"కార్తిక్ అండ్ క్రౌడ్ నుంచి ఫండ్ చేసిన అందరికీ చాలా చాల థాంక్స్. మార్చి 8 థియేటర్స్‌కి రండి కొత్తగా ర్యాంప్ అవుతుంది'' అని విశ్వక్ సేన్ నమ్మకంతో చెప్పాడు. హీరోయిన్ చాందనీ చౌదరి మాట్లాడుతూ "ట్రైలర్‌కు మించి సినిమా ఉంటుంది. ప్రతి విభాగం చాలా శ్రద్ధ పెట్టి చేసిన సినిమా ఇది. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను. మార్చి 8న తప్పకుండా అందరూ చూడాలి" అని తెలిపింది.

ఇదిలా ఉంటే గామి ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ట్రైలర్ ప్రధాన పాత్రల ప్రయాణాన్ని చూపించింది. ప్రతి కథ దాని అద్భుతంగా ఉంది. మానవ స్పర్శను అనుభవించలేని సమస్య ఉన్న విశ్వక్ సేన్ కథ, అతని జర్నీ అద్భుతంగా చూపించారు. కాగా గామి సినిమాలో విశ్వక్ సేన్, చాందినీ చౌదరి హీరోహీరోయిన్లుగా చేస్తుంటే ఎంజీ అభినయ, హారిక పెడాడ, మహ్మద్ సమద్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Whats_app_banner