Samantha Siddu Jonnalagadda Movie: డీజే టిల్లు హీరోతో స‌మంత మూవీ - ఓ బేబీ కాంబినేష‌న్ రిపీట్‌-samantha to team up with director nandini reddy for third time ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Samantha To Team Up With Director Nandini Reddy For Third Time

Samantha Siddu Jonnalagadda Movie: డీజే టిల్లు హీరోతో స‌మంత మూవీ - ఓ బేబీ కాంబినేష‌న్ రిపీట్‌

HT Telugu Desk HT Telugu
May 17, 2023 09:57 AM IST

Samantha Siddu Jonnalagadda Movie: స‌మంత, డైరెక్ట‌ర్ నందినిరెడ్డి కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ మూవీ రాబోతున్న‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమాలో యంగ్ హీరో న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

స‌మంత
స‌మంత

Samantha Siddu Jonnalagadda Movie: సినిమాల‌కు మించి హీరోయిన్‌ స‌మంత‌(Samantha), డైరెక్ట‌ర్ నందినిరెడ్డి మ‌ధ్య చ‌క్క‌టి స్నేహం ఉంది. క‌ష్ట‌స‌మ‌యాల్లో త‌న‌కు అండ‌గా నిలిచిన స‌న్నిహితుల్లో నందినిరెడ్డి ఒక‌రు అని స‌మంత ప‌లు సంద‌ర్భాల్లో వెల్ల‌డించింది. గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో జ‌బ‌ర్ధ‌స్త్‌తో పాటు ఓ బేబీ సినిమాలొచ్చాయి.

ట్రెండింగ్ వార్తలు

వాటిలో జ‌బ‌ర్ధ‌స్థ్ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్ట‌గా ఓ బేబీ మాత్రం క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. కొరియ‌న్ మూవీ మిస్ గ్రానీ రీమేక్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో స‌మంత న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఓ బేబీ మూవీ నిర్మాత‌ల‌కు డ‌బుల్ ప్రాఫిట్స్‌ను తెచ్చిపెట్టింది. తాజాగా స‌మంత‌, నందినిరెడ్డి కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ మూవీ రాబోతున్న‌ట్లు స‌మాచారం.

ఓ బేబీ త‌ర్వాత వీరిద్ద‌రి క‌లిసి మ‌రో సినిమా చేయ‌నున్న‌ట్లు చెబుతోన్నారు. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ (Siddu Jonnalagadda)కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

నందినిరెడ్డి గ‌త సినిమాల శైలిలోనే క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ మూవీ తెర‌కెక్కుతోన్న‌ట్లు తెలిసింది. త్వ‌ర‌లోనే స‌మంత‌, నందినిరెడ్డి హ్యాట్రిక్ మూవీకి సంబంధించిన‌ అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతోన్నారు.

నందినిరెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అన్నీ మంచిశ‌కున‌ములే మూవీ ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. ఈ సినిమాలో సంతోష్‌శోభ‌న్‌, మాళ‌వికానాయ‌ర్ జంట‌గా న‌టించారు. మ‌రోవైపు ఇటీవ‌లే శాకుంత‌లం సినిమాతో ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించింది స‌మంత‌.

ప్ర‌స్తుతం తెలుగులో ఖుషి సినిమా చేస్తోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ప్యూర్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ సెప్టెంబ‌ర్‌లో రిలీజ్ కానుంది. ఖుషితో పాటు సిటాడెల్ హిందీ వెబ్‌సిరీస్‌లోనూ న‌టిస్తోంది స‌మంత‌. సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ డీజే టిల్లు సీక్వెల్‌లో న‌టిస్తోన్నాడు. ఇందులో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.