Telugu Movies In Theaters This Week: స‌మంత‌కు బాక్సాఫీస్ వ‌ద్ద పోటీ లేదు - ఈ వారం తెలుగులో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే-no compitition for shaakuntalam samantha movie coming solo to theatres this week ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Movies In Theaters This Week: స‌మంత‌కు బాక్సాఫీస్ వ‌ద్ద పోటీ లేదు - ఈ వారం తెలుగులో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే

Telugu Movies In Theaters This Week: స‌మంత‌కు బాక్సాఫీస్ వ‌ద్ద పోటీ లేదు - ఈ వారం తెలుగులో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే

Nelki Naresh Kumar HT Telugu
Apr 10, 2023 07:15 AM IST

Telugu Movies In Theaters This Week: ఈ వారం థియేట‌ర్ల ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు మూడు సినిమాలు రాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవంటే...

స‌మంత శాకుంత‌లం
స‌మంత శాకుంత‌లం

Telugu Movies In Theaters This Week: ఈ వారం థియేట‌ర్ల‌లో స‌మంత (Samantha) శాకుంత‌లం సోలోగా రిలీజ్ కానుంది. శాకుంత‌లం మూవీకి పోటీగా టాలీవుడ్ నుంచి పెద్ద సినిమాలేవి ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం లేదు. మైథ‌లాజిక‌ల్ ల‌వ్‌స్టోరీగా రూపొందుతోన్న ఈ సినిమాకు గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు.

మ‌హాభార‌తంలోని దుష్యంతుడు, శ‌కుంత‌ల‌ల ప్ర‌ణ‌య‌గాథ ఆధారంగా గుణ‌శేఖ‌ర్ ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఇందులో టైటిల్ పాత్ర‌లో స‌మంత న‌టిస్తోండ‌గా దుష్యంతుడిగా మ‌ల‌యాళ న‌టుడు దేవ్‌మోహ‌న్ (Dev Mohan) క‌నిపించ‌బోతున్నారు. పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో తెలుగు, త‌మిళం, హిందీతో పాటు మిగిలిన భాష‌ల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

త్రీడీలో శాకుంత‌లం సినిమాను విడుద‌ల‌చేయ‌బోతున్నారు. తెలుగు, త‌మిళంతో పాటు హిందీ భాష‌ల్లో స‌మంత‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కార‌ణంగా అడ్వాన్స్ బుకింగ్స్‌ బాగానే ఉన్నాయి. హీరోయిన్ ఓరియెంటెడ్ క‌థాంశాల‌తో స‌మంత‌ సినిమా చేసిన సినిమాల్లో ఇదే హ‌య్యెస్ట్ బ‌డ్జెట్ మూవీ. ఈ నేప‌థ్యంలో ఈ వారం అస‌లు సిస‌లైన‌ బాక్సాఫీస్ టెస్ట్‌కు స‌మంత రెడీ అయ్యింది. ఈ ప‌రీక్ష‌లో ఆమె పాస్ అవుతుందా? లేదా? అన్న‌ది మ‌రో నాలుగు రోజుల్లో తేల‌నుంది.

రెండు డ‌బ్బింగ్ సినిమాలు రిలీజ్‌...

ఈ వారం రెండు త‌మిళ డ‌బ్బింగ్ సినిమాలు తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌బోతున్నాయి. రాఘ‌వ లారెన్స్ (Raghava Lawrence) రుద్రుడుగా ఈ వార‌మే థియేట‌ర్ల‌లోకి రాబోతున్నాడు. ఏప్రిల్ 14న ఈ సినిమా రిలీజ్ కానుంది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ సినిమాకు క‌తిరేశ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ప్రియాభ‌వానీ శంక‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన విడుద‌ల సినిమా ఏప్రిల్ 15న థియేట‌ర్ల‌లోకి రాబోతున్న‌ది. సూరి, విజ‌య్ సేతుప‌తి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాను తెలుగులో అల్లు అర‌వింద్ రిలీజ్ చేస్తోన్నారు. విడుద‌లై పేరుతో ఇటీవ‌లే త‌మిళంలో రిలీజైన ఈ సినిమా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని అందుకుంటోంది.

IPL_Entry_Point