DJ Tillu 2 Movie Update: టిల్లూ స్క్వేర్‌గా రాబోతున్న సిద్ధు.. ఇకపై ఎంటర్టైన్మెంట్ డబుల్-siddu jonnalagadda movie tillu square poster released amid 2023 new year ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dj Tillu 2 Movie Update: టిల్లూ స్క్వేర్‌గా రాబోతున్న సిద్ధు.. ఇకపై ఎంటర్టైన్మెంట్ డబుల్

DJ Tillu 2 Movie Update: టిల్లూ స్క్వేర్‌గా రాబోతున్న సిద్ధు.. ఇకపై ఎంటర్టైన్మెంట్ డబుల్

Maragani Govardhan HT Telugu
Dec 31, 2022 10:14 PM IST

DJ Tillu 2 Movie Update: సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లూకు సీక్వెల్ రాబోతుంది. టిల్లూ స్క్వేర్ పేరుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఈ సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు.

టిల్లూ స్క్వేర్‌గా సిద్ధు జొన్నలగడ్డ
టిల్లూ స్క్వేర్‌గా సిద్ధు జొన్నలగడ్డ

DJ Tillu 2 Movie Update: టాలీవుడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ దశాబ్ద కాలం నుంచి ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఓటీటీల పుణ్యామాని అదిరిపోయే విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన డీజే టిల్లూ సినిమాతో అతడి రేంజ్ వేరే లెవల్‍‌లోకి వెళ్లిందనే చెప్పాలి. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో ఈ చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించే పనిలో పడింది చిత్రబృందం. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలుకాగా.. 2023 నూతన సంవత్సరం సందర్భంగా అప్డేట్ వచ్చింది. టిల్లూ స్క్వేర్(Tillu Square) పేరుతో పోస్టర్‌ను విడుదల చేసింది.

టిల్లూ స్క్వేర్ అంటూ సినిమా వివరాలను తెలియజేశారు మేకర్స్. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. వెల్కమ్ టూ టిల్లూ ఈవెంట్స్ అని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. నూతన సంవత్సరం సందర్భంగా డీజే టిల్లూ స్క్వేర్ పోస్టర్ కలర్‌ఫుల్‌గా ఉంది. ఇందులో సిద్ధు అదిరిపోయే ఫోజు పెట్టి ఆకర్షణీయంగా కనిపించాడు. పోస్టర్‌ను చూస్తుంటేనే టిల్లూ ప్రొఫెషన్ ఏంటో అర్థమవుతుంది.

డీజే టిల్లూకు సీక్వెల్‌గా రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ కంటే కూడా ఎంటర్టైన్మెంట్ డబుల్ ఉంటుందని మేకర్స్ హింట్ ఇచ్చారు. సిద్ధు క్యారెక్టరైజేషన్ క్రేజీగా ఉంటుందని, మరింత వినోదాత్మకంగా ఉంటుందని స్పష్టం చేశారు.

డీజే టిల్లు సీక్వెల్‌కు మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. నరుడా డోనరుడా, అద్భుతం లాంటి చిత్రాలను తెరకెక్కించిన ఇతడు ఇప్పుడు డీజే టిల్లు 2తో రూపొందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగ వంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం