Samantha: ఊ అంటావా పాటకు షారుక్ ఖాన్, విక్కీ కౌశల్ అదిరిపోయే స్టెప్పులు.. సమంత రియాక్షన్ వైరల్-samantha reacts to shah rukh khan vicky kaushal dance on oo antava song ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samantha: ఊ అంటావా పాటకు షారుక్ ఖాన్, విక్కీ కౌశల్ అదిరిపోయే స్టెప్పులు.. సమంత రియాక్షన్ వైరల్

Samantha: ఊ అంటావా పాటకు షారుక్ ఖాన్, విక్కీ కౌశల్ అదిరిపోయే స్టెప్పులు.. సమంత రియాక్షన్ వైరల్

Hari Prasad S HT Telugu
Sep 30, 2024 02:37 PM IST

Samantha: సమంత సూపర్ హిట్ సాంగ్ ఊ అంటావాకు బాలీవుడ్ స్టార్ హీరోలు షారుక్ ఖాన్, విక్కీ కౌశల్ డ్యాన్స్ చేశారు. ఈ వీడియో వైరల్ గా మారిన తర్వాత సామ్ దీనిపై స్పందించింది. ఇప్పుడామె రియాక్షన్ వైరల్ అవుతోంది.

ఊ అంటావా పాటకు షారుక్ ఖాన్, విక్కీ కౌశల్ అదిరిపోయే స్టెప్పులు.. సమంత రియాక్షన్ వైరల్
ఊ అంటావా పాటకు షారుక్ ఖాన్, విక్కీ కౌశల్ అదిరిపోయే స్టెప్పులు.. సమంత రియాక్షన్ వైరల్

Samantha: సమంత చేసిన సూపర్ హిట్ ఐటెమ్ సాంగ్ ఊ అంటావా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలుసు కదా. పుష్ప 1 మూవీకి ఈ సాంగ్ పెద్ద ప్లస్ అయింది. ఇప్పుడా పాటకు బాలీవుడ్ స్టార్ హీరోలు షారుక్ ఖాన్, విక్కీ కౌశల్ డ్యాన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో సోమవారం (సెప్టెంబర్ 30) ఈ వీడియోపై తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా సామ్ స్పందించింది.

సమంతగా షారుక్ ఖాన్

ఐఫా 2024లో భాగంగా అబు ధాబిలో జరిగిన ఈవెంట్లో వేదికపై షారుక్ ఖాన్, విక్కీ కౌశల్ చేసిన డ్యాన్స్ మూవ్స్ హైలైట్ గా నిలిచాయి. వాళ్లు పుష్ప 1 మూవీలో అల్లు అర్జున్, సమంత సాంగ్ ఊ అంటావా మావాపై స్టెప్పులేశారు. వీళ్లలో సమంతగా షారుక్, అల్లు అర్జున్ గా విక్కీ కౌశల్ కనిపించడం విశేషం. ఈ ఇద్దరూ అవార్డుల షోకి హోస్టులుగా వ్యవహరించారు.

ఆ ఇద్దరు స్టార్ హీరో తన పాటపై డ్యాన్స్ చేయడం చూసి సమంత రియాక్టయింది. "ఎప్పటికైనా ఇలా జరుగుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు (లాఫింగ్, హార్ట్ ఎమోజీస్)" అని తన ఇన్‌స్టా స్టోరీస్ లో సామ్ రాసింది. నిజానికి ఈ పాటపై సమంత వేసిన స్టెప్పులు కూడా అప్పట్లో సంచలనం రేపగా.. ఇప్పుడీ ఇద్దరూ అవే స్టెప్పులతో అలరించారు.

ఊ అంటావా సాంగ్ గురించి..

మూడేళ్ల కిందట వచ్చిన పుష్ప ది రైజ్ మూవీలో సమంత ఊ అంటావా అంటూ ఓ ఐటెమ్ సాంగ్ చేసిన విషయం తెలుసు కదా. ఈ పాట ఆ సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఈ పాట చేయడం గురించి గతంలో ఇండియా టుడేతో సమంత స్పందించింది. "ఊ అంటావా పాట చేయడం ఫ్యామిలీ మ్యాన్ 2లో రాజీ పాత్ర చేయడం లాంటిదే. నేను తప్పులు చేయాలనుకున్నాను.

వాటి నుంచి నేర్చుకోవాలని అనుకున్నాను. నా గట్ ఫీలింగ్ ను నమ్మాలని అనుకున్నాను. ఓ నటిగా నాలోని ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించడం కోసమే నేను ఊ అంటావా పాట చేయాలని నిర్ణయించుకున్నాను. నా సెక్సువాలిటీతో నేనెప్పుడూ అసౌకర్యంగానే ఫీలయ్యేదాన్ని. నేను అంత సౌకర్యవంతంగా, కాన్ఫిడెంట్ గా లేను. నేను అంత బాగా లేను.. మిగిలిన అమ్మాయిలలాగా అందంగా లేను అన్న ఆలోచనతోనే నేనెప్పుడూ పని చేశాను" అని సమంత చెప్పుకొచ్చింది.

ఊ అంటావా పాట సమయంలో నాగ చైతన్యతో సమంత విడాకుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇలాంటి ఐటెమ్ సాంగ్స్ చేయొద్దని ప్రతి శ్రేయోభిలాషి, కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ చెప్పారని కూడా సమంత అప్పట్లో వెల్లడించింది.

Her Insta story.
Her Insta story.