Revanth Reddy Biopic: రేవంత్ రెడ్డి బయోపిక్ తీస్తా: బండ్ల గణేష్-revanth reddy biopic loading says bandla ganesh ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Revanth Reddy Biopic: రేవంత్ రెడ్డి బయోపిక్ తీస్తా: బండ్ల గణేష్

Revanth Reddy Biopic: రేవంత్ రెడ్డి బయోపిక్ తీస్తా: బండ్ల గణేష్

Hari Prasad S HT Telugu
Dec 06, 2023 10:29 PM IST

Revanth Reddy Biopic: తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డిపై బయోపిక్ తీస్తానని బండ్ల గణేష్ అనౌన్స్ చేశాడు. కాంగ్రెస్ కు వీరాభిమాని అయిన అతడు.. తెలంగాణ ఎన్నికల్లో ఆ పార్టీ విజయంతో మాంచి ఊపుమీదున్నాడు.

రేవంత్ రెడ్డితో బండ్ల గణేష్
రేవంత్ రెడ్డితో బండ్ల గణేష్

Revanth Reddy Biopic: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంచలన విజయం సాధించి పెట్టి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్న అనుముల రేవంత్ రెడ్డిపై బయోపిక్ తీయడానికి సిద్ధమవుతున్నాడు టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్. నవంబర్ 30న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించగా.. గురువారం (డిసెంబర్ 7) రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

yearly horoscope entry point

ఈ సందర్భంగా కాంగ్రెస్, రేవంత్ అభిమాని అయిన బండ్ల గణేష్ తాను బయోపిక్ తీయబోతున్నట్లు చెప్పడం విశేషం. విద్యార్థి నాయకుడి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ ఎదిగిన తీరు ఓ సినిమా స్టోరీకి ఏమాత్రం తక్కువ కాదనడంలో సందేహం లేదు. అలాంటి వ్యక్తి స్టోరీని బయోపిక్ గా తీయాలని అనుకుంటున్నట్లు బండ్ల గణేష్ చెప్పడం నిజంగా విశేషమే.

ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినప్పటి నుంచీ ఊపు మీదున్న గణేష్.. రేవంత్ ప్రమాణ స్వీకారం జరగబోయే ఎల్బీ స్టేడియానికి వెళ్లనున్నాడు. తన అభిమాన నేత సీఎంగా ప్రమాణం చేస్తుంటూ చూడాలని ఆరాటపడుతున్నాడు. ఈ సందర్భంగా ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడిన అతడు.. తన జీవితంలో రేవంత్ ఎదుర్కొన్న సవాళ్లను హైలైట్ చేస్తూ బయోపిక్ తీయాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశాడు.

నిజానికి 2018 ఎన్నికల్లోనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, అలా జరగకపోతే తాను బ్లేడుతో కోసుకుంటానని అప్పట్లో గణేష్ అనడం సంచలనం సృష్టించింది. కానీ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడటంతో అతన్ని దారుణంగా ట్రోల్ చేశారు. బ్లేడ్ గణేష్ అనే పేరు కూడా పెట్టారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంతో తనను ట్రోల్ చేసిన వారిని లక్ష్యంగా చేసుకుంటూ గణేష్ విమర్శలు గుప్పించాడు.

మరోవైపు జడ్పీటీసీగా ప్రస్థానం మొదలు పెట్టి, టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఆరేళ్లలోనే ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడంతోపాటు ముఖ్యమంత్రి కాబోతున్నారు రేవంత్ రెడ్డి. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం నుంచి గెలిచిన ఆయన.. కేసీఆర్ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కానున్న రెండో వ్యక్తిగా నిలిచారు.

Whats_app_banner