Ravi Teja vs Puri Jagannadh: రవితేజపై పూరి గుస్సా.. మిస్టర్ బచ్చన్ వర్సెస్ డబుల్ ఇస్మార్ట్‌పై టెన్షన్ టెన్షన్
Ravi Teja vs Puri Jagannadh: రవితేజ, డైరెక్టర్ పూరి జగన్నాథ్ మధ్య విభేదాలు వచ్చాయా? డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ రోజే మిస్టర్ బచ్చన్ ను పోటీగా రిలీజ్ చేస్తుండటంపై మాస్ మహారాజాపై పూరి గుస్సాగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
Ravi Teja vs Puri Jagannadh: రవితేజను మాస్ మహారాజాగా చేసిన డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఒకప్పుడు వీళ్ల కాంబినేషన్ టాలీవుడ్ లో ఓ సెన్సేషన్. అలాంటి ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు విభేదాలు వచ్చాయని సోషల్ మీడియాలో పుకార్లు వస్తుండటం సంచలనం రేపుతోంది. పూరి జగన్నాథ్ మూవీ డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ రోజే రవితేజ మిస్టర్ బచ్చన్ కూడా రానుండటం వీళ్ల మధ్య విభేదాలకు కారణంగా తెలుస్తోంది.
రవితేజ వర్సెస్ పూరి జగన్నాథ్
లైగర్ లాంటి డిజాస్టర్ మూవీ తర్వాత డబుల్ ఇస్మార్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు పూరి జగన్నాథ్. ఐదేళ్ల కిందట తనకు మంచి హిట్ అందించిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్ గా అదే రామ్ పోతినేనితో కలిసి ఈ డబుల్ ఇస్మార్ట్ చేశాడు. ఈ సినిమాను ఆగస్ట్ 15న రిలీజ్ చేయనున్నట్లు చాలా రోజుల కిందటే మేకర్స్ అనౌన్స్ చేశారు.
అయితే తాజాగా రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మిస్టర్ బచ్చన్ మూవీని కూడా అదే ఆగస్ట్ 15న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఇదే ఇప్పుడీ ఇద్దరి మధ్య విభేదాలకు కారణమైంది. తెలుగులో సోలో రిలీజ్ గా బాక్సాఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ సాధిద్దామని భావించిన డబుల్ ఇస్మార్ట్ టీమ్ కు ఇప్పుడు మిస్టర్ బచ్చన్ నుంచి గట్టి పోటీ ఎదురు కానుంది.
అడిగినా వినని మిస్టర్ బచ్చన్ టీమ్
ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే వీకెండ్ రిలీజ్ అంటే మంచి ఓపెనింగ్స్ ఖాయమని డబుల్ ఇస్మార్ట్ టీమ్ భావిస్తూ వచ్చింది. అయితే సడెన్ గా మిస్టర్ బచ్చన్ కూడా అదే రోజు రిలీజ్ చేయాలన్న నిర్ణయంతో వాళ్ల ప్లాన్స్ కు గట్టి దెబ్బే తగిలింది. నిజానికి మిస్టర్ బచ్చన్ రిలీజ్ ను వాయిదా వేసుకోవాల్సిందిగా కోరుతూ ఛార్మీ అడిగినా కూడా రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ వినలేదని కూడా వార్తలు వస్తున్నాయి.
ఇది ఈ ఇద్దరి మధ్య దూరాన్ని మరింత పెంచిందని కూడా సోషల్ మీడియాలో పుకార్లు వస్తున్నా.. దీనిపై ఈ రెండు మూవీ టీమ్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. అయితే ఈ రెండు పెద్ద సినిమాల మధ్య పోటీలో ఎవరు పైచేయి సాధిస్తారన్న ఆసక్తి నెలకొంది. ఇటు పూరి, అటు రవితేజ.. ఇద్దరూ ఓ మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నారు. మధ్యలో రామ్ పరిస్థితి కూడా అలాగే ఉంది.
హిట్ కాంబినేషన్.. ఇప్పుడిలా..
టాలీవుడ్ లో రవితేజ ఎప్పటి నుంచో ఉన్నాడు. పూరి జగన్నాథ్ ఇండస్ట్రీలోకి రాకముందే లీడ్ రోల్ చేశాడు. కానీ 2001లో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, 2002లో వచ్చిన ఇడియట్, 2003లో వచ్చిన అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలతో రవితేజ కాస్తా మాస్ మహారాజాగా మారిపోయాడు.
ఈ క్రెడిట్ కచ్చితంగా పూరికే దక్కుతుందనడంలో సందేహం లేదు. అలాంటిది తనకో మాస్ ఇమేజ్ ఇచ్చిన దర్శకుడితోనే ఇప్పుడు రవితేజ పోటీ పడుతుండటం అభిమానులనూ ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది.