Ranveer Singh: రణ్‍వీర్ సింగ్ - ప్రశాంత్ వర్మ సినిమాకు టైటిల్ ఇదేనా?-ranveer singh and director prasanth varma movie reportedly titled as rakshas ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ranveer Singh: రణ్‍వీర్ సింగ్ - ప్రశాంత్ వర్మ సినిమాకు టైటిల్ ఇదేనా?

Ranveer Singh: రణ్‍వీర్ సింగ్ - ప్రశాంత్ వర్మ సినిమాకు టైటిల్ ఇదేనా?

Chatakonda Krishna Prakash HT Telugu
Published Apr 29, 2024 05:43 PM IST

Ranveer Singh - Prasanth Varma Movie: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍వీర్ సింగ్‍తో టాలీవుడ్ యంగ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఓ మూవీ చేయనున్నారు. అయితే, ఈ సినిమా టైటిల్ కూడా ఖరారైందని సమాచారం బయటికి వచ్చింది.

Ranveer Singh: రణ్‍వీర్ సింగ్ - ప్రశాంత్ వర్మ సినిమాకు టైటిల్ ఇదేనా?
Ranveer Singh: రణ్‍వీర్ సింగ్ - ప్రశాంత్ వర్మ సినిమాకు టైటిల్ ఇదేనా?

Ranveer Singh - Prasanth Varma: హనుమాన్ చిత్రంతో సూపర్ బ్లాక్‍బస్టర్ కొట్టిన టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బాలీవుడ్‍లో ఎంట్రీ ఇవ్వనున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍వీర్ సింగ్‍తో ప్రశాంత్ ఓ చిత్రం తెరకెక్కించనున్నారు. ఇప్పటికే రణ్‍వీర్ సింగ్‍కు కథ కూడా చెప్పగా అది ఓకే అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ కూడా మొదలుకానుందని టాక్. అయితే, రణ్‍వీర్ - ప్రశాంత్ వర్మ కాంబోలో రూపొందనున్న ఈ మూవీకి టైటిల్ కూడా ఫిక్స్ అయిందని తాజాగా సమాచారం బయటికి వచ్చింది.

టైటిల్ ఇదేనా!

రణ్‍వీర్ సింగ్‍తో ప్రశాంత్ వర్మ చేసే సినిమాకు ‘రాక్షస్’ (Rakshas) అని టైటిల్ ఖరారు చేశారని తెలుస్తోంది. కాగా, ఈ సినిమాకు పూజా కార్యక్రమాలు కూడా ఏప్రిల్‍లోనే జరిగాయని కూడా టాక్. ఈ మూవీ స్క్రిప్ట్ రాసుకున్నప్పుడే రాక్షస్ అనే పేరును డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఫిక్స్ చేసుకున్నారని సమాచారం బయటికి వచ్చింది.

ప్రశాంత్ వర్మ చెప్పిన కథ, విజన్, అతడి లాంగ్ టర్మ్ ప్లాన్స్ రణ్‍వీర్ సింగ్‍కు బాగా నచ్చాయట. అందుకే ఈ మూవీకి ఓకే చెప్పారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో భాగంగానే ఈ ఈ మూవీ ఉండనుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందని తెలుస్తోంది.

పీవీసీయూలో తొలి చిత్రంగా ఈ ఏడాది జనవరి హనుమాన్ వచ్చింది. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీలోనూ బంపర్ హిట్ అయింది. ఈ మూవీని తక్కువ బడ్జెట్‍లోనే అద్భుతంగా తెరకెక్కించిన ప్రశాంత్ వర్మపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. దీంతో పాన్ ఇండియా రేంజ్‍లో ఆయన ఫేమస్ అయ్యారు. ఇక, రణ్‍వీర్ సింగ్‍తో మూవీని కూడా పీవీసీయూలో భాగంగానే ప్రశాంత్ తెరకెక్కించననున్నారు.

బ్యాక్‍డ్రాప్ ఇదే!

రణ్‍వీర్ - ప్రశాంత్ కాంబోలో ఈ చిత్రం పీరియడ్ డ్రామాగా ఉండనుందని తెలుస్తోంది. పురాణాల టచ్ కూడా ఉంటుందని టాక్. భారత స్వాతంత్య్రానికి ముందు కాలం నాటి బ్రాక్‍డ్రాప్‍లో ఈ చిత్రం ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో రణ్‍వీర్ క్యారెక్టర్ నెగెటివ్ షేడ్స్‌తో ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయాలపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకం నిర్మించనుంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. 2025లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ చిత్రంలో చేసే ఇతర నటీనటులు, టెక్నిషియన్లు సహా మిగిలిన వివరాలు క్రమంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.

2026కు జై హనుమాన్

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా రూపొందిన హనుమాన్ సినిమా ఈ ఏడాది జనవరి 12వ తేదీన రిలీజైంది. రూ.330కోట్లకు పైగా కలెక్షన్లతో భారీ బ్లాక్ బస్టర్ అయింది. దానికి సీక్వెల్‍గా జై హనుమాన్ చిత్రాన్ని తీసుకురానున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రాన్ని 2025లో రిలీజ్ చేస్తామని కూడా వెల్లడించారు. అయితే, రణ్‍వీర్ సింగ్‍తో సినిమా ఓకే అవటంతో ముందుగా దీన్నే ప్రశాంత్ వర్మ పూర్తి చేసేందుకు నిర్ణయించారట. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిలోనే విడుదల చేసేందుకు డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. పీవీసీయూలో తదుపరి మూవీగా రణ్‍వీర్ చిత్రమే ఉండనుంది. దీంతో జై హనుమాన్ సినిమా 2026కు వాయిదా పడనుందని తెలుస్తోంది. జై హనుమాన్ చిత్రాన్ని 3డీ, ఐమాక్స్ ఫార్మాట్లలోనూ తెస్తామని ఇటీవల పోస్టర్ కూడా తీసుకొచ్చారు మేకర్స్.

Whats_app_banner