Rc 16 Movie: చిరంజీవి చేతుల మీదుగా రామ్‌చ‌ర‌ణ్‌ - బుచ్చిబాబు మూవీ లాంఛ్‌ - జాన్వీ క‌పూర్ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌-ramcharan buchibabu movie launched with pooja ceremony chiranjeevi ar rahaman attends rc16 pooja ceremony janhvi kapoor ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ramcharan Buchibabu Movie Launched With Pooja Ceremony Chiranjeevi Ar Rahaman Attends Rc16 Pooja Ceremony Janhvi Kapoor

Rc 16 Movie: చిరంజీవి చేతుల మీదుగా రామ్‌చ‌ర‌ణ్‌ - బుచ్చిబాబు మూవీ లాంఛ్‌ - జాన్వీ క‌పూర్ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌

Nelki Naresh Kumar HT Telugu
Mar 20, 2024 11:53 AM IST

Rc 16 Movie: రామ్‌చ‌ర‌ణ్‌, బుచ్చిబాబు మూవీ బుధ‌వారం గ్రాండ్‌గా లాంఛ్ అయ్యింది. ఈ సినిమా ప్రారంభోత్స‌వ వేడుక‌ల‌కు హీరోయిన్ జాన్వీక‌పూర్ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది.

ఆర్‌సీ 16 ఓపెనింగ్ ఈవెంట్‌
ఆర్‌సీ 16 ఓపెనింగ్ ఈవెంట్‌

Rc 16 Movie: రామ్‌చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ బ‌డ్జెట్ మూవీ తెర‌కెక్కుతోంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ప‌వ‌ర్‌ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో జాన్వీక‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. రామ్‌చ‌ర‌ణ్ హీరోగా న‌టిస్తోన్న 16వ మూవీ ఇది.

బుధ‌వారం ఈ సినిమా అఫీషియ‌ల్‌గా మొద‌లైంది. ఈ మూవీ లాంఛింగ్ ఈవెంట్‌కు చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజ‌ర‌య్యారు. ఆయ‌న చేతుల మీదుగా సినిమా మొద‌లైంది. పూజా కార్య‌క్ర‌మాల‌ను భారీ స్థాయిలో నిర్వ‌హించారు. ఆర్‌సీ 16 లాంఛింగ్‌ ఈవెంట్‌లో జాన్వీక‌పూర్ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది. చీర‌క‌ట్టులో సంద‌డి చేసింది.

జాన్వీక‌పూర్‌తో పాటు శంక‌ర్‌...

ఆర్‌సీ 16 లాంఛ్ ఈవెంట్‌కు ఏఆర్ రెహ‌మాన్ హాజ‌ర‌య్యారు. ఆయ‌న‌తో పాటు శంక‌ర్‌, సుకుమార్ కూడా రామ్‌చ‌ర‌ణ్‌, బుచ్చిబాబు మూవీ ప్రారంభోత్స‌వ వేడుక‌ల్లో పాల్గొన్నాడు. వీరితో పాటు ప‌లువురు టాలీవుడ్ ప్ర‌ముఖులు ఈవెంట్‌లో సంద‌డిచేశారు. ఆర్‌సీ 16 లాంఛింగ్ ఈవెంట్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి. ఈ సినిమాకు ఆస్కార్ విన్న‌ర్ ఏఆర్ రెహ‌మాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాకు టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ప్ర‌జెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్నారు. వెంక‌ట స‌తీష్ కిలారు నిర్మిస్తోన్నారు.

250 కోట్ల బ‌డ్జెట్‌...

ఆర్‌సీ 16 మూవీ కంప్లీట్‌గా రా అండ్ ర‌స్టిక్‌గా ఉండ‌బోతున్న‌ట్లు తెలిసింది. ఈ సినిమా కోసం రామ్‌చ‌ర‌ణ్ స్పెష‌ల్ మేకోవ‌ర్ అవుతోన్న‌ట్లు మేక‌ర్స్ పేర్కొన్నారు. చ‌ర‌ణ్ కొత్త లుక్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు చెబుతున్నారు.దాదాపు 250 కోట్ల బ‌డ్జెట్‌తో రామ్‌చ‌ర‌ణ్, బుచ్చిబాబు సినిమాను మైత్రీ మూవీస్‌ నిర్మిస్తోన్న‌ట్లు స‌మాచారం. రామ్‌చ‌ర‌ణ్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్ మూవీగా ఆర్‌సీ 16 రూపుదిద్దుకోబోతున్న‌ది. త్వ‌ర‌లోనే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభంకానున్న‌ట్లు తెలిసింది.

ఉప్పెన త‌ర్వాత‌...

ఉప్పెన సినిమాతో డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు బుచ్చిబాబు. తొలి సినిమాతోనే వంద కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన డైరెక్ట‌ర్‌గా నిలిచాడు. ఉప్పెన త‌ర్వాత బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సినిమా ఇది. ఆర్‌సీ 16 క‌థను రెండేళ్లుగా బుచ్చిబాబు సానా సిద్ధం చేస్తున్నాడు.

గేమ్ ఛేంజ‌ర్ మూవీ...

మ‌రోవైపు ఆర్ఆర్ఆర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత శంక‌ర్‌తో గేమ్ ఛేంజ‌ర్ మూవీ చేస్తోన్నాడు రామ్‌చ‌ర‌ణ్‌. ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతోన్న ఈ సినిమా డిసెంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

షూటింగ్ పూర్తికాక‌ముందే గేమ్ ఛేంజ‌ర్ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో ద‌క్కించుకున్న‌ది. మంగ‌ళ‌వారం అమెజాన్ ప్రైమ్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. గేమ్ ఛేంజ‌ర్‌లో కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. 200 కోట్ల బ‌డ్జెట్‌తో దిల్‌రాజు ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో గేమ్ ఛేంజ‌ర్ రిలీజ్ అవుతోంది.

దేవ‌ర సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది జాన్వీక‌పూర్‌. ఈ సినిమా రిలీజ్ కాక‌ముందే ఆర్‌సీ 16లో రామ్ చ‌ర‌ణ్‌తో జోడీ క‌ట్టే అవ‌కాశాన్ని ద‌క్కించుకున్న‌ది. జాన్వీక‌పూర్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆమె హీరోయిన్‌గా న‌టించ‌నున్న విష‌యాన్ని అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు.

IPL_Entry_Point

టాపిక్