OTT Movies: ఈ వారం ఓటీటీలో 20 సినిమాలు.. మలయాళం బ్లాక్ బస్టర్ నుంచి ఆస్కార్ మూవీ దాకా స్ట్రీమింగ్, 4 స్పెషల్-ott movies and web series release on this week ott streaming movies netflix amazon prime disney plus hotstar jiocinema ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ott Movies And Web Series Release On This Week Ott Streaming Movies Netflix Amazon Prime Disney Plus Hotstar Jiocinema

OTT Movies: ఈ వారం ఓటీటీలో 20 సినిమాలు.. మలయాళం బ్లాక్ బస్టర్ నుంచి ఆస్కార్ మూవీ దాకా స్ట్రీమింగ్, 4 స్పెషల్

Sanjiv Kumar HT Telugu
Mar 18, 2024 11:22 AM IST

OTT Movies Releases This Week: ఈ వారం కూడా ఓటీటీల్లో చాలా సినిమాలు విడుదల కానున్నాయి. మొత్తంగా 20 మూవీస్ రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వాటిలో మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ అబ్రహం ఓజ్లర్ నుంచి ఆస్కార్ 2024లో 7 అవార్డ్స్ గెలుచుకున్న ఓపెన్ హైమర్ వరకు ఉన్నాయి.

ఈ వారం ఓటీటీలో 20 సినిమాలు.. మలయాళం బ్లాక్ బస్టర్ నుంచి ఆస్కార్ అవార్డ్ మూవీస్ వరకు స్ట్రీమింగ్
ఈ వారం ఓటీటీలో 20 సినిమాలు.. మలయాళం బ్లాక్ బస్టర్ నుంచి ఆస్కార్ అవార్డ్ మూవీస్ వరకు స్ట్రీమింగ్

OTT Movies Releases: ఎప్పటిలాగే కొత్త వారం వచ్చేసింది. సాధారణంగానే థియేటర్స్‌కి ప్రేక్షకులు వెళ్లడం తక్కువయ్యారు. అలాంటిది ఇప్పుడు పరీక్ష కాలం నడుస్తోంది. దాంతో థియేటర్లలో పెద్ద సినిమాలు ఏవి లేవు. కానీ, ఓం భీమ్ బుష్ వంటి కొన్ని క్రేజీ సినిమాలు ఉన్నాయి. ఇక ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలోకి ఏకంగా 20 సినిమాలు రానున్నాయి. వాటిలో మలయాళం బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల నుంచి ఆస్కార్ అవార్డ్ పొందిన ఓపెన్ హైమర్ వరకు ఉన్నాయి. మరి ఆ సినిమాలు, ఏ ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయో చూద్దాం.

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ

అబ్రహం ఓజ్లర్ (తెలుగు డబ్బింగ్‌గా మలయాళం సినిమా)- మార్చి 20 నుంచి స్ట్రీమింగ్

సాండ్ ల్యాండ్: ది సిరీస్ (జపనీస్ వెబ్ సిరీస్)- మార్చి 20న రిలీజ్

ఎక్స్-మ్యాన్ 97 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మార్చి 20

అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ (ఇంగ్లీష్ మూవీ)- మార్చి 22

డేవీ అండ్ జాన్సీస్ లాకర్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మార్చి 22

లూటేరే (హిందీ వెబ్ సిరీస్)- మార్చి 22

ఫొటోగ్రాఫర్ సీజన్ 1 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మార్చి 24

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

యంగ్ రాయల్స్ ఫరెవర్ (స్వీడిష్ చిత్రం)- మార్చి 18

త్రీ బాడీ ప్రాబ్లమ్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మార్చి 21

ఫైటర్ (హిందీ సినిమా)- మార్చి 21 (ప్రచారంలో ఉన్న తేది)

బైయింగ్ బేవర్లీ హిల్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మార్చి 22

షిర్లే (ఇంగ్లీష్ చిత్రం)- మార్చి 22

ది కసగ్రెనేడ్స్ మూవీ (ఇంగ్లీష్ చిత్రం)- మార్చి 22

అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ

మరక్కుమ నెంజమ్ (తమిళ సినిమా)- మార్చి 19

ఏ వతన్ మేరే వతన్ (హిందీ సినిమా)- మార్చి 21

రోడ్ హౌజ్ (ఇంగ్లీష్ సినిమా)- మార్చి 21

ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ

పామ్ రాయల్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మార్చి 20

ఆర్గిల్లీ (ఇంగ్లీష్ మూవీ)- మార్చి 23

ఫ్రూయడ్స్ లాస్ట్ సెషన్ (ఇంగ్లీష్ చిత్రం)- బుక్ మై షో- మార్చి 19

ఓపెన్ హైమర్ (ఆస్కార్ విన్నింగ్ మూవీ)- జియో సినిమా- మార్చి 21

ఆ నాలుగు స్పెషల్

ఇలా ఈ వారం మార్చి 18 నుంచి మార్చి 23 వరకు మొత్తంగా 20 సినిమాలు ఓటీటీలో విడుదల కానున్నాయి. వాటిలో 6 మార్చి 22న స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక వీటన్నింటిలో మలయాళ బ్లాక్ బస్టర్ సినిమా అబ్రహం ఓజ్లర్, ఆస్కార్ 2024లో 7 అవార్డ్స్ సాధించిన ఓపెన్ హైమర్ సినిమాలు తెలుగులో స్ట్రీమింగ్ కానున్నాయి. వీటితోపాటు సారా అలీ ఖాన్ నటించిన ఏ వతన్ మేరే వతన్, ఎక్స్ మ్యాన్ 97 సిరీస్ అందరి దృష్టిని ఆకర్షించనున్నాయి.

IPL_Entry_Point