Double iSmart OTT Release: డబుల్ ఇస్మార్ట్ సినిమా ఓటీటీలోకి వచ్చేది ఆ రోజేేనా?-ram pothineni action drama movie double ismart expected streaming ott release date date on amazon prime video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Double Ismart Ott Release: డబుల్ ఇస్మార్ట్ సినిమా ఓటీటీలోకి వచ్చేది ఆ రోజేేనా?

Double iSmart OTT Release: డబుల్ ఇస్మార్ట్ సినిమా ఓటీటీలోకి వచ్చేది ఆ రోజేేనా?

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 24, 2024 03:54 PM IST

Double iSmart OTT Release: డబుల్ ఇస్మార్ట్ సినిమా అంచనాలకు తగ్గట్టుగా బాక్సాఫీస్ వద్ద పర్ఫార్మ్ చేయలేకపోయింది. ఈ మూవీకి ఫుల్ క్రేజ్ ఉండటంతో రిలీజ్‍కు ముందే ఓటీటీ డీల్ ఫిక్స్ చేసుకుంది. అయితే, ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో తాజాగా సమాచారం బయటికి వచ్చింది.

Double iSmart OTT Release: డబుల్ ఇస్మార్ట్ సినిమా ఓటీటీలోకి వచ్చేది ఆ రోజేేనా?
Double iSmart OTT Release: డబుల్ ఇస్మార్ట్ సినిమా ఓటీటీలోకి వచ్చేది ఆ రోజేేనా?

సీనియర్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన డబుల్ ఇస్మార్ట్ సినిమా ఫుల్ క్రేజ్‍తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ చిత్రానికి చాలా హైప్ ఏర్పడింది. రామ్ - పూరి కాంబినేషన్‍లో 2019లో వచ్చి భారీ బ్లాక్‍బస్టర్ అయిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్ కావటంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అయితే, ఆగస్టు 15న విడుదలైన డబుల్ ఇస్మార్ట్ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. అంచనాలను ఈ మూవీ నిలబెట్టుకోలేకపోయింది. అయితే, ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడొస్తుందనే విషయంపై బజ్ నెలకొంది.

ఓటీటీ డేట్ ఇదేనా!

డబుల్ ఇస్మార్ట్ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. థియేటర్లలో రిలీజ్ కాకముందే ఈ డీల్ జరిగింది. విడుదలయ్యాక ఆరు వారాల తర్వాత తమ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు తెచ్చేలా మేకర్లతో ప్రైమ్ వీడియో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది.

దీంతో సెప్టెంబర్ 27వ తేదీన డబుల్ ఇస్మార్ట్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుందనే సమాచారం బయటికి వచ్చింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో సమాచారం చక్కర్లు కొడుతోంది. మూవీ థియేట్రికర్ రన్ మందకొడిగా ఉండటంతో ప్లాన్ మార్చి స్ట్రీమింగ్‍కు మరింత ముందుగానే ప్రైమ్ వీడియో తీసుకొస్తుందా.. లేకపోతే ముందుగా అనుకున్నట్టు సెప్టెంబర్ 27న తెస్తుందా అనేది చూడాలి.

భారీ ధరకు ఓటీటీ హక్కులు

డబుల్ ఇస్మార్ట్ సినిమా స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ రూ.33కోట్ల ధరకు కొనుగోలు చేసినట్టు ఇప్పటికే సమాచారం బయటికి వచ్చింది. థియేటర్లలో రిలీజ్‍కు ముందే ఈ ఒప్పందం జరిగింది. ఈ సీక్వెల్ మూవీకి మంచి క్రేజ్ ఉండటంతో ఓటీటీ హక్కుల కోసం భారీగానే ఖర్చు పెట్టింది ప్రైమ్ వీడియో. అందులోనూ థియేటర్ల రిలీజయ్యాక ఆరు వారాల తర్వాతే స్ట్రీమింగ్‍కు తీసుకురావాలని మేకర్స్, ప్రైమ్ వీడియో మధ్య డీల్ జరిగినట్టు సమాచారం.

డబుల్ ఇస్మార్ట్ కలెక్షన్లు

డబుల్ ఇస్మార్ట్ సినిమాకు ఓపెనింగ్ బాగానే వచ్చినా.. ఆ తర్వాత కలెక్షన్లలో డ్రాప్ కనిపించింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన రావటంతో ఆ ప్రభావం వసూళ్లపై పడింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం 8 రోజుల్లో ఈ మూవీ రూ.20కోట్ల మార్క్ దాటలేకపోయింది. ఇప్పటి వరకు సుమారు రూ.18 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించినట్టు అంచనాలు ఉన్నాయి. మొత్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీకి తీవ్ర నిరాశ ఎదురైంది.

డబుల్ ఇస్మార్ట్ సినిమాను కూడా పక్కా కమర్షియల్ మాస్ యాక్షన్ చిత్రంగా పూరి జగన్నాథ్ తెరకెక్కించారు. అయితే, ఈ సీక్వెల్ మూవీ జనాలను మెప్పించలేకపోయింది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్‍గా నటించారు. రామ్ పోతినేని సరసన కావ్య థాపర్ హీరోయిన్‍గా చేశారు. ఈ మూవీలో సీనియర్ కమెడియన్ అలీ చేసిన పాత్రపై విమర్శలు వచ్చాయి. పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మించిన ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించారు.