RGV on Indian films: హాలీవుడ్ సూపర్ హిట్ సినిమాను బాలీవుడ్ డిజాస్టర్‌తో పోల్చిన ఆర్జీవీ.. మన వాళ్లకు సినిమాలు తీయడం రాదట-ram gopal varma says we do not make movies like hollywood makers compares oppenheimer with thugs of hindostan ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rgv On Indian Films: హాలీవుడ్ సూపర్ హిట్ సినిమాను బాలీవుడ్ డిజాస్టర్‌తో పోల్చిన ఆర్జీవీ.. మన వాళ్లకు సినిమాలు తీయడం రాదట

RGV on Indian films: హాలీవుడ్ సూపర్ హిట్ సినిమాను బాలీవుడ్ డిజాస్టర్‌తో పోల్చిన ఆర్జీవీ.. మన వాళ్లకు సినిమాలు తీయడం రాదట

Hari Prasad S HT Telugu
Aug 02, 2024 04:31 PM IST

RGV on Indian films: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. హాలీవుడ్ సూపర్ హిట్ ఆస్కార్ విన్నింగ్ సినిమాను అతడు ఓ బాలీవుడ్ డిజాస్టర్ సినిమాతో పోల్చడం విశేషం.

హాలీవుడ్ సూపర్ హిట్ సినిమాను బాలీవుడ్ డిజాస్టర్‌తో పోల్చిన ఆర్జీవీ.. మన వాళ్లకు సినిమాలు తీయడం రాదట
హాలీవుడ్ సూపర్ హిట్ సినిమాను బాలీవుడ్ డిజాస్టర్‌తో పోల్చిన ఆర్జీవీ.. మన వాళ్లకు సినిమాలు తీయడం రాదట

RGV on Indian films: రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు ఎంత గొప్ప దర్శకుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే కొన్నేళ్లుగా అతడు దారుణమైన సినిమాలు తీస్తూ క్రమంగా కనుమరుగవుతున్నాడు. వివాదాస్పద కామెంట్స్, ట్వీట్స్ తో వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ కు అసలు సినిమాలు తీయడం రాదంటూ ఓ హాలీవుడ్ సూపర్ హిట్ సినిమాను బాలీవుడ్ డిజాస్టర్ మూవీతో పోల్చి చెప్పాడు.

మనవాళ్లకు సినిమా తీయడం రాదు

రామ్ గోపాల్ వర్మ తనపై ఎన్ని విమర్శలు వచ్చినా పెద్దగా పట్టించుకోడు. తాను చెప్పాలనుకున్నది చెప్పేస్తాడు. ప్రస్తుతం తాను దారుణమైన సినిమాలు తీస్తున్నా.. ఇప్పటికీ ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ కు హాలీవుడ్ వాళ్లలాగా అసలు సినిమాలు తీయడం రాదని అనడం గమనార్హం. తాజాగా గలాటా ప్లస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు హాలీవుడ్ ఆస్కార్ విన్నింగ్ మూవీ ఓపెన్‌హైమర్ ను హిందీలో డిజాస్టర్ గా నిలిచిన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ తో పోల్చాడు.

వయసు మీద పడినా హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఇప్పటి తరానికి తగిన సినిమాలు ఎలా తీస్తున్నారని ప్రశ్నించినప్పుడు ఆర్జీవీ చెప్పిన సమాధానం ఆసక్తికరంగా ఉంది. "మనం స్కోర్సీసి లేదా క్లింట్ ఈస్ట్‌వుడ్ లాంటి వాళ్ల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్లు ఎంత వాస్తవికతను, సమర్థవంతంగా చూపిస్తున్నారో తెలుస్తుంది. వాళ్లు ఆసక్తికర సబ్జెక్టులను తీసుకుంటున్నారు. అందుకు తగినట్లు అద్భుతమైన నటనను రాబడుతున్నారు. అన్నింటికీ మించి వాళ్ల ఆటిట్యూడే వాళ్ల సినిమాల్లో కనిపిస్తోంది" అని ఆర్జీవీ అన్నాడు.

అక్కడ అలా.. ఇక్కడ ఇలా..

"ముందుగా చెప్పాలంటే మనం అలాంటి సినిమాలు చేయం. ప్రేక్షకులకు ఏమీ తెలియదు అని మనం అనుకుంటాం. వాళ్లు తీసే సినిమాలు, అక్కడి బెంచ్‌మార్క్ ఎలా ఉందో చూడండి. మన దగ్గర ఎలా ఉందో చూడండి. అక్కడ స్టార్లందరూ కలిసి వచ్చి ఓపెన్‌హైమర్ లాంటి సినిమాలు చేస్తారు. ఇక్కడ మాత్రం పెద్ద స్టార్లు కలిసి థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ లాంటివి చేస్తారు" అని రామ్ గోపాల్ వర్మ అభిప్రాయపడ్డాడు.

ఒకప్పుడు తెలుగు, హిందీ ఇండస్ట్రీల్లో ఎన్నో హిట్ సినిమాలు తీసిన దర్శకుడు ఆర్జీవీ. ప్రస్తుతం అతనిలోని ఆ దర్శకుడు పూర్తిగా కనుమరుగయ్యాడు. అయితే ఎప్పుడో ఏదో ఒక వివాదాస్పద కామెంట్, ట్వీట్ తో మాత్రం వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ది కశ్మీర్ ఫైల్స్, యానిమల్ లాంటి ఎంతో మంది విమర్శించిన సినిమాలపై ప్రశంసల వర్షం కురిపించాడతడు.

ఇక ఇప్పుడు అసలు మనవాళ్లకు సినిమాలు తీయడమే రాదంటూ ఓ పెద్ద స్టేట్‌మెంటే ఇచ్చాడు. 1989లో శివ మూవీ ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతడు.. ఆ తర్వాత క్షణక్షణం, రంగీలా, సత్య, కౌన్, జంగిల్, కంపెనీ, భూత్, సర్కార్ లాంటి సినిమాలతో పేరు సంపాదించాడు. ఈ మధ్యే కల్కి 2898 ఏడీ మూవీలో తొలిసారి నటుడిగా ఓ చిన్న పాత్ర పోషించాడు.

Whats_app_banner