Rashmika Mandanna: మాజీ లవర్ రష్మిక మందన్నాతో ఇప్పటికీ టచ్‍లోనే ఉన్నా: కన్నడ హీరో-rakshit shetty says he is still in touch with ex fiancee rashmika mandanna ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rashmika Mandanna: మాజీ లవర్ రష్మిక మందన్నాతో ఇప్పటికీ టచ్‍లోనే ఉన్నా: కన్నడ హీరో

Rashmika Mandanna: మాజీ లవర్ రష్మిక మందన్నాతో ఇప్పటికీ టచ్‍లోనే ఉన్నా: కన్నడ హీరో

Rashmika Mandanna - Rakshit Shetty: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా, కన్నడ హీరో రక్షిత్ శెట్టికి ఒకప్పుడు ఎంగేజ్‍మెంట్ జరిగింది. ఆ తర్వాత వారు విడిపోయారు. అయితే, ఇప్పుడు తమ మధ్య బంధం ఎలా ఉందో తాజాగా చెప్పారు రక్షిత్. ఆ వివరాలివే..

రష్మిక మందన్నా, రక్షిత్ శెట్టి

Rashmika Mandanna - Rakshit Shetty: ‘777 చార్లీ’ చిత్రంతో గతేడాది సూపర్ హిట్ కొట్టారు కన్నడ హీరో రక్షిత్ శెట్టి. కన్నడతో పాటు తెలుగులోనూ ఈ మూవీ మంచి విజయం సాధించింది. రక్షిత్‍ తెలుగులోనూ పాపులర్ అయ్యారు. ఈ ఏడాది సప్తసాగర దాచె ఎల్లో (సైడ్-ఏ) చిత్రంతో మరోసారి బంపర్ హిట్ సాధించారు రక్షిత్. ఈ సినిమా ఇటీవలే 'సప్తసాగరాలు' దాటి పేరుతో తెలుగు రిలీజ్ అయింది. ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ మూవీగా సప్తసాగరాలు దాటి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తెలుగులోనూ మంచి ఆదరణ దక్కించుకుంది. ఈ తరుణంలో రక్షిత్ శెట్టి వరుసగా తెలుగు మీడియాకు కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో తన మాజీ ప్రేయసి రష్మిక మందన్నా విషయం ప్రస్తావనకు వచ్చింది. దీంతో రక్షిత్ స్పందించారు. ఆ వివరాలివే..

కొంత కాలం ప్రేమించుకున్న రక్షిత్ శెట్టి, రష్మిక మందన్నా 2017లో ఎంగేజ్‍మెంట్ చేసుకున్నారు. కానీ, పెళ్లి కాకుండానే వారు విడిపోయారు. అయితే, ఈ విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు రక్షిత్. రష్మికతో ఇప్పటికీ టచ్‍లోనే ఉన్నానని చెప్పారు. “నేను, రష్మిక.. అప్పుడు మేసేజ్‍లు చేసుకుంటుంటాం. అయితే రెగ్యులర్‌గా కాదు. ఎప్పుడు నా సినిమా రిలీజ్ అవుతున్నా.. ఆల్ ది బెస్ట్ విషెస్ చెబుతూ ఆమె మెసేజ్ చేస్తారు. ఎప్పుడు ఆమె సినిమా రిలీజ్ అవుతున్నా.. నేను కూడా విష్ చేస్తా. బర్త్ డే సందర్భాల్లో ఒకరికరం మేసేజ్‍లు చేసుకుంటాం” అని రక్షిత్ శెట్టి.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

రష్మిక - రక్షిత్ బంధం ఇదే..

2016లో రక్షిత్, రష్మిక కిరిక్ పార్టీ సినిమాలో కలిసి నటించారు. అప్పుడే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. దీంతో 2017లో ఇద్దరూ ఎంగేజ్‍మెంట్ చేసుకున్నారు. అయితే, 2018లో రక్షిత్, రక్షిత పరస్పర అంగీకారంతో ఎంగేజ్‍మెంట్ రద్దు చేసుకొని విడిపోయారు.

రౌడీ హీరో విజయ్ దేవరకొండతో రష్మిక ప్రేమలో ఉన్నారని చాలా కాలంగా రూమర్లు వస్తూనే ఉన్నాయి. వారిద్దరూ కలిసి బయట చాలా సార్లు కనిపించారు. అయితే, ఎన్ని రూమర్లు వస్తున్నా ఈ విషయంపై స్పందించడం లేదు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో కలిసి నటించారు విజయ్ - రష్మిక.

రక్షిత్ శెట్టితో తనకు సత్సంబంధాలు ఉన్నాయని రష్మిక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రక్షిత్ భార్యను కూడా తాను కలిశానని తెలిపారు.

రణ్‍బీర్ కపూర్‌తో కలిసి ప్రస్తుతం యానిమల్ సినిమా చేస్తున్నారు రష్మిక మందన్నా. ఇటీవలే ఈ చిత్రం నుంచి ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. అలాగే, అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న పుష్ప 2: ది రూల్ సినిమాలోనూ హీరోయిన్‍గా చేస్తున్నారు రష్మిక.