Jailer Web Series: ఓటీటీలోకి వ‌చ్చిన ర‌జ‌నీకాంత్ జైల‌ర్ అన్‌లాక్‌డ్ వెబ్‌సిరీస్‌ - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే!-rajinikanth jailer unlocked web series streaming now on sun nxt ott nelson anirudh kollywood ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Jailer Web Series: ఓటీటీలోకి వ‌చ్చిన ర‌జ‌నీకాంత్ జైల‌ర్ అన్‌లాక్‌డ్ వెబ్‌సిరీస్‌ - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే!

Jailer Web Series: ఓటీటీలోకి వ‌చ్చిన ర‌జ‌నీకాంత్ జైల‌ర్ అన్‌లాక్‌డ్ వెబ్‌సిరీస్‌ - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే!

Nelki Naresh Kumar HT Telugu
Aug 16, 2024 01:24 PM IST

Jailer Web Series: ర‌జ‌నీకాంత్ జైల‌ర్ మూవీపై ఓ డాక్యుమెంట‌రీ వెబ్‌సిరీస్ వ‌చ్చింది. జైల‌ర్ అన్‌లాక్‌డ్ పేరుతో రిలీజైన ఈ వెబ్‌సిరీస్ శుక్ర‌వారం నుంచి స‌న్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మూడు ఎపిసోడ్స్‌తో 91 నిమిషాల ర‌న్టైమ్‌తో జైల‌ర్ అన్‌లాక్‌డ్ వెబ్‌సిరీస్ విడుద‌లైంది.

జైల‌ర్ అన్‌లాక్‌డ్  ఈ వెబ్‌సిరీస్
జైల‌ర్ అన్‌లాక్‌డ్ ఈ వెబ్‌సిరీస్

Jailer Web Series: ర‌జ‌నీకాంత్‌జైల‌ర్ మూవీపై ఓ వెబ్‌సిరీస్ వ‌చ్చింది. జైల‌ర్ అన్‌లాక్‌డ్ పేరుతో రిలీజైన డాక్యుమెంట‌రీ వెబ్‌సిరీస్ శుక్ర‌వారం స‌న్ నెక్స్ట్ ఓటీటీలో రిలీజైంది. మొత్తం మూడు ఎపిసోడ్స్‌తో 91 నిమిషాల ర‌న్ టైమ్‌తో జైల‌ర్ అన్‌లాక్‌డ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ డాక్యుమెంట‌రీ సిరీస్‌కు సంబంధించిన పోస్ట‌ర్‌ను ట్విట్ట‌ర్ ద్వారా స‌న్‌నెక్స్ట్ ఓటీటీ అభిమానుల‌తో పంచుకున్న‌ది. ఈ పోస్ట‌ర్‌లో ర‌జ‌నీకాంత్‌తో పాటు డైరెక్ట‌ర్ నెల్స‌న్‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ క‌నిపిస్తోన్నారు.

ఇంట‌ర్వ్యూలు...రికార్డులు...

ఈ డాక్యుమెంట‌రీ సిరీస్‌ను జైల‌ర్ మూవీ విశేషాలు, రికార్డుల‌తో పాటు టెక్నీషియ‌న్ల ఇంట‌ర్వ్యూల‌తో రూపొందించారు. డైరెక్ట‌ర్ నెల్స‌న్ దిలీప్‌కుమార్‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్‌తో పాటు మిగిలిన సాంకేతిక నిపుణులు సినిమా రూప‌క‌ల్ప‌న‌లో త‌మ‌కు ఎదురైన అనుభ‌వాల‌ను స్వ‌యంగా ఇంట‌ర్వ్యూల రూపంలో ఈ సిరీస్‌లో వెల్ల‌డించారు.

ర‌జ‌నీకాంత్‌తో సినిమా చేసే అవ‌కాశం ఎలా వ‌చ్చింది? ఆయ‌న ఇమేజ్, క్రేజ్‌కు త‌గ్గ‌ట్లుగా క‌థ రాయ‌డంలో త‌న‌కు ఎదురైన స‌వాళ్ల‌ను గురించి డైరెక్ట‌ర్‌ నెల్స‌న్ ఈ డాక్యుమెంట‌రీ సిరీస్‌లో చెప్పిన‌ట్లు స‌మాచారం.

స్టార్ హీరోల పేర్లు...

ఈ మూవీలో మోహ‌న్‌లాల్‌, శివ‌రాజ్‌కుమార్‌ల‌ను గెస్ట్ పాత్ర‌ల కోసం ఎలా ఒప్పించింది? వారితో పాటు సినిమాలో గెస్ట్ పాత్ర‌ల కోసం ప‌రిశీలించిన మ‌రికొంద‌రు స్టార్ హీరోల పేర్ల‌ను నెల్స‌న్ ఈ సిరీస్‌లో బ‌య‌ట‌పెట్టిన‌ట్లు కోలీవుడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి.

మేకింగ్ సీన్స్‌...

కేవ‌లం ఇంట‌ర్వ్యూల‌ను మాత్ర‌మే కాకుండా జైల‌ర్ మూవీ మేకింగ్ సీన్స్ ను ఈ సిరీస్‌లో చూపించారు. యాక్ష‌న్ సీక్వెన్స్‌ల‌ను ఎలా తెర‌కెక్కించారు? అస‌లు తెర వెనుక ఏం జ‌రిగింది అన్న‌ది డీటైలింగ్‌తో ఇందులో ఆవిష్క‌రించిన‌ట్లు తెలిసింది.

650 కోట్ల కలెక్షన్స్…

గ‌త ఏడాది ఆగ‌స్ట్‌లో రిలీజైన జైల‌ర్ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద 650 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. 2023లో కోలీవుడ్‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన మూవీగా నిలిచింది. తెలుగులో డ‌బ్ అయిన ఈ మూవీ 85 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

మోహన్ లాల్ గెస్ట్ రోల్…

జైల‌ర్ మూవీలో ర‌జ‌నీకాంత్ యాక్టింగ్‌, ఆయ‌న హీరోయిజం అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి. ఈ మూవీలో త‌మ‌న్నా, ర‌మ్య‌కృష్ణ‌, యోగిబాబు, వ‌సంత్ ర‌వి, మిర్నామీన‌న్‌ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ మూవీలో మోహ‌న్‌లాల్‌, శివ‌రాజ్‌కుమార్‌తో పాటు బాలీవుడ్ న‌టుడు జాకీష్రాఫ్ కూడా గెస్ట్ రోల్‌లో క‌నిపించాడు. ప్ర‌స్తుతం జైల‌ర్ సీక్వెల్ రాబోతోంది. జైల‌ర్ 2 పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ మూవీ ఈ ఏడాది సెట్స్‌పైకిరానున్న‌ట్లు స‌మాచారం.

అమితాబ్ బచ్చన్ మెయిన్ రోల్…

ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్ జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞాన‌వేళ్ ద‌ర్శ‌క‌త్వంలో వెట్టైయాన్ మూవీ చేస్తోన్నాడు. ఇందులో అమితాబ్‌బ‌చ్చ‌న్ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. వెట్టైయాన్ త‌ర్వాత లోకేష్ క‌న‌క‌రాజ్‌తో ఓ మూవీ చేయ‌నున్నాడు ర‌జ‌నీకాంత్‌.