Naga Shaurya Fight on Road: రోడ్డుపై నాగశౌర్య హీరోయిజం.. సపోర్ట్ చేసిన రష్మీ.. నెటిజన్ల ట్రోలింగ్..!-anchor rashmi reacts on naga shaurya fight on road issue ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Naga Shaurya Fight On Road: రోడ్డుపై నాగశౌర్య హీరోయిజం.. సపోర్ట్ చేసిన రష్మీ.. నెటిజన్ల ట్రోలింగ్..!

Naga Shaurya Fight on Road: రోడ్డుపై నాగశౌర్య హీరోయిజం.. సపోర్ట్ చేసిన రష్మీ.. నెటిజన్ల ట్రోలింగ్..!

Maragani Govardhan HT Telugu
Mar 01, 2023 09:05 AM IST

Naga Shaurya Fight on Road: టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య నిన్న ఓ యువకుడిపై హీరోయిజం చూపాడు. తన లవర్‌ను యువకుడు కొట్టడంతో రియాక్షన్ అయిన నాగశౌర్య ఎందుకు అలా చేశావ్ అతడిని అంటూ నిలదీశాడు.

నాగశౌర్య గొడవపై స్పందించిన రష్మీ
నాగశౌర్య గొడవపై స్పందించిన రష్మీ

Naga Shaurya Fight on Road: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య వార్తల్లో నిలిచాడు. మంగళవారం నాడు రోడ్డుపైనే హీరోయిజం చూపించాడు. ఓ యువకుడు తన లవర్‌ను రోడ్డు మీద కొట్టాడు. దీంతో నాగశౌర్య కారులో నుంచి దిగి హీరోయిజం చూపించాడు. అమ్మాయిని రోడ్డుమీద కొడతావా? ఎంత ధైర్యం.. అసలు ఎందుకు కొట్టావ్ అంటూ అతడు చొక్కాను పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇందుకు సదరు యువకుడు కూడా ఆమె నా లవర్ నా ఇష్టమంటూ నాగశౌర్యతో వాదనకు దిగుతాడు. వీరిద్దరి గొడవను వీడియో తీయగా అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ గొడవపై నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు.

నాగశౌర్య ఆ యువకుడిని కొట్టడం కొంతమంది తప్పుపడుతుండగా.. మరికొంతమంది మాత్రం అతడి అలాగే కొట్టాలని మద్దతు తెలుపుతున్నారు. ఆడపిల్లల మీద చేయి చేసుకోవడం ఏంటి? అని నిలదీస్తున్నారు. ఇదే సమయంలో అతడి లవర్ అతడి ఇష్టం మధ్యలో వెళ్లడం సరికాదంటూ మరికొంతమంది అంటున్నారు. ఇదే విషయంలో ఓ అమ్మాయి.. అబ్బాయిని కొడితే ఇలాగే స్పందించేవారా? అని అడుగుతున్నారు.

తాజాగా ఈ కామెంట్లపై బుల్లితెర యాంకర్ రష్మీ స్పందించింది. యువకుడికి సపోర్ట్ చేస్తూ మాట్లాడిన నెటిజన్ల స్క్రీన్ షాట్లను షేర్ చేస్తూ వారిపై విరుచుకుపడింది. "వాడి లవర్ వాడి ఇష్టమంట. అమ్మాయే సపోర్ట్ చేస్తోందిగా.. ఇలాంటి కామెంట్లు చూస్తుంటే సిగ్గేస్తోంది. ఆ అమ్మాయి ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఎవరికి తెలుసు. మీరు మరో ఆత్మహత్య ఘటన జరగాలని కోరుకుంటున్నారా?" అంటు నిలదీసింది రష్మీ.

రష్మీ పోస్టుపై కొంతమంది తీవ్రంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆమె ఏం చేసినా ట్రోలింగ్ జరుగుతోంది. ఇటీవల అంబర్ పేట్‌ కుక్కల దాడిలో మృతిచెందిన బాలుడు ప్రదీప్ విషయంలో కలగజేసుకుని ట్రోలింగ్‌కు గురైన రష్మీ.. తాజాగా నాగశౌర్య ఫైట్ అంశంపై స్పందించి మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి గురవుతోంది.

మంగళవారం నాడు నాగశౌర్య కారులో వెళ్తుండగా.. రోడ్డుపై ఓ యువకుడు తన లవర్‌ను కొడతాడు. ఇది చూసిన నాగశౌర్య ఆ అమ్మాయిని ఎందుకు కొట్టావ్? రోడ్డుపై ఇలా ఎందుకు చేశావ్? సదరు యువకుడు కాలర్ పట్టుకుని నిలదీశాడు. ఇందుకు ఆమె నా లవర్ అంటూ వాదించే ప్రయత్నం చేశాడు. ఇందుకు సదరు యువతి కూడా తన బాయ్‌ఫ్రెండ్‌కే సపోర్ చేయడంతో నాగశౌర్యపై కొంతమంది నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మధ్యలోకి వెళ్లడం హీరో తప్పే అంటూ స్పందిస్తున్నారు.

Whats_app_banner